- January 27, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. ఒక్క రోజే ఆయుష్షు.. పరుగులు తీసిన కార్తీక్
కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 27 గురువారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Episode 1260 ధారావాహికలో గుండెను మెలిపెట్టే సీన్లు పడ్డాయి. కార్తీక్, దీపల మధ్య ఉన్న ఘాడమైన ప్రేమ, అన్యోన్యతను మరోసారి చూపించారు. భర్తపై దీపకు ఉన్న అమితమైన ప్రేమను నేటి ఎపిసోడ్‌లో చూపించారు. హోటల్‌లో పని చేయకుండా కార్తీక్ వద్ద మాట తీసుకుంటుంది దీప. అలా కార్తీకదీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
హోటల్లో పని చేస్తున్న కార్తీక్‌ని దీప చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం చేస్తున్నారు.. అని దీప ఏడుస్తూ ధీనంగా అడుగుతుంది. అది దీప అని చెబుతుంటే.. మాట్లడకండి.. ఈ పని చేస్తున్నారా.. ఇది చూడటానికా? నేను బతికింది.. పదకొండేళ్లు ఊపిరి బిగపట్టి కష్టాలను ఓర్చుకుంది ఎందుకు.. ఏంటి స్వామి.. ఏంటండి ఇది.. ఈ చేతులతో మీరు ఒకప్పుడు చేసిన పనేంటి.. ఇప్పుడు చేస్తోన్న పనేంటి.. ఈ పని చేసే కంటే ముందు నన్ను గొంతుపిసికి చంపేసిన బాగుండేది.. అని దీప అల్లాడిపోతుంది.
నా గొంతులో ప్రాణం ఉండేంత వరకు మిమ్మల్ని పోషించుకుంటాను.. మాట్లాడకండి.. డాక్టర్ బాబు.. మీరు డాక్టర్.. నా భర్తు.. మీరు గర్వంగా బతకాలి.. వెళ్లండి.. డాక్టర్ బాబు. ఆనంద్‌ని ఇక్కడి నుంచి తీసుకెళ్లండి.. మిమ్మల్ని ఇలా చూస్తూ వాడు కూడా ఏడస్తున్నాడు. అని దీప చెబుతుంది. ఇంతలో భద్రం వస్తాడు. మా ఆయనే అని చెబుతుంది దీప. చీటి ఇచ్చేవాళ్లు సాయంత్రం వస్తాను అన్నారు.. అని భద్రం అంటాడు. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను.. ఎవ్వరూ లేరు కదా? ఈ పని చేస్తాను అని దీప అంటుంది.
నీకు ఫోన్ చేద్దామంటే నా ఫోన్ రిపేర్‌కి ఇచ్చాను అని శ్రావ్య అంటుంది.. నా ఫోన్ ఏది.. కనిపించడం లేదు.. అని ఆదిత్య అంటాడు. మనల్ని డిస్టర్బ్ చేసేందుకే మోనిత పుట్టినట్టుంది అని శ్రావ్య అంటుంది.. ఫోన్ కారు మీదే పెట్టాను.. ఏమైందో.. అందులో చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్.. ఉంది అని ఆదిత్య అంటాడు. ఇక ప్రకృతి వైద్యశాల నుంచి వెళ్లిపోమ్మని.. పక్క ఊర్లోఉన్న బ్రాంచ్‌లోకి వెళ్లమని గురువు సలహా ఇస్తాడు. పక్క ఊరి బ్రాంచ్‌లోకి వెళ్లే విషయాన్ని ఎవ్వరికీ చెప్పకండి అని ఆనంద్ రావు అంటాడు.
ఇక ఇంట్లో దీప బాధపడుతుంటుంది. మన అసిస్టెంట్ అక్కా.. అన్ని పనులు చేస్తాడు.. అని అప్పిగాడి మాటలను తలుచుకున్న దీప తెగ బాధపడుతుంటుంది.. దీప.. అంటూ కార్తీక్.. వస్తాడు. కానీ దీప మాట్లాడదు. దీప ప్లీజ్ నాతో మాట్లాడండి.. నీ కోపాన్ని భరించగలను గానీ మౌనాన్ని భరించలేను.. మాట్లాడు దీప.. మాట్లాడకపోతే నా మీద ఒట్టు.. అని కార్తీక్ అనడంతో మాట్లాడుతుంది.
మీరు మాటిస్తేనే నేను మాట్లాడతాను..అని దీప అంటుంది. ఏంటి దీప అని అంటాడు. డాక్టర్ బాబు ఏం చేస్తున్నారు.. ఈ చేతులు కొన్ని వందల మంది కాపాడాయ్.. వందల ఆపరేషన్లు చేశారు.. ఇందులో గొప్ప శక్తి ఉంది.. ఇవి భగవంతుడి ప్రతిరూపాలాంటివి.. ప్రసాదాలు స్వీకరించాలి కానీ ఎంగిలి మెతుకులు ఎత్తకూడదు కదా.. నేను ఇంత కష్టపడుతోంది ఎందుకు మిమ్మల్ని ఇలా చూడటానికేనా? అని దీప బాధపడుతుంది.
