- October 25, 2021
T20 World Cup: అభిమానులకు రక్త కన్నీరు.. పాక్ చేతిలో భారత్ ఓటమి

T20 World Cup క్రికెట్ చరిత్రలో ఇలాంటి పరాజయం ఇది వరకు ఎన్నడూ జరగలేదు. టీ 20 ప్రపంచ కప్ మ్యాచుల్లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాక్ చేతిలో భారత్ దారుణంగా దెబ్బతింది. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా భారత్ పాక్ ధాటికి తట్టుకోలేకపోయింది. ఇక మన వాళ్లు ఫీల్డింగ్, బౌలింగ్‌లో తేలిపోయారు. మనం 20 ఓవర్లో ఏడు వికెట్లు పోగొట్టుకుని 151 రన్స్ చేస్తే మరో వైపు పాక్ వికెట్లు నష్టపోకుండానే ఓపెనర్లే దుమ్ములేపేశారు.
అంటే వాళ్ల బ్యాటింగ్ ఎలా ఉందో, మన బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాక్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (79 నాట్ అవుట్), కెప్టెన్ బాబర్ అజామ్ (68 నాట్ అవుట్) కేవలం 17.5 ఓవర్ల లోనే మ్యాచ్‌ను ముగించారు. దీంతో భారత్ ఓడిపోయింది. కోట్ల మంది అభిమానులకు రక్త కన్నీరు మొదలైంది. పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తారని ఆశలు పెట్టుకున్న కోట్ల మంది హృదయాలు బద్దలైపోయాయి. లక్షల మంది మ్యాచ్‌లను వీక్షించేందుకు దుబాయ్‌కు వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది.
అయితే ఓడింది ఒక్క మ్యాచే. ఇంకా నాలుగు మ్యాచ్‌లున్నాయి కదా? అని అభిమానులు తమకు తామే ధైర్యం చెప్పుకుంటున్నారు. మరి వాటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.