- August 1, 2025
దుమ్ములేపిన విజయ్.. కింగ్డమ్ డే వన్ వసూళ్లు.. ఏ ఏ ఏరియాల్లో ఎంతొచ్చిందంటే?

Kingdom Day 1 Collection విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. కింగ్డమ్ మూవీకి చాలా వరకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. కొన్ని చోట్ల కొంత మంది నెగెటివ్ కామెంట్లు చేసినా, రివ్యూలు ఇచ్చినా వాటి ప్రభావం మాత్రం కలెక్షన్ల మీద పడలేదని అర్థం అవుతోంది. మొదటి రోజు విజయ్ తన సత్తా చాటుకున్నారు. తన స్టామినా ఏంటో కింగ్డమ్ డే వన్ వసూళ్లే చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ ఓపెనింగ్స్ అదిరిపోయాయ్ అని తెలుస్తోంది.
నైజాంలో 4.2 కోట్లు, సీడెడ్‌లో 1.7 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.16 కోట్లు, గుంటూరులో 75 లక్షలు, ఈస్ట్‌లో 74 లక్షలు, కృష్ణాలో 59 లక్షలు, వెస్ట్‌లో 44 లక్షలు, నెల్లూరులో 34 లక్షల షేర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా పది కోట్ల వరకు షేర్ వచ్చిందని సమాచారం. ఇదంతా కూడా జీఎస్టీని కలపకుండా చెబుతున్న లెక్కలే. అలా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కింగ్డమ్ మూవీకి 30 నుంచి 40 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా అర్థం అవుతోంది.