- November 29, 2023
‘జవాన్’లో దీపికా పదుకొనెతో.. ‘డంకీ’లో తాప్సీతో.. కింగ్ ఖాన్‌కు సేమ్ సీన్

షారూక్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’. రీసెంట్‌గా ‘లుట్ పుట్ గయా..’ అనే సాంగ్‌ను ‘డంకీ డ్రాప్ 2’గా మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హార్డీ పాత్రలో షారూక్, మను పాత్రలో తాప్సీ మధ్య ఉండే ప్రేమను తెలియజేసే ఈ పాటకు వరల్డ్ వైడ్ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులతో పాటు సంగీతాభిమానులు సైతం ఈ పాటకు ఫిదా అయ్యారు. ఇప్పుడు మరోసారి జవాన్ సినిమాలో కుస్తీ గ్రౌండ్ మ్యాజిక్‌ను షారూక్ డంకీలోనూ తాప్సీతో రిపీట్ చేస్తున్నారు.
ఈ విషయం తెలిసిన నెటిజన్స్ దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. షారూక్, దీపిక మధ్య జవాన్ మూవీలో చూపించిన కుస్తీ సీన్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను డంకీలోనూ రిపీట్ చేయబోతున్నారు కింగ్ ఖాన్. దీని గురించి ఫ్యాన్స్ చాలా ఎగ్జయిట్ అవుతూ షారూక్ సరికొత్త రొమాంటిక్ పంథాను కనుగొన్నారని మాట్లాడుకుంటున్నారు.
Drawing parallels between the dhobi-pachaad scenes in #LuttPuttGaya and Jawan – SRK's romance is timeless!#Dunki pic.twitter.com/IgbNRNemlv
— Krutika_sain 🔥💥 (@its__Krutika) November 25, 2023
హీరోయిన్స్ అందరూ షారూక్ ఖాన్‌తో కుస్తీ చేయాలని అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Sabhi actress ko #ShahRukhKhan ke sath hi kushti karni hai sayad🤣#TaapseePannu #RajkumarHirani #DunkiTeaser #Dunki #HappyBirthdaySRK https://t.co/4XjHSLRqnI
— Dinesh (@gautam0092) November 2, 2023
డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యానర్స్ సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, కణిక థిల్లాన్ ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.