- February 18, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. బాబాయ్‌ను చంపనున్న మోనిత.. మళ్లీ కార్తీక్‌కు కష్టాలు
కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 18న శుక్రవారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Episode 1279 ధారావాహికలో మోనిత కుట్ర ఏంటో బయట పడింది. తన అవసరం కోసం బాబాయ్‌ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. ఈ విషయం తెలియక అమాయకంగా కార్తీక్ నమ్మేస్తాడు. కానీ దీప మాత్రం మోనిత కుట్రను పసిగడుతుంది. మరి ఈ ప్రమాదం నుంచి కార్తీక్‌ను దీప ఎలా కాపాడుతుందో. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ మాత్రం మోనిత కుట్రతో ముందుకు సాగింది.
మోనిత బాబాయ్ తన ఆపరేషన్ గురించి ఆలోచిస్తుంటాడు. కార్తీక్‌కి నా మీద ప్రేముంది.. కానీ బయటపడటం లేదు.. మన వైపుకి తిప్పుకుందాం.. నీకు ఆపరేషన్ చేస్తాడు.. కార్తీక్ మంచి కొడుకు మంచి తండ్రి మంచి డాక్టర్.. మంచి భర్త.. అంతా నేను చూసుకుంటాను.. నీకు ఆపరేషన్ జరుగుతుంది..అంతా నేను చూసుకుంటాను.. అని మోనిత చెబుతుంది. దీంతో ఆమె బాబాయ్ కాస్త కుదుటపడతాడు.
అందరం కలిసి తిందాం.. అని సౌందర్య, కార్తీక్ అంటారు. కానీ దీప మాత్రం రాదు. మీరు వెళ్లండి నేను తరువాత తింటాను డాక్టర్ బాబు అని అంటుంది.. మోనిత బాబాయ్‌కి ఆపరేషన్ చేయడం దీపకు ఇష్టం లేదు.. ఆపరేషన్ చేశాక. మోనిత క్లినిక్ తీశాక అర్థమవుతంది.. అని కార్తీక్ తనలో తాను అనుకుంటాడు. ఇక మళ్లీ మోనిత బాబాయ్ మీద సీన్ ఓపెన్ అవుతుంది.
కొన్నాళ్లు నన్ను బతికిస్తారా అని కార్తీక్‌తో మోనిత బాబాయ్ అంటాడు… ఏంటి బాబాయ్.. కార్తీక్ సర్జరీ చేస్తే కచ్చితంగా బతుకుతారు అని మోనిత అంటుంది. పాపం బాబాయ్ భయపడుతున్నాడు.. అని కార్తీక్‌తో మోనిత అంటుంది. ఈ ఆపరేషన్ చేశాక నీ మాట మీద నిలబడతావా? నమ్మొచ్చా? అని అంటాడు కార్తీక్. ప్రేమ అంటేనే నమ్మకం.. నమ్మకం అంటేనే మోనిత.. మోనిత అంటే నమ్మకం.. అందరినీ నమ్ముతావ్.. పిచ్చిగా ప్రేమించిన నన్ను నమ్మవ్.. అని మోనిత అంటుంది.
ఈసారైనా నమ్మకంగా ఉంటావని అనుకుంటున్నా.. అని కార్తీక్ అంటాడు. ఈసారైనా అంటావేంటి.. ఎప్పుడైనా మోసం చేశానా? మనిద్దరం కలవాలని ఎప్పుడైనా అనుకున్నావా? దేవుడి లీల.. నువ్ డాక్టర్వి నేను డాక్టర్ని.. మన అబ్బాయిని కూడా డాక్టర్ని చేద్దాం.. నువ్వేంటే ఇష్టం, ప్రేమ, గౌరవం.. అని మోనిత అంటుంది. నేను అంటే గౌరవం కూడా ఉందా?. ఉంటే నన్ను వెంటాడకు. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకు.. వదిలేయ్.. ప్రశాంతంగా బతకని.. అని కార్తీక్ అంటాడు.
