- January 21, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. అప్పిగాడి మీద అరిచేసిన దీప.. అసలు నిజం తెలిస్తే ఇక అంతే?

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే శుక్రవారం నాడు అంటే జనవరి 21న ప్రసారం కానున్న Karthika Deepam Epiosde 1255 ధారావాహికలో కార్తీక్, దీపల గురించి అప్పిగాడు కూపీ లాగేందుకు ప్రయత్నిస్తాడు. మరో వైపు రంగరాజును ఎత్తుకెళ్లేందుకు రుద్రాణి ప్లాన్ వేస్తుంది. కాఫీ తాగేందుకు కార్తీక్ పని చేస్తున్న హోటల్‌కు ఆనంద్ రావు, సౌందర్యలు వస్తారు. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు కొనసాగింది.
ఆనంద్ అంటే తాతయ్య పేరు కదా? భలే కుదిరింది.. అంటూ హిమ, శౌర్యలు సంబరపడుతారు. ఆ మాటలు విన్న దీపకు మోనిత చేసిన పనులు గుర్తుకు వస్తాయి.అమ్మా.. వీడి పేరు తాతయ్య పేరు ఒకటే కదా?.. వీడు కూడా పెద్దయ్యాక తాతలానే అవుతాడు అని పిల్లలంటారు. ఆ మాటలతో ఆనంద్ రావు, సౌందర్యలను గుర్తు చేసుకుంటుంది దీప.. మోనిత బాధను తట్టుకోలేకే ఇక్కడకు వచ్చి ఉంటారా?.. అని ఆలోచిస్తుంటుంది.
ఇక సీన్ మోనిత మీద ఓపెన్ అవుతుంది. బిడ్డను కారులో వదిలేయడం బాధ్యత అనిపించుకుంటుందా? అని అన్న సౌందర్య మాటలను గుర్తు చేసుకుంటుంది మోనిత.. లక్ష్మణ్ వచ్చావా?. నాకు ఓ పని చేసి పెట్టాలి.. వీడు ఎవడో నా బాబును ఎత్తుకెళ్లాడు.. అని చెబుతుంది. ఎక్కడని వెతకాలి మేడం..అని ఎదురు ప్రశ్నిస్తాడు. డబ్బు ఎంతైనా పర్లేదు.. అని మోనిత అంటుంది.
పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే వెతుకుతారు కదా?. అని మోనితకే సలహా ఇస్తాడు. దీంతో మోనితకు చిర్రెత్తుకొస్తుంది. ఫ్లవర్ వాజ్‌ను పగలగొడుతుంది. విన్ని కాఫీ తెమ్మని ఎంతసేపు అయింది.. అని అరిచేస్తుంది. ఏంటో అంటున్నావ్ లక్ష్మణ్.. పోలీస్ కంప్లైంటా? ఇంత మంచి ఆలోచన నాకు రాలేదేంటి? అని మోనిత సెటైర్ వేస్తుంది. నేను చెప్పిన పని చేయాలి.. సలహాలు ఇవ్వొద్దు.. అని మోనిత అంటుంది. కష్టం మేడం.. అని లక్ష్మణ్ అంటాడు. కృతజ్ఞత అని ఒక పదం ఉంటుంది.. అది నీకు లేదు.. నా కోసం ఈ పని చేయలేకపోతోన్నావ్.. మీ ఆవిడకు ఫీజు లక్షన్నర.. నీకు ఇంకా తగ్గించా.. వెళ్లి నా ఫీజు ఏర్పాట్లు చూడు.. నా బాబును ఎలా వెతుక్కోవాలో నాకు బాగా తెలుసు..అని లక్ష్మణ్‌ను ఇరకాటంలో పెడుతుంది.
ఇక హోటల్‌లో అప్పారావ్ నిద్రపోతోంటాడు. లే.. టైం ఎంత అయిందో చూడు.. అని దీప అంటుంది. అంతా రెడీ చేశాను.. అని అప్పిగాడు అంట.. వెంకటమ్మ రాలేదు కదా?. నాకు కొంచెం సాయం చేయ్.. అని దీప అంటుంది. పొయ్యి వెలిగించు..వస్తాను..అని అంటాడు. సినిమా స్టార్లంటే.. క్రమశిక్షణ ఉండాలి అని దీప అంటుంది.. అవునా నాకు తెలీదే.. ఇక నుంచి అలానే ఉంటాను.. అని అప్పిగాడు అంటాడు. గ్యాస్ సిలిండర్ తేలేదేంటి అక్కా అని అప్పి అడిగితే.. మా ఆయన తెచ్చాడు అని చెబుతుంది.. ఆశ్రమానికి పార్శిల్ తీసుకెళ్దామా?.. అని దీప అంటే.. అక్కడ ఎవరు తీసుకుంటారు.. ఎవరో కొత్తగా వచ్చిన వారు అప్పుడప్పుడు పార్శిల్ తీసుకుంటారు అని అప్పిగాడు అంటాడు.
