• November 17, 2021

LIGER : మైక్ టైసన్ కోసం ప్రత్యేక వంటకాలు.. లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

LIGER : మైక్ టైసన్ కోసం ప్రత్యేక వంటకాలు.. లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

    LIGER ప్రపంచంలో మైక్ టైసన్ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు. ఆయన పంచ్ పవర్ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి మైక్ టైసన్ మొదటిసారిగా ఇండియన్ తెర మీదకు రాబోతోన్నాడు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న లైగర్ సినిమాతో మైక్ టైసన్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోన్నారు. నిన్న వెగాస్‌లో మొదలైన లైగర్ షెడ్యూల్‌లో మైక్ టైసన్ పాల్గొన్నాడు. అయితే ఈ మేరకు చిత్రయూనిట్ ఓ పోస్టర్‌న వదిలింది.

    ఇందులో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ నవ్వుతూ కనిపించారు. ఇక తాజాగా మైక్ టైసన్ కోసం ఏర్పాటు చేసిన లంచ్, అందులో ప్రత్యేక వంటకాల లిస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక్క లంచ్‌లోనే అన్ని రకాల పదార్థాలను ఏర్పాటు చేశారా? అని అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. మైక్ టైసన్ మన భారతీయ వంటకాలను మెచ్చుకున్నాడని, తనకు ఎంతో ఇష్టమైన వంటకాల గురించి అడిగాడట మైక్ టైసన్. మొత్తానికి ఆ మెనూ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.

    గార్లిక్ నాన్, బట్టర్ చికెన్, తందూరి చికెన్, ఫిష్ టిక్కా మసాలా, గోట్ బిర్యానీ అంటూ ఇలా స్పెషల్‌గా లంచ్ ఏర్పాటు చేశారు. ఆలూ గోబీ, పాలక్ పన్నీర్, సమోస, కబాబ్స్‌లను మైక్ టైసన్ స్పెషల్‌గా అడిగాడట. ఇండియన్ వంటకాల మీద మైక్ టైసన్‌కు మంచి పట్టుంది.. అభిరుచి ఉన్నట్టుంది. మొత్తానికి అన్ని వంటకాలను తృప్తిగా ఆరగించాడు. సెట్ అంతా కూడా సందడి సందడిగా మారిందట. మొత్తానికి పూరి జగన్నాథ్ మాత్రం లైగర్‌తో పెద్ద ప్లాన్ వేసేశాడు.

    Leave a Reply