• October 19, 2021

రూ. 23 లక్షల కోట్లు సంపద పంచుతాం.. దళితబంధుపై కేసీఆర్

రూ. 23 లక్షల కోట్లు సంపద పంచుతాం.. దళితబంధుపై కేసీఆర్

    హుజురాబాద్ ఎన్నికల వల్ల తెలంగాణలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకే దళితబంధు అని పెట్టి.. ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల చొప్పున ఇస్తున్నాడంటూ కేసీఆర్ మీద అందరూ విరుచుకుపడుతున్నారు. ఇక ఒక్క హుజురాబాద్‌లోనే దళిత బంధు ఇస్తే కుదరదు అని, రాష్ట్రం అంతటా ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక అక్కడి నుంచి మరొ కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

    దళితులకు ఇస్తున్నారు.. మరి మాకు ఇవ్వరా? మా ఓట్లు వద్దా? అంటూ మిగలిన వర్గాల ప్రజలురోడ్డు మీదకు వచ్చారు. దీంతో ప్రభుత్వం ఆలోచనల్లో పడ్డట్టు కనిపించింది. అయితే ఏ మాత్రం అడుగు వెనక్కి వేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకే వెళ్తోన్నట్టు కనిపిస్తోంది. నిన్న టీఆర్ఎస్‌లోకి మోత్కుపల్లి నర్సింహులును కేసీఆర్ ఆహ్వానించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో దళిత బంధు గురించి మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

    దయనీయస్థితిలో ఉన్న వర్గాను ఆదుకునేందుకు దళిత బంధు పథకాన్ని తెచ్చామని, ఈ ఒక్కరితోనే ఆగబోయని బీసీలు, గిరిజనలు, మైనార్టీలు, ఈబీసీ, ఇతర వర్గాల పేదలకు కూడా వర్తింపజేస్తామని కేసీఆర్ అన్నాడు. దళితబంధుకు 1.73లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని, వచ్చే ఏడేళ్లలో ఇతర వర్గాలకు రూ. 23 లక్షల కోట్లు సంపద పంచుతామన్నాడు.

    Leave a Reply