• September 29, 2024

విష్ణు ప్రియ ఇంత కంటే ఏం చేయలేదా?.. బిగ్ బాస్ ఇంట్లో వృథా

విష్ణు ప్రియ ఇంత కంటే ఏం చేయలేదా?.. బిగ్ బాస్ ఇంట్లో వృథా

    బిగ్ బాస్ ఇంట్లో విష్ణు ప్రియ ఉండి వృథా. విష్ణు ప్రియ బిగ్ బాస్ ఇంట్లోకి వస్తోందంటే అందరూ ఎంతో ఊహించుకుని ఉంటారు. కానీ ఈ నాలుగు వారాల్లో విష్ణు వెలగబెట్టింది ఏమీ లేదు. ఓ టాస్కు సరిగ్గా ఆడింది లేదు. మాటల్లోనూ ముందు ఉండటం లేదు. ఇక విష్ణు ప్రియ లవ్ ట్రాక్ నడిపించేందుకు తెగ ట్రై చేస్తోంది. పృథ్వీతో లవ్ ట్రాక్ నడిపించాలని విష్ణు ట్రై చేస్తోంది. కానీ అటు సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్లు రావడం లేదు. అయినా విష్ణు వదలడం లేదు. బిగ్ బాస్ ఇంటికి పృథ్వీ కోసమే వెళ్లినట్టుగా చేస్తోంది. అవి కాస్త ఎక్స్ ట్రా అనిపిస్తోంది. విష్ణు ప్రియ అతి మాత్రమే అందులో కనిపిస్తోంది. ఆ ట్రాక్‌లో ఓ జెన్యూనిటీ కనిపించడం లేదు.

    ఈ మాత్రం దానికి విష్ణు ప్రియని బిగ్ బాస్ తీసుకున్నాడా? ఆమెకు అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలా? అనే అనుమానం ఆడియెన్స్‌కి కూడా కలగొచ్చు. ఇక ఆడియెన్స్ సైతం ఇలానే ఉంటే త్వరలోనే ఆమెను బయటకు పంపేలా ఉన్నారు. ఇప్పటి వరకు విష్ణు ప్రియను ఏదో చేస్తుందని అంతా సేవ్ చేసుకుంటూ వచ్చారు. కానీ సోనియా చేతిలో కీలుబొమ్మలా ఉన్న పృథ్వీ వెంట పడుతూ విష్ణు ప్రియ ఇంట్లో ఆటలు కూడా సరిగ్గా ఆడటం లేదు.

    ఆదివారం ఎపిసోడ్‌లో కేవలం డ్యాన్సులు చేయడానికి మాత్రమే విష్ణు ప్రియని తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అసలు విష్ణు ప్రియ ఈ షోకు ఫిట్ కాదని, ఆమె డిజాస్టర్ పర్ఫామెన్స్ ఇస్తోందని అంతా ఫిక్స్ అయ్యారు. విష్ణు ప్రియకు ఉన్న ఫ్యాన్ బేస్‌కు విన్నర్ అవ్వగలదు. కానీ విష్ణు ప్రియ తనకు వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకుంటోంది.