- November 3, 2021
Rajinikanth: ఆ ఘటన ఎప్పటికీ మరిచిపోను.. రజినీపై డైరెక్టర్ శివ కామెంట్స్

Rajinikanth శౌర్యం సినిమాతో ఇక్కడ దర్శకుడిగా శివ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అజిత్‌తో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేశాడు. వేదాళం, వివేకం, విశ్వాసం అంటూ దుమ్ములేపేశాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అన్నాత్తె (పెద్దన్న)గా చూపిస్తున్నాడు. అయితే ఈక్రమంలో శివ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను చెప్పుకొచ్చాడు.
విశ్వాసం సినిమా బాగా పెద్ద హిట్ అయింది. అది చూసి రజినీ కాంత్ గారు పిలిచారు. నాతో ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్నావ్? అని రజినీకాంత్ గారు అడిగారు. సూపర్ స్టార్ లాంటి సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పాను. సూపర్ స్టార్ సినిమా అంటే ఏంటి? అని నవ్వుతూ అడిగేశారు. అన్ని రకాల ఎమోషన్స్‌తో కమర్షియల్‌గా ఉంటే అది సూపర్ స్టార్ సినిమా అని చెప్పాను. సరే అలాంటిదే చేద్దామని నవ్వుతూ అన్నారు.
షూటింగ్ అంతా కూడా సరదాగానే జరుగుతూ ఉంటుంది. మంచి సీన్లు చేస్తే.. అందరి ముందే ప్రశంసించేవారు. సినిమా బాగా తీస్తున్నాడని అన్నారు. అయితే కొంత సినిమాను ఎడిట్ చేసి చూపించాను. నా సినిమాను చూసినట్టు అనిపిస్తోందని రజినీకాంత్ గారు అన్నారు. ఆ తరువాత సినిమా మొత్తం చూశారు. బయటకు వచ్చి నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అది నేను ఎప్పటికీ మరిచిపోను. ఎంతో సంతృప్తితో ఆయన అలా చేశారు. అదే నాకు అతి పెద్ద ప్రశంస అని అన్నాడు.