• November 16, 2025

రాముడిగా మహేష్.. జక్కన్న ప్లానింగ్ ఏంటో

రాముడిగా మహేష్.. జక్కన్న ప్లానింగ్ ఏంటో

    మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అనగానే అందరి అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మహేష్ లుక్ టోటల్‌గా రాజమౌళి ఛేంజ్ చేశాడన్న వార్త రావడం, గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో మహేష్ కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. మహేష్ కొత్త లుక్ చూసి అంతా సంబరపడ్డారు. మధ్యలో నార్మల్ లుక్‌లో మహేష్ కనిపించాడు. ఇప్పుడు కూడా అంత జుట్టు, గడ్డంతో కనిపించడం లేదు. అయితే ఆ లుక్ దేని కోసమై ఉంటుంది? అని ఇంత వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ నిన్న ఈవెంట్‌లో రాజమౌళి చెప్పిన మాటలతో ఓ విషయం స్పష్టమై ఉంటుంది.

    మహేష్ బాబుని ‘వారణాసి’ సినిమాలో చాలా గెటప్స్‌లో చూపించబోతోన్నాడు.. అందులో రాముడి పాత్ర కూడా ఒకటి.. రాముని పాత్ర కోసమే మహేష్ బాబు పొడవాటి జుట్టుని పెంచుకున్నాడని అర్థం అవుతోంది. ఆల్రెడీ రాముడి పాత్రకు సంబంధించిన సీన్లని కూడా షూట్ చేసినట్టుగా చెప్పేశాడు. అసలు రాముడిగా సెట్ అవుతాడా? లేడా? అని సందేహంతో చేసిన ఫోటో షూట్ అదిరిపోయిందని, ఆ ఫోటో కూడా తన ఫోన్‌కు వాల్ పేపర్‌గా పెట్టుకున్నట్టుగా జక్కన్న చెప్పాడు. మళ్లీ ఎవరైనా చూస్తే లీక్ అవుతుందని తరువాత తీసేశాడట.

    అలా ‘వారణాసి’  సినిమాను ఇది వరకు ఎవ్వరూ చూడనటువంటి కాన్సెప్ట్, కంటెంట్‌తో విజువల్ వండర్‌గా తీర్చి దిద్దుతున్నాడని తెలుస్తోంది. ఇక జక్కన్న ప్లానింగ్ చూస్తే ఈ సారి హాలీవుడ్ రికార్డులు కూడా బద్దలు అయ్యేలా కనిపిస్తోంది. వారణాసి అంటూ వదిలిన వీడియో, అందులోని ప్రపంచం.. ఖండాలు.. చూపించిన విజువల్స్, ఆ వీఎఫ్ఎక్స్.. మహేష్ బాబు ఎంట్రీకి అయితే ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయి ఉంటుంది.