• October 26, 2021

భారత్ పాక్‌లపై ఐసీసీ హర్షం.. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే!

భారత్ పాక్‌లపై ఐసీసీ హర్షం.. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే!

    భారత్ పాకిస్థాన్ టీ 20 ప్రపంచకప్ మొదటి మ్యాచ్ ఎలాంటి ఫలితం ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఫేవరేట్ జట్టుగా, తిరుగులేని ఆధిక్యాన్ని కనబరిచే భారత జట్టు.. పాక్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అయితే కొంత మంది మాత్రం క్రీడా స్ఫూర్తితో పాక్ అద్భుతంగా ఆడినందుకు అభినందించారు. మన కెప్టెన్ కోహ్లీ, ధోని సైతం మైదానంలో పాక్ క్రీడాకారులతో నవ్వుతూ మాట్లాడారు. వారిని హగ్ చేసుకున్నారు. క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు.

    అయితే దీనిపై ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. ఎక్కడైనా ఆటలో గెలుపొటములు సహజమన్నట్టుగా ప్రవర్తించడంపై ఇరు జట్లను అభినందించింది. భారత్ పాక్ అంటూ బయట ఉన్నంత భావోద్వేగం, ఉద్రిక్త వాతావరణం, ఉద్వేగాలు రెండు జట్ల మధ్య ఉండవని ఐసీసీ పేర్కొంది. అసలు విషయం ఇదే.. ఎంతో చక్కగా ప్రేమగా కలిసి క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నారు అని ప్రశంసించింది. మరో వైపు పాక్ జట్టు సైతం.. ఇండియా లాంటి టీం మీద గెలవడం ఆనందంగా ఉందంటూ పొంగిపోయింది.

    Leave a Reply