- November 16, 2021
Jabardasth Show: జబర్దస్త్‌ను వీడిన సుడిగాలి సుధీర్.. నోరు విప్పిన గెటప్ శ్రీను

Jabardasth Show గత రెండు రోజులుగా సుధీర్‌కు సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి. సుధీర్ జబర్దస్త్ షోను వీడిపోతోన్నాడని, అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టేందుకు నిరాకరించాడని ఇలా ఏవేవో వార్తలు వచ్చాయి. ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో ఉండలేను.. జబర్దస్త్‌కు మార్చండి అని అడిగాడట. అందుకే మల్లెమాల వాళ్లు ఒప్పుకోలేదట. దీంతో సుధీర్ అలిగాడట.
అందుకే జబర్దస్త్ నుంచి వీడిపోయేందుకు సిద్దపడ్డాట. అలా మొత్తానికి ఏవేవో రూమర్లు అయితే బయటకు వచ్చింది. ఒక వేళ అదే నిజమైతే పరిస్థితి ఏంటి అని అందరూ అనుకున్నారు. ఆలోచనలో పడ్డారు. సుధీర్లేని ఎక్స్ ట్రా జబర్దస్త్ షో, సుధీర్ లేని ఆ టీం నిలబడగలదా? అని అనుకున్నారు. అయితే సుధీర్ బయటకు వచ్చేశాడు అనే వార్తలో ఎంత నిజం ఉందన్నది ఎవ్వరికీ తెలీదు.
కానీ తాజాగా సుధీర్ తరుపున గెటప్ శ్రీను రంగంలోకి దిగాడు. సుధీర్ వెళ్లిపోతే.. శ్రీను, రామ్ ప్రసాద్ కూడా వెళ్లిపోతాడనే టాక్ వచ్చింది. దీంతో శ్రీను నోరు విప్పాడు. రూమర్లను ఖండించాడు. రియల్ ఆ? ఫేక్ ఆ?.అన్నీ మీరే ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లడం లేదు. కూల్ అంటూ ఎక్స్ ట్రా జబర్దస్త్, సుధీర్ మీద వస్తున్న రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేశాడు శ్రీను.