అలా అంటావేంటి కార్తీక్.. నేను నీ భార్యను, మనకు బాబున్నాడు.. అని మోనిత అంటుంది. నేను కనమన్నానా? ప్రేమించమన్నానా? అన్నీ నువ్వే చేసి నన్ను బ్లేమ్ చేయకు. ఇకనైనా ఆపేయ్.. అని కార్తీక్ అరిచేస్తాడు. సరే నువ్వే ఇలా అంటుంటే.. నేనేం అనగలను.. ముందు అయితే బాబాయ్ ఆపరేషన్ చేయ్.. నిజమైన ప్రేమను ఈ ప్రపంచం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.. అని మోనిత నాటకం ఆడుతుంది.
ఇక మరో వైపు దీప ఆలోచనలో పడుతుంది. డాక్టర్ లైసెన్స్ రావడానికి మోనితే కారణం, బాగా వాదించింది అని అన్న రవి మాటలను గుర్తు చేసుకుంది.. తన స్వార్థం లేకుండా ఇలా ఎందుకు చేస్తుంది.. ఇంత జరిగినా డాక్టర్ బాబు ఎలా నమ్మగలుగుతున్నాడు.. కొత్త నాటకం ఆడుతోందా? తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి.. ఏది ఏమైనా మోనితను నమ్మొద్దు అని దీప నిర్ణయించుకుంటుంది.
ఇక ఆనంద్ రావు నేరుగా కార్తీక్ హాస్పిటల్ వద్దకు వెళ్తాడు. అక్కడే గొడవ పెట్టుకుంటాడు. మోనిత బాబాయ్‌కి ఎందుకు ఆపరేషన్ చేస్తాను అన్నావ్.. డాక్టర్ ప్రాక్టీస్ మానేయ్.. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు.. నేను ఇస్తాను.. కొత్త బిజినెస్ పెట్టుకో అని కార్తీక్‌కు ఆనంద్ రావు సలహా ఇస్తాడు. ఇవన్నీ ఇంటికెళ్లి మాట్లాడుకుందాం అని కార్తీక్ అంటాడు. ఇక ఇంటికి వెళ్లిన కార్తీక్ అసహనం వ్యక్తం చేస్తాడు.
దీప మీద ఫైర్ అవుతాడు. దీప తన అభిప్రాయాన్ని అందరి మీద రుద్దేసింది.. దీప మాటకున్న విలువ నా మాటకు లేదు.. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో అర్థమవుతోంది అంటూ కార్తీక్ వింతగా మాట్లాడతాడు. దీంతో సౌందర్య, ఆనంద్ రావు షాక్ అవుతారు. ఈ ఇంట్లో నీ స్థానం గురించి మాట్లాడుతున్నావా?.. మేం అంతా కూడా సపోర్ట్ చేయడం కాదు.. దీప చేసింది చూడు.. అదిరా సపోర్ట్ అంటే..అందుకే దీపంటే మా అందరికీ గౌరవం.. అని ఆనంద్ రావు అంటాడు. మోనిత ఇవన్నీ ఆపేస్తుందని మాటిచ్చింది అందుకే ఆపరేషన్ చేస్తున్నాను అని కార్తీక్ అంటాడు. మొత్తానికి మోనిత తన బాబాయ్‌ని చంపి.. అది మళ్లీ కార్తీక్ మీద నెట్టే ప్రయత్నం చేస్తోన్నట్టు అర్థమవుతోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- Deepa
- Doctor Babu
- Karthika Deepam
- Karthika Deepam Episode
- Karthika Deepam Episode 1279
- karthika deepam latest episode
- Karthika Deepam new Episode 1279
- karthika deepam serial today
- Karthika Deepam serial today episode
- Karthika Deepam Today Episode
- Karthika Deepam today Episode 1279
- Monitha
- Premi Viswanath
- Vantalakka
- కార్తీక దీపం
- కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్
- కార్తీక దీపం ఈరోజుది
- కార్తీక దీపం ఎపిసోడ్
- కార్తీక దీపం టుడే ఎపిసోడ్
- కార్తీక దీపం డైలీ సీరియల్
- కార్తీక దీపం నిన్నటి ఎపిసోడ్
- కార్తీక దీపం నేటి ఎపిసోడ్
- కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
- కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్
- కార్తీకదీపం నేటి ఎపిసోడ్
- కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
- కార్తీక్
- దీప
- మోనిత
- వంటలక్క