• November 13, 2022

యానంలో జెట్టి చిత్రం హిరో సందడి

యానంలో జెట్టి చిత్రం హిరో సందడి

    ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తున చిత్రం జెట్టి. ఈ మూవీ ని
    హీరో మాన్యం కృష్ణ యానం కి విచ్చేసి ప్రేక్షకుల మధ్య సినిమా వీక్షించి సందడి చేశారు. ఈ శుక్రవారం ఉదయం ఆట కు మాజీ మంత్రి వర్యులు, ప్రస్తుత తితిదే బోర్డ్ మెంబర్ మల్లాడి కృష్ణ రావు ప్రత్యేక అతిధి గా విచ్చేశారు.
    ఈ సందర్భంగా మల్లాడి కృష్ణా రావు మాట్లాడుతూ :
    ఇటువంటి కథ లు తెరమీద కు తీసుకురావడం చాలా కష్టం. ఈ ప్రయత్నం చేసిన టీమ్ ని అభినందిస్తున్నాను.
    ఈ కథ లో చూపిన సమస్యలు చాలా మందికి బాధ్యతలను గుర్తు చేస్తాయి. ఈ సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది అన్నారు

    హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ :
    జెట్టి సినిమా ని ఆదరిస్తున్న యానం ప్రాంత వాసులకు కృతజ్ఞతలు. తీర ప్రాంతాలలో జెట్టి సినిమా ఆదరణ పెరుగుతుంది. షోస్ కూడా పెరుగుతుండటం చాలా ఆనందం గా ఉంది.
    మల్లాడి కృష్ణ రావు గారికి కృతజ్ఞతలు.
    మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ దక్కుతున్నందుకు ఆనందం గా ఉంది. అన్నారు..