- October 27, 2021
IND VS PAK : వాటిని తట్టుకోలేకపోయారు.. అందుకే ఓడిపోయామన్న సచిన్
పాక్ చేతిలో భారత్ ఓటమి అనేదాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతోన్నారు. ప్రపంచ జట్టులో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చిన జట్టు పాకిస్థాన్ టీం ముందు తలొంచడాన్ని ఎవ్వరూ తట్టుకోలేకపోతోన్నారు. కారణాలు ఏవైనా సరే భారత్ ఓటమిపై మాత్రం అభిమానులు గుర్రుగా ఉన్నారు. చెత్త బ్యాటింగ్, అత్యంత దారుణమైన బౌలింగ్‌తో మ్యాచును చేజేతులారా నాశనం చేశారంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఓటమిపై కారణాలను మాస్టర్ బ్లాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ వివరించారు. పాకిస్థాన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. అది బ్యాటింగ్ పిచ్చ అయినా కూడా మన వాళ్లు దాదాపు 25 పరుగులు తక్కువ చేశారు. షహీన్ అఫ్రిది విసిరిన అప్ ఫ్రంట్ బాల్స్‌ను తట్టుకోలేకపోయారు. వాటి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఎదుర్కోవడంలో సరైన ఫుట్ వర్క్ కనిపించలేదు. గంటలకు 140 కి.మీ వేగంతో బంతులు విసురుతుంటే వాటిని మనవాళ్లు తట్టుకోలేకపోయారు. పాక్ బౌలర్ల సరైన ప్రణాళికతో ఒకరి తరువాత మరొకరు అవసరాలకు తగ్గట్టుగా బౌలింగ్ చేసి విజయాన్ని అందుకుంది.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడి చాలా రోజులు అయింది. వారి ఆట తీరును అర్థం చేసుకునేందుకు కాస్త సమయం పడుతుంది. సరైన సమయంలో వికెట్లు కోల్పోవడం భారత్‌ను దెబ్బ కొట్టేసిందని సచిన్ తన విశ్లేషణను పంచుకున్నాడు.