• January 13, 2022

నిధితో అందరూ ప్రేమలో పడితారు : అశోక్ గల్లా

నిధితో అందరూ ప్రేమలో పడితారు : అశోక్ గల్లా

    సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

    అశోక్ గల్లా మాట్లాడుతూ.. ‘యాక్టింగ్ చేయాలని ఫుల్ కమిట్మెంట్, రెస్పెక్ట్‌తోనే వచ్చాను. ఈ సినిమాను బాగానే చేశాను అని అనుకుంటున్నాను. ఆడియెన్స్ కూడా అలానే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. టక్ జగదీష్ సినిమా చూశాక.. వారం రోజులు టక్ జగదీష్‌ని కాపీ కొట్టాను. కొరటాల శివ గారి సినిమా సెట్‌లో నేర్చుకున్నదాని వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నాను. అనిల్ రావిపూడి గారితో చేసిన సీన్‌కు పగలబడి నవ్వాం. సుధీర్ బాబాయ్ చేసిన హార్డ్ వర్క్‌ను చూసి నేను కూడా చేశాను. కృష్ణ తాత ఉన్నారు.. మహేష్ మామా ఉన్నారు.. సుధీర్ బాబాయ్ ఉన్నారు.. రానా అన్న ఉన్నారు.. సినిమా ఎన్ సైక్లోపీడియా ఎలా ఉంటుందో రానా అలా ఉంటారు. ఈ సినిమాతో అద్భుతమైన జర్నీ ఏర్పడింది. నరేష్ గారు, అర్చన గారు మేం అంతా కూడా ఫ్యామిలీలా అయిపోయాం. మొదటి సినిమాలా అనిపించడం లేదని అంతా అంటున్నారు. డైరెక్టర్ ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే అలా నటించగలిగాను. జగపతి బాబు గారి పాత్ర, ఆ ట్విస్ట్ అందరికీ నచ్చుతుంది. నిధితో అందరూ ప్రేమలో పడితారు. డబుల్ త్రిబుల్ టైమ్స్ ప్రేమిస్తారు. శ్రీరామ్ వచ్చాడు చూశాడు నచ్చాను అని అన్నాడు. అమ్మకు చెప్పాను. తెల్లారే ఆఫీస్ పెట్టేశాం. ఈ రోజు ఇలా మీ ముందున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సెలెబ్రేషన్స్‌లో మా సినిమాను చూడండి’ అని అన్నారు.

    పద్మావతి గల్లా మాట్లాడుతూ.. ‘హీరో సినిమాతో అశోక్‌ను పరిచయం చేస్తున్నాను. అతన్ని హీరోగా అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. అశోక్ టాలెంట్ చూపించి.. తనది తాను నిరూపించుకుంటాడనే నమ్మకం నాకుంది. ఇక్కడకు వచ్చిన అతిథులందరికీ థ్యాంక్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాలో కారెక్టర్‌కు అశోక్ కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమా బాగా వచ్చింది. పాత్రకు న్యాయం చేశాడు. అవుట్ పుట్ చూసి ఆనందంగా ఉంది. మధ్యలో మా కెమెరామెన్ వెళ్లిపోయారు. సమీర్ గారిని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. నిధి అగర్వాల్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. సెట్‌కు టైంకి వస్తుంది’ అని అన్నారు.

    గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ‘అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించాం. ఆ బ్యానర్ మీద మా అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. ఇండస్ట్రీలో మా వంతుగా చేసేందుకు వస్తున్నాం. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతోన్నాం. రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను నిర్మించారు. పద్మావతి, ఆదిత్య ఇలా అందరూ చాలా కష్టపడ్డారు. ఇలా ఆలస్యం అవ్వడం వల్ల సినిమాకు ఇంకా మెరుగులు దిద్దే అవకాశం వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. సంక్రాంతి వంటి సీజన్లో ప్రేక్షకులు ఎంటర్టైన్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సంక్రాంతికి మేం ఎంటర్టైన్ చేయబోతోన్నాం’ అని అన్నారు.

    డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘పద్మావతి గారితో పని చేయడం ఇంట్లో అమ్మతో పని చేసినట్టుంది. ఆమె ఎంతో స్వీట్ పర్సన్. ఎంతో జెన్యూన్‌గా ఉంటారు. సమీర్ రెడ్డి గారితో ఇది నాకు రెండో సినిమా. సమీర్ గారు ఉంటే.. దర్శకులు కంఫర్ట్‌గా ఉంటారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమీర్ రెడ్డి గారు అద్బుతమైన కెమెరామెన్. హాలీవుడ్ స్టాండర్ట్ విజువల్స్ ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్. గిబ్రాన్ అద్బుమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇచ్చాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడితో రెండు సినిమాలు చేశాను. కమర్షియల్ పల్స్ తెలిసిన ఎడిటర్. ఈ సినిమాకు ఆయనకు అవార్డ్ రావాల్సిందే. వెంకట్ అదిరిపోయే ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాలో మంచి హ్యూమర్ ఉంటుంది. దానికి నా రైటర్స్ ఠాగూర్, కళ్యాణ్ కారణం. రెండేళ్లు నాతోనే ఉన్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి వీరంతా కారణం. నరేష్ గారు ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చారు. అర్చన గారు స్టార్ కారెక్టర్ అవుతారు. అద్భుతంగా నటించారు. జగపతిబాబు గారు, వెన్నెల కిషోర్ ఇలా చాలా మంది కలిసి చేశాం. ఎనర్జిటిక్ పండుగ సినిమా హీరో. నిధి అగర్వాల్ ఎంతో సహకరించింది. అశోక్‌కు సినిమా పట్ల తనకున్న ప్రేమే ఈ హీరో. సాలిడ్ హీరో తెలుగు పరిశ్రమకు రాబోతోన్నాడని బల్లగుద్ది చెబుతున్నాను. జనవరి 15న థియేటర్‌కు రండి.. సంక్రాంతికి ఫుల్‌గా నవ్వుకునే సినిమా ఇస్తున్నాం. ఇది నా హామీ’ అని అన్నారు.

    Leave a Reply