• March 17, 2023

Ganaa Movie Review : గణా రివ్యూ.. యాక్షన్ ఎంటర్టైనర్

Ganaa Movie Review : గణా రివ్యూ.. యాక్షన్ ఎంటర్టైనర్

    Ganaa Movie Review ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకులు, హీరోలు ఒక్కరే. హీరోలే డైరెక్టర్లు. డైరెక్టర్లే హీరోలు. ఇప్పుడు విజయ్ కృష్ణ సైతం గణా అంటూ హీరోగా,దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    వైజాగ్ పోర్ట్ ఏరియాలో డ్రగ్స్ దందా జరుగుతుంది. దానికి హెడ్డుగా మినిస్టర్ కోటేశ్వరరావు ఉంటాడు. గణా (విజయ్ కృష్ణ) మినిస్టర్‌కు చేదోడు వాదోడుగా ఉంటాడు. అయితే మినిస్టర్‌కు ఈ డ్రగ్స్ వ్యవహారంలో వోడ్కా దాస్ అనే వాడు ఎదురుతిరిగితే గణా వాడ్ని చంపేస్తాడు. దాస్ తమ్ముడు దాము ఇక పగతో రగిలిపోతోంటాడు. గణా కోసం కాచుకుని కూర్చుంటాడు. అనుకోకుండా గణా ఓ సారి డాక్టర్ సౌమ్య (యోగిష)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ చివరకు సౌమ్య తండ్రినే గణా చంపాల్సి వస్తుంది. కానీ ఆ నేరం గణా చేయకుండానే సౌమ్య తప్పుగా అపార్థం చేసుకుంటుంది. అసలు గణా చేసే పనులేంటి? అతని నేపథ్యం ఏంటి? అతని జీవితంలో ప్రియ (తేజు) అనే అమ్మాయి చాప్టర్ ఏంటి? చివరకు సౌమ్య, గణాల కథ ఏమైంది? అన్నది కథ.

    వైజాగ్ సముద్రం, పోర్ట్ చుట్టూ కొన్ని వందల వేల కథలు వచ్చాయి. అయితే సహజత్వానికి దగ్గరగా తీసే చిత్రాలు కాస్త ప్రేక్షకుడికి కొత్తగా అనిపిస్తాయి. గణా సైతం మన వైజాగ్, యానం, కాకినాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో తీయడంతో అదే ఫీలింగ్ వస్తుంది. కాస్త నేటివిటీ కనిపించడంతో తెరపై ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది.

    ఈ గణా సినిమాలో ఎక్కువగా డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెస్ తీరు తెన్నులు చూపించాడు ప్రథమార్థం అంతా కూడా గణా అసలు రౌడీనా? హీరోనా? అనే ప్రశ్న తలెత్తేలా నడిపిస్తాడు. గణా కూడా అచ్చం రౌడీలానే ప్రవర్తిస్తుంటాడు. అయితే వీటికి సంబంధించిన ప్రశ్నలకు సెకండాఫ్‌లో సమాధానాలు దొరుకుతాయి. ఇంటర్వెల్ సీన్‌ కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది.

    ద్వితీయార్థంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌, క్లైమాక్స్, ప్రీక్లైమాక్స్ అయితే పోకిరి రేంజ్ ట్విస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. కథ, కథనాన్ని, అందులోని ఎమోషన్‌ను ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో దర్శకుడు తడబడినట్టు కనిపిస్తుంది.

    ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయి. మాటలు ఓకే అనిపిస్తాయి. నిడివి తక్కువ ఉండటం సినిమాకు కలిసి వచ్చే అంశం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

    గణా పాత్రలో విజయ్ కృష్ణ అన్ని రకాలుగా ఓకే అనిపిస్తాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో పర్వాలేదనిపిస్తాడు. యోగిష, తేజులు తెరపై అందంగా కనిపించి పర్వాలేదనిపిస్తారు. విలన్లుగా కనిపించిని మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే, వోడ్కా దాస్ (నాగ మహేష్‌), దాము వంటి పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రభు చేసిన పోలీస్ పాత్ర కూడా అందరినీ మెప్పిస్తుంది. జబర్దస్త్ అప్పారావ్, దొరబాబుల కామెడీ కూడా ఓకే అనిపిస్తుంది.

    రేటింగ్ 2.75