• November 25, 2024

విజయ్ దేవరకొండ ‘రౌడీ వేర్’ బ్రాండ్‌కు “ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్”

విజయ్ దేవరకొండ ‘రౌడీ వేర్’ బ్రాండ్‌కు “ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్”

    స్టార్ హీరో విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ మరో గౌరవాన్ని దక్కించుకుంది. యూత్ లో ఈ బ్రాండ్ కున్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. తాజాగా ఔట్ లుక్ ఇండియా నిర్వహించిన బిజినెస్ అవార్డ్స్ 2024లో ఐకానిక్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ అవార్డ్ రౌడీ వేర్ బ్రాండ్ గెల్చుకుంది. విజయ్ దేవరకొండ తరుపున ఆనంద్ దేవరకొండ ఈ అవార్డ్ ప్రదానోత్సవంలో పాల్గొని బహుమతి స్వీకరించారు.

    ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రౌడీ వేర్ ను ఐకానిక్ బ్రాండ్ గా మార్చిన రౌడీస్ తో పాటు తన రౌడీ వేర్ టీమ్ కు విజయ్ దేవరకొండ థ్యాంక్స్ చెప్పారు. ఇలాగే సక్సెస్ ఫుల్ గౌ రౌడీ వేర్ ను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. స్టైలింగ్, మేకోవర్ లో తనకున్న ప్యాషన్ తో రౌడీ వేర్ బ్రాండ్ ను ఎప్పటికప్పుడు సరికొత్తగా యూత్ కు రీచ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.