- January 8, 2022
Shyam Singha Roy Collection : పడిపోయిన శ్యామ్ సింగ రాయ్.. ఇక బాక్సాఫీస్ లెక్కలు ముగిసినట్టే!

నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. రెండు వారాలుగా శ్యామ్ సింగ రాయ్ దుమ్ములేపేసింది. అయితే ఇప్పుడు మాత్రం శ్యామ్ సింగ రాయ్ హవా తగ్గిపోయింది. రోజు రోజుకూ కలెక్షన్లు మరింతగా తగ్గిపోతోన్నాయి. అయితే ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్ బ్రేక్ ఈవెన్ సాధించడంతో అది పెద్ద ఎఫెక్ట్ ఏమీ చూపించడం లేదు.
శ్యామ్ సింగ్ రాయ్ మొత్తానికి కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్ అయింది. బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టేసింది. కానీ రోజూ వారి కలెక్షన్లు చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. గత రెండు మూడు రోజుల నుంచి పది లక్షలు కూడా రాబట్టలేకపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్యామ్ సింగ రాయ్ మాత్రం మరీ దారుణంగా పడిపోయిందని అర్థమవుతోంది.
శ్యామ్ సింగ రాయ్ 15వ రోజు 8 లక్షలు కలెక్ట్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈ పదిహేను రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్యామ్ సింగ రాయ్ 18.90 కోట్ల షేర్ 32.14 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. అలా మొత్తానికి దాదాపు మూడు కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చినట్టు కనిపిస్తోంది.
నాని ఓవర్సీస్లో మాత్రం రికార్డులు క్రియేట్ చేయలేకపోయింది. వన్ మిలియన్ డాలర్ క్లబ్బులోకి శ్యామ్ సింగ రాయ్ చేరుతుందని అంతా భావించారు. కానీ ఎనిమిది లక్షల వద్దే అక్కడి కలెక్షన్లు ఆగిపోయాయి. అఖండ, పుష్ప అయితే వన్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసేశాయి.