- December 19, 2021
తెగ చక్కర్లు కొడుతున్న అనసూయ ఫోటో.. అసలు కథ మాత్రం మిస్టరీనే!

Anchor Anasuya అనసూయ భరద్వాజ్ అనే కంటే యాంకర్ అనసూయ అంటే ఎక్కువ ఫేమస్. ఇక రంగమ్మత్తగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత క్రేజ్. అలా బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తూ.. వెండితెరపై నటనను ప్రదర్శిస్తూ ఫుల్ ఫేమస్ అయింది. ఇక రెండు రోజుల నుంచి అనసూయ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో కనిపించిన అనసూయపై అందరూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మొదటి పార్ట్‌లో అనసూయకు సరైన నిడివి దక్కలేదని, గట్టిగా అంటే మూడు నాలుగు సీన్లకే అనసూయ పరిమితమైంది. అందులో కూడా అనసూయ ఎక్కువగా రిజిష్టర్ అవ్వలేదు. అలా మొత్తానికి అనసూయకు పుష్ప సినిమా ఎదురుదెబ్బలా మారింది. మరి సెకండ్ పార్టులోనైనా అనసూయకు తన సత్తాను మరోసారి నిరూపించుకునే చాన్స్ ఇస్తాడేమో చూడాలి.
తాజాగా అనసూయకు సంబంధించిన పాత ఫోటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అది ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చింది అనే విషయాలు ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఫోటో వైరల్ అవుతోంది. అది నిజంగానే అనసూయ ఫోటోనా? ఏంటి అలా ఉంది? అని నెటిజన్లు అవాక్కవుతున్నారు.
అనసూయ నడుము మడతలు, అలా పడుకున్న తీరు, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే అనసూయ అందరిలోనూ వేడి పుట్టించేస్తోంది. కానీ ఈ ఫోటో ఎక్కడిది అనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ సరిగ్గా అంచనా వేయలేకపోతోన్నారు. మొత్తానికి ఇలా ఫోటోతో కూడా అనసూయ హాట్ టాపిక్‌గా మారిపోయింది. కానీ ఆ ఫోటో కథ మాత్రం మిస్టరీగానే ఉంది.