• November 23, 2021

ఇంట్లోంచి అమ్మను గెంటేశారు!.. కార్తీకదీపం మోనిత కన్నీటిగాథ

ఇంట్లోంచి అమ్మను గెంటేశారు!.. కార్తీకదీపం మోనిత కన్నీటిగాథ

    కార్తీకదీపం సీరియల్‌తో మోనిత ఫుల్ పాపులర్ అయింది. కన్నడ నటి అయినా కూడా తెలుగు బాగానే నేర్చుకుంది. వంటలక్క ప్రేమి విశ్వనాథ్ కంటే మోనితనే తెలుగు ఎక్కువగా, అందంగా మాట్లాడుతుంది. మోనిత మంచితనానికి అందరూ ఫిదా అవుతుంటారు. కార్తీకదీపం సీరియల్‌లో విలన్‌గా నటించి జనాల్లో తన మీద కోపాన్ని, ద్వేషాన్ని కలిగించింది. అలా అంతలా తన నటనతో శోభా శెట్టి ప్రేక్షకుల్లో ముద్ర వేసింది. అయితే మోనిత మాత్రం ఆఫ్ స్క్రీన్‌లో పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది.

    మోనిత తెరపై మాత్రమే విలన్. తెర వెనకాల రియల్ హీరో లాంటిది. ఎంతో మంది అనాథాలకు సాయం చేస్తుంది. అనాథాశ్రమాలకు సాయం చేస్తుంటుంది. పండుగలు వారితోనే జరుపుకుంటుంది. చేతనైన సాయాన్ని చేస్తుంటుంది. తన యూట్యూబ్ చానెల్‌లో ఎన్నో విషయాలను చెబుతుంది. తాను చేస్తోన్న మంచి పనుల గురించి పది మందికి చెప్పి.. అందరిలోనూ అలాంటి ఆలోచనలు, రావాలి స్ఫూర్తిపొందేట్టు చేస్తోంది.

    అయితే తాజాగా శోభా శెట్టి జీ తెలుగులో కనిపించబోతోంది. జీ తెలుగులో కొత్త షో ప్రారంభం కాబోతోంది. సూపర్ క్వీన్ అంటూ రాబోతోన్న ఈ షోలో పది మంది తారలు కనిపించబోతోన్నారు. ఇందులో మోనిత కూడా కంటెస్టెంట్ చేస్తోంది. చివరకు గెలిచిన వాళ్లకు పది లక్షలు ఇస్తారట. ఈ ఆదివారం ఈ షో ప్రారంభం కాబోతోంది.

    ఈ క్రమంలో వదిలిన ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో ఒక్కొక్కరు తమ తమ జీవితాల్లో అనుభవించిన బాధల గురించి తెలిపారు. శోభా శెట్టి మాట్లాడుతూ.. అప్పటికే మా అమ్మకు ఇద్దరమ్మాయిలున్నారు, మా అన్నయ్య కూడా పుట్టాడు. నేను ఇరవై రోజులు పసికందును.. అయినా కూడా మా ఇంట్లో ఉండొద్దు అని గెంటేశారు అంటూ తన అమ్మ పడ్డ కష్టాల గురించి మోనిత చెబుతూ ఎమోషనల్ అయింది.

    Leave a Reply