• November 15, 2021

Prabhas: యూవీని మింగండిరా!.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

Prabhas: యూవీని మింగండిరా!.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

    ప్రభాస్ ఫ్యాన్స్‌కు యూవీ క్రియేషన్స్‌కు అస్సలు పడదన్న సంగతి మరో సారి రుజువైంది. అసలే అప్డేట్లు ఇవ్వడం లేదంటూ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. లేకలేక అప్డేట్ ఇచ్చారు. అది కూడా ఓ అభిమాని సూసైడ్ లేఖ రాసుకునేంత వరకు తీసుకొచ్చారు. అలాంటి యూవీ క్రియేషన్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. నేటి సాయంత్రం ఐదు గంటలకు మొదటి పాట అయిన ఈ రాతలే లిరికల్ వీడియోను విడుదల చేస్తామని చెప్పింది.

    కానీ ఎప్పటిలానే మళ్లీ హ్యాండ్ ఇచ్చింది. చెప్పిన టైంకు రిలీజ్ చేయలేదు. దీంతో అభిమానులు యూవీని దారుణంగా తిట్టి పోస్తున్నారు.. తాగి నిద్రపోతోన్నావా?రా.. యూవీని అందరూ కలిసి మింగండి రా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి యూవీ మాత్రం మరోసారి అభిమానులను మోసం చేసింది. కనీసం ఎందుకు ఆలస్యమయిందో చెప్పండిరా.. మళ్లీ ఎప్పుడు పాటను విడుదల చేస్తారో చెప్పండిరా అంటూ ట్రోల్స్,మీమ్స్ చేస్తున్నారు.


    మొత్తానికి యూవీ మాత్రం దారుణంగా దెబ్బ కొట్టేసింది. ఈ లెక్కన ప్రభాస్ అభిమానులు యూవీని అస్సలు క్షమించరు. మరి పాటను ఎప్పుడు వదులుతారో చూడాలి. ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోయిందంటూ అభిమానులు తెగ బాధపడుతున్నారు.

    Leave a Reply