• October 17, 2021

టీమిండియాకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

టీమిండియాకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

    ప్రస్తుతం టీమిండియా మంచి ఫాంలో ఉంది. అయితే రవిశాస్త్రి తన కోచ్ బాధ్యతలకు ముగింపు పలకనున్నాడు. టీ20 ప్రపంచ కప్ ముగిసిన తరువాత వచ్చే నెలలో పదవి నుంచి తప్పుకోనున్నాడు. ఆ స్థానంలో రాహుల్ ద్రవిడ్ రాబోతోన్నారట. ఈ మేరకు  బీసీసీఐ నుంచి లీకులు వచ్చేశాయి. ద్రవిడ్‌ను కోచ్‌గా తీసుకొచ్చేందుకు స్వయంగా గంగూలి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

     

    గత కొన్నేళ్లుగా కోచ్ బాధ్యతలను ద్రవిడ్‌కు అప్పగించాలని అంతా అనుకుంటున్నారు. కానీ ద్రవిడ్ మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే ఈసారి గంగూలి పట్టుబట్టడంతో ద్రవిడ్ రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యాడట. 2023 ప్రపంచ కప్ లక్ష్యంగా భారత జట్టును మరింత మెరుగుపరిచేందుకు ద్రవిడ్ రాబోతోన్నాడట.

    Leave a Reply