- October 4, 2022
ఆయుధ పూజ సందర్భంగా ‘ఉస్తాద్’ ఎంట్రీ

టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ మరో కొత్త కథతో రెడీ అవుతున్నారు. దసరా సందర్భంగా శ్రీ సింహ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దసరాకు అంతా కూడా ఆయుధ పూజలు చేస్తుంటారు. ఇలాంటి ఆయుధ పూజ నాడు మా ఉస్తాద్‌ను మీకు పరిచయం చేయడం ఆనందంగా ఉందంటూ మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో శ్రీ సింహా ఎంతో ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఈ బైక్ పేరు ఉస్తాద్. బైక్‌తో దోస్తీ చేసే ఈ ఉస్తాద్ కథ ఆసక్తికరంగా ఉంటుందని మేకర్లు తెలిపారు. వారాహి చలన చిత్ర బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి గారి ఆధ్వర్యంలో కృషి ఎంటర్టైన్మెంట్స్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మే నెలలోనే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. దాదాపు తొమ్మిది రోజుల పాటు జడ్చర్ల గ్రామంలో ఈ మూవీ షూటింగ్‌ను నిర్వహించారు. సెప్టెంబర్ 15న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ మూడో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. అక్టోబర్‌లోనే మూడో షెడ్యూల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లనుంది చిత్రయూనిట్. రానున్న రోజుల్లో ఈ మూవీ నుంచి మరిన్ని సర్ ప్రైజ్‌లు వస్తాయని మేకర్లు తెలిపారు.