- October 21, 2021
Kapil Dev: టీ20 ప్రపంచ కప్‌పై కపిల్ దేవ్
Kapil Dev ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా కూడా ఐపీఎల్ ఫీవర్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు వారి దృష్టి అంతా కూడా టీ20 ప్రపంచ కప్ మీద ఉంది. టీమిండియా కూడా ఈసారి కప్పు కొట్టేయాలని రవిశాస్త్రి కోహ్లి ద్వయానికి ఇది చిరకాలంగా గుర్తుండిపోయే విజయం కావాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే టీ20 ప్రపంచకప్‌పై కపిల్ దేవ్ మాట్లాడాడు. ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. కేఎల్ రాహుల్ టీమిండియాకు దొరికిన గొప్ప ఆస్తి అని అభివర్ణించాడు.
కేఎల్ రాహుల్ ఆటను స్వాగతిస్తాను. అద్బుతంగా ఆడతాడు. కాన్ఫిడెంట్‌గా షాట్లు కొడతాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన రాహుల్.. టీ20 ప్రపంచ కప్‌లోనూ రాణిస్తాడని అనుకుంటున్నాను అని అన్నాడు. కోచ్‌గా రవిశాస్త్రి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడని, ఇది చివరి మ్యార్ కాబట్టి టీ20 ప్రపంచ కప్ ఈ సారి మెరుగ్గా రాణించి చాంపియన్‌గా నిలవాలని కపిల్ దేవ్ కోరుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని మెంటర్‌గా ఉండటం కలిసి వచ్చే అంశం అని అన్నాడు.