- November 2, 2021
న్యూజిల్యాండ్‌తో ఓటమి.. విరాట్‌పై కపిల్ దేవ్ కామెంట్స్
టీ 20 వరల్డ్ కప్ మ్యాచుల్లో భారత్ వరుస పరాజయాలపై ఎంతటి ట్రోలింగ్ జరుగుతోందో అందరికీ తెలిసిందే. పాక్ ఓటమిని జీర్ణించుకోకముందే న్యూజి లాండ్ చేతిలో చావు దెబ్బ పడింది. మరీ దారుణంగా 20 ఓవర్లలో 111 మాత్రమే చేయడంపై విపరీతమైన మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. పెట్రోల్ రేటు కంటే చాలా తక్కువ పరుగులు తీశారంటూ టీమిండియాపై సెటైర్లు వేశారు. అయితే ఈ ఓటమిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. తమ జట్టులో ధైర్యం లోపించిందని విరాట్ అన్నాడు.
అలాంటి కామెంట్లు చేయడంపై కపిల్ దేవ్ రియాక్ట్ అయ్యాడు. అలాంటి మేటి ఆటగాడు.. ఇలా ధైర్యం కోల్పోయామని అనడం నాకు నచ్చలేదు.. అది ఓ బలహీన ప్రకటన అవుతుంది. గెలవాలనే కసి, కోరిక కోహ్లీలో ఉన్నాయని నాకు తెలుసు. అతన్నీ నమ్మాం. కెప్టెన్ ఆలోచన సరళి ఇలా ఉంటే.. డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపడం కష్టం అవుతుంది. జుట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపమని నా స్నేహితుడు రవిశాస్త్రితో పాటు ధోనిని కూడా కోరుతున్నానని కపిల్ దేవ్ అన్నాడు.