- January 27, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. మహేంద్ర వద్దకు జగతి.. అసలు కథ ఇప్పుడే మొదలు
గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 27న గురువారం ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 358 ధారావాహికలో కళ్లతోనే సీన్లు ముందుకు జరిగాయి. మాటలు తక్కువ.. ఎక్స్‌ప్రెషన్స్, మూకీ డ్రామానే ఎక్కువగా జరిగింది. జగతి ఇంట్లోకి అడుగు పెట్టడం, అది చూసి దేవయాణి ఓర్వలేకపోవడం వంటి సీన్లే జరిగాయి. అలా మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ మాత్రం అందరినీ కట్టిపడేసేలా సాగింది.
జగతి ఇంటికి వచ్చిన రిషి సడెన్‌గా షాక్ ఇచ్చేస్తాడు. ఇప్పుడే మనం బయల్దేరుతున్నాం.. బయట కారులో వెయిట్ చేస్తుంటాను.. అని రిషి అంటాడు. దీంతో జగతి తెగ సంబరపడిపోతుంది. చాలు వసు,.. ఈ జన్మకు ఇది చాలు.. అని వసుని పట్టుకుని జగతి సంబరపడుతుంది. డాడ్ నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను.. అని బయట కారు వద్దున్న రిషి అనుకుంటాడు.
ముగ్గు వేస్తోన్న ధరణిని అది వెయ్ ఇది వెయ్.. అని విసిగిస్తుంది దేవయాణి. వదిన ముగ్గు అదిరిపోయింది..అని గౌతమ్ అంటాడు. నీకు ముగ్గుల గురించి అంత తెలియదేమో.. అని దేవయాణి అంటుంది. నీకు భలే తెలిసింది పెద్దమ్మ అని గౌతమ్ అంటాడు. ఇది అసలు ముగ్గే కాదు.. నేను రథం ముగ్గు వేస్తే ఊరంతా చూసేది.. అని దేవయాణి చెబుతుంది. నీ ముగ్గుల గురించి నాకు తెలీదా?.. అని ధరణి లోలోపల అనుకుంటూ ఉంటుంది. ఏంటి ధరణి.. అని కోపంగా చూస్తుంది దేవయాణి. నాకు బదులు మీరు ముగ్గు వేస్తే బాగుంటుంది..అని ధరణి అంటుంది. అవును పెద్దమ్మ మీరు వేయండి.. అని ఇరికిస్తాడు గౌతమ్. ఇప్పుడు నా వల్ల కాదులే.. మొన్న దెబ్బ తగిలింది కదా? అని తప్పించుకుంటుంది దేవయాణి.
ఇక కారు వచ్చి ఆగడం అందులోంచి రిషి దిగడం, ఆ తరువాత వసు దిగడంతో దేవయాణి షాక్ అవుతుంది. గౌతమ్ సంబరపడతాడు. ఇక జగతి అడుగు పెట్టడంతో దేవయాణి కడుపు రగిలిపోతుంది. సంక్రాంతి పండుగ కోసం తీసుకొచ్చాడా? రిషి సూపర్రా.. బంపర్రా.. సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చావ్ అని గౌతమ్ వాగుతాడు.. అరేయ్ ఏంట్రా నువ్ అని రిషి కసురుకుంటాడు..
అత్తయ్య గారు షాక్‌లో ఉన్నారా? జగతి అత్తయ్యే కదా? వచ్చింది..అని ధరిణి చురకలు అంటిస్తోంది. వీళ్ల లగేజ్‌ని లోపల పెట్టు అని గౌతమ్‌కి రిషి చెబుతాడు.. కారునే లోపల పెట్టేస్తాను.. హాయ్ వసుధార.. హాయ్ సర్.. అని అనేస్తుంది వసుధార. రండి..అని జగతి వైపు చూస్తాడు రిషి. దీంతో దేవయాణి మరింత షాక్ అవుతుంది. నువ్వేంటి పొద్దున్నే అని దేవయాణి అడ్డం పడుతుంటే.. నేనే తీసుకొచ్చాను.. అని రిషి అంటాడు.
