- October 22, 2021
నేను అలా అనలేదు!.. రషీద్ ఖాన్ క్లారిటీ

ఆఫ్గానిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్ ఐకాన్‌గా మారిపోయాడు. స్పిన్ బౌలింగ్ వేయడం, అవతల బ్యాటింగ్ చేస్తున్న క్రికెటర్‌ను మట్టుబెట్టడంలో రషీద్ ఖాన్ రాటు దేలిపోయయాడు. ఇప్పటికే రషీద్ ఐపీఎల్, బిగ్ బాస్ లీగ్ వంటి వాటిల్లో తన సత్తా చాటాడు. అయితే రషీద్ ఖాన్‌కు సంబంధించిన పెళ్లి వార్తలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి. ప్రపంచకప్ గెలిస్తేనే తాను పెల్లి చేసుకుంటాను అని చెప్పినట్టుగా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.
వాటిపై రషీద్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తలు చూసి నేను కూడా షాక్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు. నేను చెప్పింది ఒకటి బయటకు వచ్చింది ఇంకొకటి అన్నాడు. అయితే నేను ఎప్పుడూ కూడా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు ముడిపెట్టను అని స్పష్టం చేసేశాడు. ప్రపంచ కప్ గెలిచిన తరువాతే పెళ్లి చేసుకుంటానని నేను చెప్పలేదని అన్నాడు. వచ్చే మూడేళ్లలో బిజీగా ఉంటాను.. 2021, 2022, టీ 20 ప్రపంచకప్, 2023లో వన్డే ప్రపంచ కప్ వంటి టోర్నీలున్నాయి.. అందుకే ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదు.. నా ఫోకస్ అంతా కూడా టోర్నీల మీదే ఉందని చెప్పాను అని క్లారిటీ ఇచ్చాడు.