• December 22, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. పొట్ట కూటి కోసం పుస్తెలతాడు అమ్మిన దీప.. బాధపడ్డ కార్తీక్

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. పొట్ట కూటి కోసం పుస్తెలతాడు అమ్మిన దీప.. బాధపడ్డ కార్తీక్

    కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే.. బుధవారం నాటి Karthika Deepam Epiosde 1229 ధారావాహికలో విచిత్రమైన విషయాలు జరిగాయి. మోనిత బిడ్డను ఎత్తుకొచ్చిన కొటేశు.. మొత్తానికి కార్తీక్ పిల్లాడే అని తెలిసేలా ఉంది. ఎవ్వరు ఎత్తుకున్నా కూడా ఏడుస్తూనే ఉంటాడు. కార్తీక్ ఎత్తుకుంటే మాత్రం ఏడుపు ఆపేస్తుంటాడు. ఇదేం విచిత్రమైన శౌర్య, హిమలు ఆశ్చర్యపోతారు. ఇక కార్తీక్ దీపం నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

    వంటగదిలో ఉన్న మోనిత ఆలోచనల్లో పడుతోంది. బాబును ఎవరు ఎత్తుకెళ్లి ఉంటారా? అని అనుకుంటూ ఉండగా.. ఆదిత్య, శ్రావ్య వస్తారు. కాఫీ కావాల? అని మోనిత అడుగుతుంది. కాఫీ బాగా కలుపుతాను అని మోనిత అంటుంది. నువ్ కాఫీలే కాదు వరసలను బాగా కలుపుతావ్ అని ఆదిత్య కౌంటర్ వేస్తావ్. నీతులు చెబుతుంటూ మోనిత వినలేదు. ఇలాంటి మాటలు నాకు చెప్పకు అంటూ మోనిత అనడం.. నీకు ఎలా చెప్పాలో నాకు తెలుసంటూ ఆదిత్య ఫైర్ అవుతాడు. ఇంతలో శ్రావ్య ఆపేస్తుంది. నా బాబును ఎందుకు ఎత్తుకెళ్లావ్ అని మోనిత అంటే.. మీ బాబును నేను ఎందుకు దాచి పెడతాను అని ఆదిత్య బదులిస్తాడు. అయితే నా బాబు దొరికే వరకు ఇక్కడే ఉంటాను.. ఎక్కువగా డిస్కస్ చేయకు.. అని మోనిత చెబుతుంది. చీచీ అంటూ ఆదిత్య వెళ్లిపోతాడు.

    శ్రీవల్లి చేతిలో ఉన్న బిడ్డ గుక్క పట్టుకుని ఏడ్చేస్తాడు. ఎంత లాలించినా ఏడుపు ఆపడు. శ్రావ్య, హిమ ట్రై చేసినా కూడా ఏడుపు ఆపడు. కానీ డాక్టర్ బాబు వచ్చి ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. అలా రెండు సార్లు జరుగుతుంది. దీంతో శౌర్య, హిమలు ఆశ్చర్యపోతారు. డాడీ నువ్ ఎత్తుకోగానే తమ్ముడు ఏడుపు ఆపేశాడు.. డాడీ గ్రేట్.. అని అంటారు. పిల్లల ఏడుపులో తేడాను బట్టి ఎందుకు ఏడ్చారో చెప్పొచ్చు అని తన డాక్టర్ నాలెడ్జ్‌ను కార్తీక్ బయటపెడతాడు.

    ఇవన్నీ మీకు ఎలా తెలుసు? అని శ్రీవల్లి అడుగుతుంది. మా నాన్న డా.. అని శౌర్య చెప్పేలోపు కార్తీక్ ఆపేస్తాడు. శౌర్య, హిమలు పుట్టినప్పుడు చేశాం కదా? అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ఇక కోటేశ్ రాగానే పిల్లాడి చేష్టల గురించి చెబుతారు హిమ, శౌర్య. పిల్లలు దేవుడని అంటారు కదా? అందుకే మంచి వాళ్లను ఇట్టే గుర్తు పట్టాడేమో అని కోటేష్ అంటాడు. అంటే మేం మంచి వాళ్లం కాదా? అని పిల్లలు సైటర్ వేస్తారు.

    ఖర్చులకు డబ్బులు కూడా లేక బాధపడుతూ ఉంటే దీప తన పుస్తెలతాడును తాకట్టు పెడుతుంది. ఈ విషయం ఒకవేళ కార్తీక్ బాబుకు తెలిస్తే ఎలా అని దీప ఆలోచిస్తుంటుంది. తాకట్టు పెట్టానని తెలిస్తే కోప్పడతారా?.. అంత ఆస్తినే వదిలేశారు.. ఇదొక లెక్కా?.. అని దీప అనుకుంటూ ఉంటుంది. ఇక రుద్రాణి కారులో వెళ్తూ.. తన ఆధిపత్యాన్ని చూపే ప్రయత్నం చేస్తుంది.

    ఆరేయ్ స్లోగా పోనివ్వురా.. రుద్రాని రూల్స్ అన్నీ పాటించాలి కదా? అని ఇలా రుద్రాణి వెళ్తుంటే.. మరో వైపు కోటేశు, శ్రీవల్లి వస్తుంటారు. ఇన్నాళ్లు దేవుడు అన్యాయం చేశాడని అనుకున్నాం.. కానీ దేవుడు మనకు బాబును ఇచ్చాడు.. కుటుంబాన్ని ఇచ్చాడు.. అంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. రుద్రాణిని చూసి కోటేశ్.. అటు చూడకు.. అని శ్రీవల్లికి చెబుతాడు.