అత్తయ్య గారు మళ్లీ షాక్ అయ్యారా?.. అని కౌంటర్ వేస్తుంది ధరణి. గౌతమ్ నువ్ ఆగు.. పెద్దమ్మ నన్ను ఆపకండి.. ఈ మనసు గాల్లో తేలిపోతోంది.. అని గౌతమ్ ఎక్స్ ట్రాలు చేస్తుంటాడు. నువ్ కాస్త పక్కకి జరుగు అని గౌతమ్‌ని దేవయాణి అంటుంది. రిషి ఏంటిది.. వీళ్లు మన.. అని దేవయాణి అడుగుతుంది. వివరాలు తరువాత చెబుతాను.. నన్నేం అడక్కండి.. ప్లీజ్.. అని రిషి చెప్పడంతో దేవయాణికి ఇంకా మండిపోతుంది.
వదిన లోపలకు తీసుకెళ్లండి.. అని ధరణికి చెబుతాడు రిషి. నేనున్నాను కదా.. వసుధారని తీసుకెళ్తాను.. పద వసుధార.. అని తీసుకెళ్తాడు గౌతమ్. ఇక జగతికి దండం పెడుతుంది ధరణి. ఈ రోజు వంటేంటో.. డిస్కస్ చేద్దాం రా వదిన అని గౌతమ్ పిలుస్తాడు.. వెల్కమ్ బ్యాక్..అని ధరణి అంటుంది. ఇక జగతి, రిషి, ధరణిలు ఇంట్లోకి అడుగుపెడుతుంటారు.
ఇంటి మెట్లు ఎక్కే సమయంలో చెప్పులు వదిలేస్తుంది. గడపకు మొక్కుతుంది జగతి. వీటిని తన కెమెరాలో బంధిస్తుంది వసు. జగతి మేడం ఇంట్లో అడుగు పెట్టబోతోన్నారు. ఈ రోజు కోసమే ఎదురుచూశారు..రిషి సర్‌కి థ్యాంక్స్.. మీరు నిజంగానే జెంటిల్మెన్.. వీటిని కెమెరాలో బంధిస్తాను.. అని వసు సంబరపడిపోతుంది. ఇక జగతి ఇంట్లోకి రావడాన్ని దేవయాణి జీర్ణించుకోలేకపోతుంది.
మై డియర్ హార్ట్.. ఇక్కడ ఇద్దరున్నారు. ఒకటి జగతి.. ఇంకొకరు రిషి.. ఇప్పుడే తొందరపడితే ఎలా భయ్యా.. అని మహేంద్ర బాధపడుతుంటాడు. ఇంతలో రిషి వచ్చి.. గుడ్ మార్నింగ్ డాడ్.. అని అంటాడు. మార్నింగ్‌లో గుడ్ ఏంటుంది.. అని మహేంద్ర అంటాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పాక అవుతుందేమో.. అని రిషి అంటాడు. కాలెండర్లో డేట్లు మారతాయ్.. రోజులు వస్తాయ్ పోతాయ్..
నాకు మంచి ఎప్పుడూ జరగలేదు.. గుడ్ మార్నింగ్ అని మర్యాదగా చెబుతుంటాను..అని మహేంద్ర అంటాడు. నా మీద మీకు నమ్మకం లేదా? అని రిషి అడుగుతాడు. ఏ విషయంలో రిషి.. అని మహేంద్ర అనేలోపు.. జగతిని చూపిస్తాడు. దీంతో మహేంద్ర తెగ సంబరపడిపోతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి నుంచే అసలు కథ మొదలు కానున్నట్టు కనిపిస్తోంది. కిందపడిపోతోన్న మహేంద్రను జగతి పట్టుకుంటుంది. రిషి కాస్త ఫీల్ అవుతాడు. ఇక మరో వైపు వసుని కాలితో తన్ని గాయపరుస్తుంది దేవయాణి. మొత్తానికి ఇక జగతికి, వసుకి దేవయాణి చుక్కలు చూపిస్తుందేమో.
- Tags
- Guppedantha Manasu Daily serial Episode
- Guppedantha Manasu Episode 358
- Guppedantha Manasu New Episode
- Guppedantha Manasu serial today Episode 358
- guppedantha manasu serial yesterday episode
- Guppedantha Manasu Today Episode
- Guppedantha Manasu today Episode 358
- గుప్పెడంత మనసు
- గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్
- గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్
- గుప్పెడంత మనసు ఈరోజు సీరియల్
- గుప్పెడంత మనసు టుడే ఎపిసోడ్
- గుప్పెడంత మనసు డైలీ సీరియల్
- గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్
- గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ కావాలి
- గుప్పెడంత మనసు సీరియల్ టుడే ఎపిసోడ్
- జగతి
- మహేంద్ర
- రిషి
- వసు
- వసుధార