- December 19, 2021
Pushpa Collection : ప్యాన్ ఇండియా అన్నారుగా.. ‘వకీల్ సాబ్’ను దాటని ‘పుష్ప’!
పుష్ప సినిమాకు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. సుకుమార్ ఐకాన్ స్టార్ అని అన్నాడట.. అల్లు అర్జున్ అది పెట్టేసుకున్నాడు. దాన్నే జనాల మీద రుద్దే ప్రయత్నం చేశాడు. సినిమా బయటకు వచ్చాక.. ఒక వేళ జనాలు అంతా సినిమాను మెచ్చి.. ఆ ట్యాగ్ ఇస్తే పెట్టుకోవాలి కానీ.. అలా డైరెక్టర్ ఇచ్చాడని, ఇలా పెట్టేసుకుంటే వాటికి వ్యాల్యూ ఏముంటుంది.
అలా ఐకాన్ స్టార్ అని బన్నీ తనకు తాను అనుకోవడమే తప్పా జనాలు మాత్రం అనుకోవడం లేనట్టుంది. పుష్ప ఫలితం తేడా కొట్టేసింది. సుకుమార్ మ్యాజిక్కులు, జిమ్మిక్కులు, లెక్కలు అన్నీ తప్పాయి. పైగా సుకుమార్ అంటే మరీ ఇలా కూడా తీస్తాడా? అని కొన్ని సీన్లను చూసి నవ్వుకునేలా చేశాడు. చాలా సీన్లు కాపీలా అనిపిస్తాయి. రష్మిక, బన్నీ సీన్లు అయితే మరీ ఛండాలంగా ఉన్నాయి. డబ్బులకు ముద్దు పెట్టేందుకు రావడం ఏంటో.. ఆ కారులో భుజం మీద చేతులు వేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించడం ఏంటో సుకుమార్‌కే తెలియాలి.
మొత్తానికి పుష్పకు ప్యాన్ ఇండియన్ కలర్ పూశారు. కానీ కంటెంట్ మాత్రం అంతగా లేకపోయింది. దీంతో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం వకీల్ సాబ్ లెక్కల్ని కూడా దాటలేకపోయింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 32.24కోట్ల షేర్ వసూల్ చేసింది.
ఇక పుష్ప మాత్రం వకీల్ సాబ్‌కు ఎంతో దూరంలో ఆగిపోయింది. పుష్ప రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 24.90 కోట్ల షేర్ కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది ఫస్ట్ డే హయ్యస్ట్ షేర్ కొల్లగొట్టిన సినిమాగా వకీల్ సాబ్ రికార్డు పదిలంగానే ఉంది. పాన్ ఇండియన్ పుష్ప మూవీ ఆ ఫీట్‌ను అందుకోలేకపోయింది.
- Tags
- pushpa
- Pushpa 1st Day Collection
- Pushpa 1st day Share
- Pushpa Collection
- Pushpa Day 1 Collection
- Pushpa Day 1 Share
- Pushpa Day 1 Share In Ap
- Pushpa Day 1 Share In AP TG
- Pushpa Day 1 Share In TG
- vakeel saab
- Vakeel Saab 1st Day Collection
- Vakeel Saab 1st day Share
- Vakeel Saab Collection
- Vakeel Saab Day 1 Collection
- Vakeel Saab Day 1 Share
- Vakeel Saab Day 1 Share In Ap
- Vakeel Saab Day 1 Share In AP TG
- Vakeel Saab Day 1 Share In TG
- పుష్ప
- పుష్ప కలెక్షన్
- పుష్ప కలెక్షన్లు
- పుష్ప కలెక్షన్స్
- పుష్ప ఫస్ట్ డే కలెక్షన్
- పుష్ప మొదటి రోజు కలెక్షన్స్ అంచనా
- వకీల్ సాబ్