పిల్లలకు టిఫిన్ తినిపిస్తుంటాడు కార్తీక్. అమ్మ పొద్దున్నే లేస్తుంది.. వెళ్తోంది.. అని పిల్లలంటారు. పొద్దున్నే లేవడం మంచి అలవాటు అని కార్తీక్ అంటాడు. మమ్మల్ని మాత్రం పొద్దున్నే నిద్రలేవమని చెప్పొద్దు.. పొద్దున్నే లేచి అక్కడ పని చేస్తుంది.. మళ్లీ మనకు ఇక్కడ చేస్తోంది. అసలు అమ్మకు నిద్ర ఉంటుందా? అని పిల్లలు అనుకుంటారు. ఒకప్పుడు వంటలు పడవని దీపను వద్దన్నాను. కానీ ఇప్పుడు నేనే పంపిస్తున్నాను.. నేను ఎంత రాక్షసుడినో.. అని కార్తీక్ ఆలోచిస్తుంటాడు.
ఏం ఆలోచిస్తున్నావ్ డాడీ.. నానమ్మ, తాతయ్యల గురించా? దీపు గాడు ఎలా ఉన్నాడో ఏమో.. వాళ్లకి ఫోన్ కూడా చేయడం లేదు.. అని పిల్లలుంటార. వారేం అనుకుంటున్నారో.. బాదపడుతున్నారేమో అని పిల్లలంటారు. మళ్లీ వెళ్తాం కదా? అప్పుడు సారీ చెబుదాం..అని కార్తీక్ అంటే.. వాళ్లను బాధ పెట్టడం ఎందుకు.. సారీ చెప్పడం ఎందుకు.. అని హిమ అంటుంది. వాళ్లనే ఇక్కడకు పిలుద్దాం.. అని శౌర్య అంటుంది. వాళ్లు కూడా ఇక్కడే ఉన్నారు…కానీ చూసే అదృష్టం కూడా లేదు అని కార్తీక్ తనలో తాను అనుకుంటాడు. ఇక ఆనంద్‌ను కాసేపు చూసుకోమ్మని మహాలక్ష్మీకి అప్పజెబుతాడు కార్తీక్.
అరేయ్ పిల్లి గడ్డం ఏం చేస్తున్నావ్ రా అని రుద్రాణి అడుగుతుంది.. లెక్కలు చూస్తున్నా అక్కా అని అంటాడు.. ఆ లెక్కలు పక్కన పెట్టు.. నాకు ఒక పని చేయ్ అని రుద్రాణి అంటుంది.. చెప్పింది చేస్తే నాకు నచ్చుతుంది.. అని రుద్రాణి అంటే.. నువ్ గీసిందే గీత రాసిందే రాత చెప్పు అక్కా అని అంటాడు సరదాగా వెళ్లి ఆ పని పూర్తి చేసుకునిరా.. అని చెబుతుంది. దీప నీకు వేరే దారి లేదు.. నీ దారులన్నీ మూసేసుస్తాను.. గీసిందే గీత రాసిందే రాత.. ఈ రుద్రాణి నుంచి తప్పించుకోలేవ్ దీప.. అని రుద్రాణి అనుకుంటుంది.
హోటల్ నుంచి లేట్ అవ్వడంతో దీప చాలా ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్తుంది. అక్కా.. అక్కా..అంటూ అప్పిగాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది అని దీప అడుగుతుంది. ఓ కవర్ ఇస్తాడు అప్పిగాడు. ఇదేనా? ఏమైందో అని భయపడ్డాను..అని దీప అంటుంది. భయం ఎందుకు అక్కా అని అప్పిగాడు అంటాడు. టైం బాగా లేనప్పుడు ప్రతీదానికి భయపడాల్సిందే అని దీప అంటుంది.
సైకిల్ ఉంది కదా? పరిగెత్తుకుని రావడం ఎందుకు..అని అడుగుతుంది. అది పంక్చర్ అయిందని చెబుతాడు అప్పిగాడు. అలా మెల్లిగా నడుచుకుంటూ వస్తూ దీప గురించ అన్నీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. బావ ఏం చేస్తున్నాడు.. అని అడుగుతాడు. ఇప్పుడు ఖాళీ అని దీప అంటే.. ఒకప్పుడు ఏం చేసేవాడు అని మళ్లీ అడుగుతాడు.. అందరికీ మంచి చేసే పని చేసేవాడు.. అని అంటుంది.
నాకు బావను చూడాలని ఉంది.. ఎలా ఉంటాడు.. స్టైల్, హీరోగా ఉంటాడు.. అని చెబుతుంది. అక్క సెలెక్షన్‌గా అలానే ఉంటుంది అని అప్పారావు అంటాడు. ఏం చదువుకున్నాడు.. ఏం చదువుకోలేదా?. అయితే బావను కూడా హోటల్‌కు తీసుకొస్తే.. మనతో పాటే.. ఆడుతు పాడుతూ ప్లేట్లు..అని అప్పిగాడు అనడంతో దీప ఫైర్ అవుతుంది. అప్పారావ్ అని అరిచేస్తుంది.
