• January 18, 2022

తప్పుడు థంబ్ నెయిల్స్ ఇక చెల్లవు.. మంచు విష్ణుతో బీఎస్ భేటీ

తప్పుడు థంబ్ నెయిల్స్ ఇక చెల్లవు.. మంచు విష్ణుతో బీఎస్ భేటీ

    Manchu Vishnu ఆన్ లైన్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల గుర్తింపు కోసం సీనియర్ జర్నలిస్ట్ బీఎస్ (బీ శ్రీనివాస్) ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే TUOWJ సంస్థను ప్రారంభించారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో తమ గళాన్ని చాటే జర్నలిస్ట్‌ల కోసం పాటు పడుతున్నాడు. అయితే ఇందులో యూట్యూబ్ చానెళ్లను క్రమబద్దీకరించే పనిలో నిమగ్నమయ్యారు.

    తప్పుడు థంబ్ నెయిల్స్‌తో రాసే పిచ్చి రాతలు, కూసే పిచ్చి కూతలకు ఇక కాలం చెల్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణుతో కలిసి చర్చలు జరిపారు. మంచు విష్ణు, శివ బాలాజీతో డిజిటల్ మీడియా విస్తృతి, YouTube ఛానెళ్లకు గుర్తింపు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించింది. అయితే ఈ భేటీలో మంచు విష్ణు కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

    తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని మంచు విష్ణు స్పష్టం చేశారట. అయితే ఈ యూనియన్ తో చర్చించాకే చర్యలుంటాయని హామీ ఇచ్చారట. గాసిప్స్ రాస్తే తప్పు లేదు కానీ తప్పుడు భాషలో కుటుంబాల్ని రోడ్డుకీడ్చేవిధంగా ఉండే ఛానెళ్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారట. స్వయం నియంత్రణ పాటించేందుకు సిద్ధంగా ఉన్నామనీ.. కలిసి పని చేయాలనుకుంటున్నామని మంచు విష్ణుతో బీఎస్ చెప్పుకొచ్చారు.

    Leave a Reply