వేరే పని దొరకడం లేదని.. అంటూ కార్తీక్ ఏదో చెప్పబోతాడు. ఆకలేస్తోందని పులి గడ్డి తినదుకదా?.. ఆపరేషన్లు చేసే నా డాక్టర్ బాబు ఇలా చేస్తే ఎలా.. జనాల గుండెల్లో ఉండాల్సిన వాడివి.. ఒంటరిగా ఏ కష్టమైనా నేనే పనిచేస్తాను.. ఆపరేషన్ థియేటర్లో కత్తులు పట్టాల్సిన మీరు.. హోటల్లో అలా చేస్తే ఎలా.. మీరే నాకు మహారాజు.. రాజ్యం ఉన్నా లేకపోయినా కూడా రాజు రాజే.. మీరు నాకు మాటివ్వండి..
పదకొండేళ్ల దూరం ఉన్నాం.. నాకేం ఇవేం కష్టాలు కావు.. చేస్తే వైద్యం చేయండి.. లేదంటే మహారాజులా కూర్చోండి.. మీరే నా ధైర్యం.. మీరు నా పక్కనే ఉన్నారనే ధైర్యం.. కళ్ల ముందే ఉండండి.. పిల్లలకు ట్యూషన్ చెప్పండి.. ఆ డబ్బులు నేనిస్తాను అని దీప అంటుంది. దీంతో కార్తీక్ నవ్వుతాడు. ఈ నవ్వే నాకు పదివేలు.. అని అంటాడు. నీ నవ్వు నాకు లక్షల వరాహాలు.. అని కార్తీక్ అంటే.. దీప నవ్వేస్తుంది. ఇవి మీకు దక్కాలంటే ఎప్పుడూ ఎక్కడా పని చేయకూడదు.. అని దీప అంటుంది. అలానే వంటలక్క.. అని కార్తీక్ అంటాడు.
నామీద కోపం పోయిందా.. అని కార్తీక్ అంటాడు. మీ మీద నాకు ఎందుకు కోపమండి.. బాధ, సంతోషమైనా మీతోనే కదా?? ఇంకా పసిబిడ్డలాంటి వారే.. అలకే కానీ కోపం ఉండదు.. అని దీప అంటుంది. నేను పసిపిల్లాడినేంటి.. నేను ఒక దుర్మార్గుడిని.. అని కార్తీక్ బాధపడతాడు. ఏంటి ఈ కన్నీళ్లు.. రాతి హృదయం ఉన్నవాడిని.. రాక్షసుడిని.. నీ దగ్గర ఒక విషయం దాచాను.. నాకు మమ్మీ డాడీ కనిపించారు.. ప్రకృతి వైద్యశాలలో డెలివరీ ఇవ్వడానికి వెళ్తే.. పేషెంట్లు,దిక్కు లేనివాళ్లలా కనిపించారు..
ఏంటి దీప.. ఒకే ఊళ్లోం ఉన్నాం.. చాటుగా చూశాం తప్పా.. పలకరించలేదు.. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది.. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం ఉంటుంది.. తప్పులు, పొరపాట్లు చేసినా భరించారు.. గొప్ప తల్లిదండ్రులు దీప వాళ్లు.. హోటల్‌ను పార్శిల్ తెప్పించుకుని తింటున్నారు.. ఎందుకు వచ్చారో తెలీదు.. డాడీ మాట్లాడుతుంటే. తలుపుచాటు వినాల్సి వచ్చింది.. డాడీ ఏమన్నారో తెలుసా? నా ప్రాణాలే పోతే నా చివరి కర్మలకు వస్తాడా? అని మమ్మీని అడుగుతుంటే.. ఇక్కడే ఉన్నానని చెప్పలేకపోయాను.. ఇంతరాక్షసుడిని అయ్యానేంటి.. అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.
మళ్లీ మనం ఎప్పుడోసారి కలుస్తాం కదా అని దీప ఓదార్చుతుంది.. నేనేం చేస్తున్నానో.. మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియడం లేదు.. వాళ్లని చూసిన విషయం నీక్కూడా చెప్పలేదు.. ఏం చేస్తావో తెలియక దాచాను.. నేను మోసం చేశాను దీప.. నేను దుర్మార్గుడిని..అని కార్తీక్ అంటే.. మీరు మాత్రమే నేనూ దుర్మార్గురాలినే.. నేనూ అత్తయ్యా వాళ్లను చూశాను.. అని చెబుతుంది.
నువ్ చూశావా? అని కార్తీక్ అడుగుతాడు. రుద్రాణిని ఎవరో చెంపమీద కొట్టారని చెప్పాను కదా? ఆ రోజే చూశాను.. నోటమాట రాలేదు.. గుండె ఆగినంత పనైంది.. వెళ్లలేను.. ఉండలేను.. మీకు చెప్పలేను.. అని దీప అనడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో పెద్ద గండం ఏర్పడుతుంది. శౌర్యకు హార్ట్ ప్రాబ్లమ్.. ఒక్క రోజులో ఆపరేషన్ చేయకపోతే చనిపోతుందని అర్థమవుతుంది.. దీంతో డబ్బుల కోసం సౌందర్య వద్దకు అంటే ప్రకృతి వైద్యశాలకు వెళ్తాడు కార్తీక్. ఇక తరువాయి ఏం జరుగుతుందో చూడాలి.