సారీ అక్కా..బావ ఇలాంటి పనులు చేయడన్నమాట.. భర్త హీరోనే కదా? ఒక చోట కలిసి ఉంటారని అలా అన్నాను.. ఇద్దరి సంపాదన కలిస్తే బాగుంటుందని అలా అన్నాను అక్కా అని అంటాడు.. హోటల్లో వంట చేస్తే బాగుంటుంది.. ఇంట్లో ఎలా ఉంటుందో అని మనసులో ఆ కోరిక ఉంది నన్ను భోజనానికి పిలవవా? అక్కా అని అంటాడు అప్పిగాడు. సరే రా కానీ.. నేను హోటల్‌లో పని చేస్తున్నానని చెప్పకు అని అంటుంది. అలా అప్పిగాడు వెనక్కి వెళ్లిపోతాడ. హోటల్‌కు వెళ్లొస్తాను మళ్లీ ఆ భద్రం. బొంబాయ్‌లో ఇలా కాదని అంటాడు అని కౌంటర్ వేసుకుంటూ వెళ్తాడు.
ఇక కారులో ఆనంద్ రావు, సౌందర్యలు అలా బయటకు వస్తారు. కాసేపు అలా బయటకు తిరిగితే మనసు ప్రశాంతంగా ఉంటుందని గురువు గారు చెప్పారు అంటూ సౌందర్య చెబుతుంది.. ఆకలి వేస్తే తినాలి కానీ చూస్తే నిండదు.. నాకు పెద్దొడు కనిపిస్తేనే బాగుంటుంది.. అని ఆనంద్ రావు అంటాడు. మనం ఎంత బాధపడుతున్నామో.. వాళ్లు కూడా అంతే బాధపడుతుంటారు.. కదా? త్వరలోనే వస్తారు అని సౌందర్య అంటుంది. కార్తీక్ నుంచి కబురు తెలియగానే.. ఇక్కడ నుంచి వెళ్దామని అంటాడు ఆనంద్ రావు. ఇక్కడ మంచి కాఫీ దొరుకుతుందా? అని ఆనంద్ రావు అంటే.. మంచి హోటల్ దొరక్కపోదు అని బొంబాయ్ హోటల్‌లోనే ఆగుతారు.
ఇక అప్పిగాడు వింత డ్యాన్సులు వేసుకుంటూ కార్తీక్‌ను భయపెడతాడు. ఎలా ఉందని అడిగి విసిగిస్తాడు. నిన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుదామని అనుకున్నాను.. అక్క ఏం చేస్తుంది.. మీరు ఎంత మంది.. ఎక్కడుంటారు అని అడుగుతాడు. ఎందుకు ఒకే సారి అన్ని ప్రశ్నలు.. అని కార్తీక్ అంటాడు. అభిమానం తెలుసుకుందామని అని అప్పిగాడు అంటాడు. ఇద్దరు పిల్లలు.. ఐదో తరగతి అని అంటాడు. నీకు అంత ఏజ్ ఉన్నట్టు లేదు బావ.. అని అంటాడు.
ఇంతలో ఆనంద్ రావు, సౌందర్య వస్తే.. అప్పిగాడిని ఆర్డర్ తీసుకునేందుకు పిలుస్తాడు హోటల్ యజమాని. అప్పిగాడు కాస్త ఓవర్ చేస్తుంటే.. మనం తెలుగులో మాట్లాడుకుందామా? అని సౌందర్య కౌంటర్ వేస్తుంది. టిఫిన్ మీల్స్..అని అప్పిగాడు అంటే.. కాఫీ దొరుకుతుందా? అని ఆనంద్ రావు అంటాడు. కాఫీ దొరుకుతుందా? తాగాక చెప్పండి.. అని.. బావ రెండు స్పెషల్ కాఫీ అని అరిచేస్తాడు..
దీప దగ్గర కాఫీ పెట్టుకునే టెక్నిక్ తెలుసుకున్నా కాబట్టి సరిపోయింది.. ఇప్పుడు ఇలా ఉపయోగపడిందని కార్తీక్ అనుకుంటాడు. ఇక అప్పిగాడు వారితో మాటలు కలిపేస్తుంటాడు. మీది హైద్రాబాదా? త్వరలోనే అక్కడకు రాబోతోన్నాను.. హీరో అవుతాను అని అప్పిగాడు అంటే.. తెలుస్తూనే ఉంది తింగరోడివి అని అంటూ సౌందర్య సెటైర్ వేస్తుంది. సరే రా అని అంటే.. రానా? ఇది వరకు కూడా ఓ మేడం వచ్చింది.. చూస్తే యాక్టర్‌లా ఉంది కానీ డాక్టర్ అటా.. ఆమె భర్త కూడా డాక్టరేనట.. అని అప్పిగాడు మోనిత విషయం చెబుతుంటాడు. దీంతో సౌందర్యకు డౌట్ వస్తుంది. ఇక మరో వైపు కార్తీక్ తన తల్లిదండ్రులను హోటల్లో చూసి షాక్ అవుతాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఆనంద్‌ని రుద్రాణి ఎత్తుకెళ్తుంది. దీప ఏం చేయలేక వెనక్కి తిరిగి వస్తుంది. ఆ అప్పు ఎలా కడుతుందో చూడాలి.