• October 19, 2021

ఒకసారి ఛార్జ్‌ చేస్తే 750 కి.మీ ప్రయాణించొచ్చా?

ఒకసారి ఛార్జ్‌ చేస్తే 750 కి.మీ ప్రయాణించొచ్చా?

    ప్రస్తుతం అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారన్న సంగతి తెలిసిందే. ఓ వైపు పెరిగే పెట్రోల్, డీజిల్ ధరలు.. మరో వైపు కాలుష్య నివారణ ఇలా అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లుతున్నారు. ఈక్రమంలోనే తయారీ సంస్థలు కూడా వాటిపై మరింత ఫోకస్ పెట్టేస్తున్నారు. యాపిల్‌, ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల కోసం స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే ఫాక్స్‌కాన్‌ విద్యుత్‌ కార్లను ఉత్పత్తి చేసే ప్రణాళికలను ప్రకటించింది.

    హాన్‌ హయ్‌ ప్రెసిషన్‌ ఇండస్ట్రీగా సుపరిచితమైన ఫాక్స్‌కాన్‌.. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి కోసం పలు వాహన సంస్థలు, ప్రతిష్ఠాత్మక స్టార్టప్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇటలీ సంస్థ పినిన్‌ఫార్నియా అభివృద్ధి చేసిన ‘ఇ సెడాన్‌’ మోడల్‌ను 2023లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అయిదు సీట్లు కలిగిన ‘మోడల్‌ ఇ’ను ఒకసారి ఛార్జ్‌ చేస్తే 750 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. ఫాక్స్‌కాన్‌ మొదటి విద్యుత్‌ బస్సు ‘మోడల్‌ టీ’పై ఒకసారి ఛార్జింగ్‌తో 400 కి.మీ వరకు ప్రయాణం చేయొచ్చని తెలిపింది. మొత్తానికి రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహానాల జోరే కనిపించేలా ఉంది.

    Leave a Reply