- May 10, 2024
శింగనమలలో వారికి షాక్ తప్పదా.. గెలిచేది ఎవరంటే?
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యిందన్న సంగతి తెలిసిందే. ఈ పదేళ్లలో కాంగ్రెస్ పేరు కూడా ఎక్కడా కనిపించలేదు వినిపించలేదు. ఎట్టకేలకు కాంగ్రెస్ నుంచి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నమోదు అవ్వబోతుందనే టాక్ వినిపిస్తుంది. శింగనమల సీటుని కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందట.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ పీసీసీ ప్రెసిడెంట్ శైలజానాథ్ గెలిచే అవకాశం కనిపిస్తోందట. ఇప్పటికే వైకాపా, తెలుగు దేశం కూటమి అభ్యర్థుల్లో ఆ భయం కనిపిస్తోందట. వారంతా కూడా తమ ఓటమిని అంగీకరించినట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందు మాట్లాడుతున్నారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టిన తర్వాత చాలా వరకు మార్పు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి, వైకాపా ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటే.. ఒక్క శింగనమలలో మాత్రం త్రిముఖ పోరు కనిపించేలా ఉందట. సర్వేలన్నీ కూడా శింగనమలలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెబుతున్నాయట. మరి జనాల ఓట్లు ఎవరికి పడతాయ? పోలింగ్ తేదీ నాటి సరళి ఎలా ఉంటుంది? ఫలితం ఎలా వస్తుందో చూడాలి.