- January 13, 2022
VK Naresh: నా రెండు వందల సినిమాల్లో లేని ఎంట్రీ సీన్ పెట్టాడు : వీకే నరేష్

VK Naresh సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో
నరేష్ మాట్లాడుతూ.. ‘రాజమండ్రి నుంచి ఇక్కడకు వచ్చాను. అక్కడ పండుగ వాతావరణం ఉంది. సినిమాలు ఎప్పటికీ ఉంటాయి. మంచి సినిమాలు ఎప్పటికీ నిలబడతాయి. భారతదేశానికి అమరరాజా ఓ ఆణిముత్యంలాంటిది. ఈనాడు అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉంది. శమంతక మణి సినిమా నుంచి ఆదిత్యను ఫాలో అవుతున్నాను. ఆయనతో నాకు ఇది రెండో సినిమా.
నేను సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను. మీరు సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో ఆయన ప్రాణం పెట్టేశాడు. క్లైమాక్స్ అనేది ఇంటర్వెల్ దగ్గరి నుంచి స్టార్ట్ అవుతుంది. అశోక్‌ని చిన్నతనం నుంచి చూస్తున్నాను. అతని జీన్స్‌లోనే నటన ఉంది. అతని హార్డ్ వర్క్‌లోనే ఉంది. సినిమా పట్ల ప్యాషన్ ఉంది. మొదటి రోజు నుంచి చూశాను. అద్భుతంగా నటించాడు. సినిమా, అశోక్.. పాలు నీళ్లలా అనేకంటే బకాడీ బ్రీజర్‌లా కలిసిపోయారు.
ఇలాంటి ఎంట్రీ సినిమా కొందరికే దక్కుతుంది. కంగ్రాట్స్ అశోక్. నిధి అగర్వాల్ బ్యూటీ విత్ బ్రెయిన్. అద్భుతంగా నటించింది. సీన్స్‌తో శ్రీరామ్ నన్ను భయపెట్టాడు. నా రెండు వందల సినిమాల్లో లేని ఎంట్రీ సీన్ పెట్టాడు. జగపతి బాబు సర్ ప్రైజ్ ఎలిమెంట్. అది మాత్రం చెప్పను. ఇది పక్కా సంక్రాంతి ఎంటర్టైనర్. కోడిపందెలు, హీరోలు ఈ రెండే ఈ సంక్రాంతి. నేను చెప్పిందాంట్లో దాదాపు 70 శాతం నిజమవుతుంది. సంక్రాంతి సినిమా హీరో’ అని అన్నారు.