    ఏరా కోటేశు.. అలా చూడకుండా.. వెళ్తున్నావ్.. అని రుద్రాణి బెదిరిస్తుంది. ఏంట్రా ఆ సామెత.. అని తన మనుషుల్నీ రుద్రాణి అడుగుతుంది. అక్కా.. అది.. అంటూ గుణుగుతాడు. కండలు పెంచావ్ కానీ బుద్ది మాత్రం పెంచలేదురా అని రుద్రాణి తిడుతుంది.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడు అని దత్తత తీసుకున్నారు కదా? అని రుద్రాణి అంటుంది.

    బిడ్డకు దిష్టి తీసి డబ్బులు వేరే వాళ్లకు ఇస్తుంది రుద్రాణి. కాలం కలిసొచ్చింది కదా? అని దేవుడిని మొక్కడం మానేస్తామా? కోటేశు.. ఎంత గొప్పవాళ్లమైనా గుడికి వెళ్లాలి.. దండం పెట్టుకోవాలి.. భయం ఉండాలి.. నీ ఇంట్లో దిక్కుదివానం చూసుకుని రుద్రాణి అంటే భయం పోయింది కదా?.. వార్నింగ్ ఇచ్చాను.. గడువు ఇచ్చాను.. గడువు దాటాక.. మీ పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉంది.. బతకాలంటే గాలి ఉండాలి.. ఈ ఊర్లో బతకాలంటే రుద్రాణి అంటే భయం ఉండాలి.. అంటూ రుద్రాణి బెదిరిస్తుంది.

    ఎలా పోషించాలో తెలియక రోడ్డు మీద నడుచుకుంటూ కార్తీక్ వెళ్తుంటాడు. నేను ఏం పని చేయగలను.. అని డాక్టర్ బాబు ఆలోచనలో పడతాడు. అప్పుడు ఆ ఊరి ఆర్ఎంపీ డాక్టర్ చేష్టలు కనిపిస్తాయి. ఊరి జనాన్ని ఎలా పీడిస్తున్నాడో అర్థమవుతుంది. డబ్బులు తక్కువ ఇస్తున్నారని.. ఇలా చేస్తాడా?.. వీడేం డాక్టర్.. అసలు ఈ ఊర్లో మంచి డాక్టర్ లేడా? అని కార్తీక్ ఆలోచిస్తాడు.

    ఇక వారణాసిని సౌందర్య బతిమాలాడుతుంది. మాట్లాడవేంట్రా వారణాసి.. అక్క అని పిలిచేవాడివి.. కష్టాల్లో తోడుండే వాడివి కదరా.. అని సౌందర్య బాధపడుతూ ఉంటుంది. అక్క కోసం బస్తీ వాళ్లంతా వెతుకుతున్నారు.. అని వారణాసి చెబుతాడు. మాకు ఫోన్ చేయలేదు.. మీకైనా చేస్తుంది కదరా.. ఒక్క మాట చెప్పరా చాలు.. బాగున్నారనే మాట వింటే చాలురా.. ఎక్కడున్నారో అడగనురా..అని సౌందర్య కన్నీరుమున్నీరు అవుతుంది.

    కోడలి గురించి కన్నీళ్లు పెట్టుకుంటున్నారా.. కోడలి కోసం కన్నీరుమున్నీరు.. అంటూ ఇలా మంచి హెడ్డింగ్‌లు పెట్టొచ్చు అని మోనిత సెటైర్లు వేస్తుంది. దీంతో సౌందర్యకు కాలుతుంది.. ఆపుతావా? మోనిత.. నా కొడుకు కూడా లేడు కదా? నా కొడుకు కూడా మీ మనవడే.. కదా? ఆ బాధ లేదా? అని మోనిత అడుగుతుంది. నాది మీకు గోలలా ఉందా? అని మోనిత ఫైర్ అవుతుంది. అర్థం లేకుండా మాట్లాడకు.. అడ్డంగా వాదించకు.. అంత గొప్ప ప్రేమ నీకు ఉందా.. కొడుకు కనిపించకపోతే.. ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు వెతకాలి.. పక్షులు, జంతువులు కూడా వెతుకుతాయి.. కానీ నువ్ బాగానే ఉన్నావ్ కదా? నట్టింట్లో కూర్చుని మమ్మల్ని సాధిస్తున్నావ్.. నువ్ తల్లివేనా?.. ఆడదానివేనా?. అని తిట్టేస్తుంది సౌందర్య. ఆ రోజు మీరు హిమను ఎత్తుకొచ్చారు.. కార్తీక్, దీపలను కలిపేందుకు అలా చేశారేమో.. ఈ రోజు నా బిడ్డను దూరం చేశారు.. ఎవరో నన్ను, నా కార్తీక్‌ని విడగొట్టడానికి అలా చేశారేమో అని మోనిత అంటుంది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో దీప బంగారు పుస్తెల తాడు లేదేంటని శ్రీవల్లి అడుగుతుంది. అది కార్తీక్‌కు తెలుస్తుంది. బాధపడతాడు. అలా కార్తీక్ రియాక్షన్ ఏంటి? ఏదైనా పని వెతుక్కుంటాడా? ఆర్ఎంపీగా మారతాడా? అన్నది చూడాలి.

    Leave a Reply