- December 23, 2021
Pushpa Collection : ఇదేం దూకుడు ‘పుష్ప’.. హిందీలో బన్నీ హవా
Pushpa Day 6 Collection అల్లు అర్జున్ సినిమా అంటే ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. పుష్ప సినిమాకు వచ్చిన టాక్‌కు రాబడుతున్న కలెక్షన్లకు ఎక్కడా సంబంధం ఉండటం లేదు. సుకుమార్ సినిమాలన్నీ కూడా అంతే. మొదటగా ఎక్కవు. ఆ తరువాత స్లో పాయిజన్‌లా మారిపోతుంది. ఇది కూడా అంతే అయినట్టుంది. కలెక్షన్ల విషయంలో పుష్ప రాజ్ ఎక్కడా తగ్గడం లేదు.
ఐదు రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టేసింది. ఐదు రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 63.77 కోట్ల షేర్.. 96.05 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 103. 25కోట్ల షేర్.. 177 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం.
అదే ఆరో రోజు చూసుకుంటే దగ్గరదగ్గరగా 11 కోట్ల నుండి 12 కోట్ల వరకు గ్రాస్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. అలా మొత్తంగా ఈ ఆరో రోజుల్లో మొత్తంగా 190 కోట్ల గ్రాస్ మార్క్‌ను రీచ్ అయ్యేలా ఉంది. మొత్తానికి పుష్ప మాత్రం బాక్సాఫీస్ వద్ద నీయవ్వ తగ్గేదే లే అని అనిపించుకుంటోంది.
అయితే హిందీలో ఈ సినిమా అంచనాలకు మించి ఆడుతోంది. ఇప్పుడు ఈ విషయమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు ఈ సినిమాకు 3.11కోట్లు,రెండో రోజు 3.55, మూడో రోజు 5.18, నాలుగో రోజు 4.25, ఐదో రోజు 4.05 కోట్లను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఐదు రోజుల్లోనే 20 కోట్లకు పైగా రాబట్టినట్టు టాక్.
- Tags
- Pushpa 6th Day Collection
- Pushpa 6th Day Worldwide Collection
- Pushpa Collection
- Pushpa Day 6 Ceeded Collection
- Pushpa Day 6 Collection
- Pushpa Day 6 Gross Collection
- Pushpa Day 6 Nizam Collection
- Pushpa Day 6 overseas Collection
- Pushpa Day 6 Worldwide Collection
- Pushpa Day 6 Worldwide Gross Collection
- Pushpa Day 6 Worldwide Records
- Pushpa Day 6 Worldwide Share Collection
- Pushpa Records
- Pushpa The Rise 6th Day Collection
- Pushpa The Rise 6th Day Worldwide Collection
- పుష్ప
- పుష్ప 6వ రోజు కలెక్షన్
- పుష్ప 6వ రోజు కలెక్షన్లు
- పుష్ప 6వ రోజు కలెక్షన్స్
- పుష్ప ఆరో రోజు కలెక్షన్
- పుష్ప ఆరో రోజు కలెక్షన్లు
- పుష్ప ఆరో రోజు కలెక్షన్స్
- పుష్ప కలెక్షన్
- పుష్ప కలెక్షన్లు
- పుష్ప కలెక్షన్స్