- January 13, 2022
Rana: బాగా ఖర్చు పెట్టించాడని తెలిసింది.. డైరెక్టర్‌పై రానా కామెంట్స్
Rana సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో
రానా మాట్లాడుతూ.. ‘అశోక్ చాలా అదృష్ణవంతుడు. మొదటి సినిమాకు హీరో టైటిల్ దొరికింది. స్టార్ దొరికింది. సంక్రాంతి సీజన్ దొరికింది. పద్మావతి గారు నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. పద్మావతి గారికి కూడా ఇది నిర్మాతగా మొదటి సినిమా. శ్రీరామ్ బాగా ఖర్చు పెట్టించాడని తెలిసింది. కానీ ఆ ఖర్చంతా కూడా తెరపై కనిపిస్తోంది. నిధి అగర్వాల్ సినిమాలో మంచి పాత్రను పోషించింది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
అయితే రానా మాత్రం ఈ ఈవెంట్లో సందడి చేశాడు. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలకు హీరో ఫ్రెండో, దర్శకుడి ఫ్రెండో అయితే గెస్టులుగా వస్తారు. కానీ నాకు ఇక్కడ హీరో తండ్రి ఫ్రెండ్. ఇదే విషయాన్ని సుధీర్ బాబుతో కూడా అన్నాను. జై ఇప్పుడు నువ్ ఓ స్టార్ ఫాదర్‌వి అని చెప్పుకొచ్చాడు. ఇక రానా చేతులు మీదుగా హీరో టైటిల్ వీడియో ప్రొజక్షన్ మ్యాపింగ్‌ను విడుదల చేయించారు.
- Tags
- Archana ananth
- Ashok Galla
- Hero Movie
- Hero Movie Pre Release Event
- K Raghavendra Rao
- Karthika Deepam
- Karthika Deepam Soundarya
- Radha Krishna Kumar
- Rana
- Rana Daggubati
- Siva Nirvana
- Sriram Aditya
- V K Naresh
- అర్చన
- అశోక్ గల్లా
- కార్తీక దీపం
- కే రాఘవేంద్ర రావు
- రాధాకృష్ణ కుమార్
- రానా
- వీకే నరేష్
- శివ నిర్వాణ
- శ్రీరామ్ ఆదిత్య
- సౌందర్య
- హీరో