• December 9, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. వంటలక్కకు కొత్త సమస్య.. రుద్రాణి ఎంట్రీతో కథ యూటర్న్

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. వంటలక్కకు కొత్త సమస్య.. రుద్రాణి ఎంట్రీతో కథ యూటర్న్

    karthika deepam serial today Episode కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే.. గురువారం నాటి ధారావాహిక అంటే.. Karthika Deepam Episode 1218 లో కొత్త కారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. తాడికొండ గ్రామానికి దీప, కార్తీక్ వచ్చారు. ఆ ఊర్లో రుద్రాణి అంటే అందరికీ వణుకు. ఇళ్లు ఖాళీగా ఉందని అందులో దిగేసింది దీప. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ మాత్రం ఓ కొత్త మలుపు తిరిగేలా కనిపిస్తోంది. కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

    దీప పక్కన ఉన్నంత కాలం కార్తీక్ ఓడిపోడు.. దీప గెలిపిస్తుందని ఆనంద్ రావు ఎమోషనల్ అవుతాడు. ఇక శౌర్య, హిమలు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నాం..ఎందుకు వెళ్తున్నాం.. ఫోన్స్ ఎందుకు లేవు.. అని శౌర్య వాగుతూనే ఉంటుంది. ఇక దీప వాటికి సమాధానం చెబుతుంది. మనం ప్రశాంతంగా ఉండాలని ఫోన్స్ కూడా తీసుకుని రాలేదు.. నా దగ్గర మాత్రమే ఉంది.. అది కూడా కొత్త నంబర్.. ఇక్కడ మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూదని ఫోన్స్ తీసుకురాలేదని దీప అంటుంది.

    మరి ఇలా ఎందుకు నడుస్తున్నాం.. కారులో వెళ్లొచ్చు కదా? అని హిమ అంటుంది. కాళ్లు నొప్పులు పుడుతున్నాయా? ఎత్తుకోవాలా? హిమ అని కార్తీక్ ధీనంగా అడిగేస్తాడు. వద్దండి.. పిల్లలకు కష్టాలేంటో తెలియాలి.. ఇప్పటికే మీరు చాలా గారాభం చేశారు.. అని దీప అంటుంది. మేం నడుస్తాం అమ్మా.. అక్కడ రిస్టార్ట్ అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. స్విమ్మింగ్ పూల్ ఉండాలి అంటూ ఇలా హిమ తన కోరికల చిట్టా విప్పుతుంది.

    అక్కడ సీన్ కట్ చేస్తే.. సౌందర్య, ఆనంద్ రావు, శ్రావ్య, ఆదిత్యల మీద ఓపెన్ అవుతుంది. ఇలా తినకుండా ఉంటే ఎలా..అసలే మీ ఆరోగ్యం బాగా లేదు అంటూ టిఫిన్ తీసుకొచ్చి అత్తమామల ముందు పెడుతుంది శ్రావ్య. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అని శ్రావ్యపై ఆదిత్య ఫైర్ అవుతాడు. మనమంటే ఓర్చుకుంటాం.. అత్తయ్య మామయ్యలు తినకుండా ఉంటే ఎలా? అని శ్రావ్య అంటుంది.

    మమ్మీ నేను కనుక్కుంటాను.. నా ఫ్రెండ్స్, పోలీస్ వాళ్లకు చెప్పాను.. సెల్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేయోచ్చట అని ఆదిత్య అంటే.. బావగారికి ఆ మాత్రం తెలీదా? అని శ్రావ్య బధులిస్తుంది.. నా ఫ్రెండ్స్ అంతా వెదుకుతున్నారు అని ఆదిత్య అంటాడు.. ఇక ఇంతలో మోనిత ఎంట్రీ ఇస్తుంది. నమస్తే.. అయ్యయ్యో కుడికాలు పెట్టాలి కదా? అని ఎంట్రీ ఇస్తుంది.

    మీ డాడీకి ఐ లవ్యూ చెప్పి సరిగ్గా 18 ఏళ్లు అయింది.. కాలం కరిగింది.. ప్రేమ పెరిగింది.. నా ప్రేమకు అలుపు లేదు.. కొందరు గిట్టని వాళ్లు బలుపు అని అనుకుంటారు.. నువ్వు, నేను, మీ నాన్న.. మీ నాన్నే అని మీ నాన్నతో అనిపించాలంటే తప్పదు కదా?.. అని తన బిడ్డ ఆనంద్ రావుతో మోనిత చెబుతుంది. కార్తీక్ కార్తీక్ అంటూ ఇళ్లంతా వెతుకుంది మోనిత.

    నమస్తే మామయ్య గారు, అత్తయ్య గారు.. హాయ్ ఆదిత్య, శ్రావ్య.. చూశావా? అందరూ ఉన్నారు,.. పెద్దమ్మ లోపల ఉంది.. ఇలా ఉరిమి చూస్తుంది తెలుసా? మీ నాన్న లోపల ఉన్నాడు అంటూ తన బిడ్డతో మాట్లాడుకుంటూ మోనిత మురిసిపోయింది.. ఇక్కడ బావగారు లేడు అని శ్రావ్య అసలు నిజం చెబుతుంది.. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లాడు శ్రావ్య.. హాస్పిటల్‌కా? బయటకా? అని మోనిత అడుగుతంది.

    నీ పుణ్యమా అంటూ ఇంట్లోంచి వెళ్లిపోయాడు.. కార్తీక్ కార్తీక్ అంటూ మా ఇంటి పరువుతీశావ్ కదా? మాకు మొహం చూపించుకోలేక ఇంట్లోంచి వెళ్లిపోయాడు అని ఆదిత్య అసలు నిజం చెబుతాడు. వెళ్లిపోయాడా? ఈ ఐడియా బాగుంది.. నీదేనా? ఆదిత్య అని మోనిత కౌంటర్లు వేస్తుంది.. నోటికొచ్చినట్టు వాగితే బాగుండదు అని ఆదిత్య ఫైర్ అవుతాడు..

    అప్పుడు అమెరికా అన్నారు.. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లాడంటే అస్సలు నమ్మను.. నెవ్వర్.. ఈ మోనిత చాలా ముదురు.. అని మోనిత అంటే.. ఆదిత్య చిర్రెత్తుతుంది. గెటవుట్ అని అరిచేస్తాడు. దీంతో సౌందర్య స్టార్ట్ చేస్తుంది. నీకు దండంపెడతాను మోనిత.. ఇప్పటికే చాలా బాధలో ఉన్నాం.. వెళ్లిపో అని అంటుంది.. వీళ్లంతా ఇలా ఏడుస్తున్నారంటే బాగా నటిస్తున్నారా? లేదంటే నిజంగానే వెళ్లిపోయాడా? వెళ్లి ఉండొచ్చు అని మోనిత లోలోపల అనుకుంటుంది.

    ఏంటమ్మ ఇది.. కార్తీక్ ఎక్కడికి వెళ్లాలో తెలియక మేం బాధపడుతుంటే.. ఇలాంటి సమయంలో ఏంటమ్మ అని ఆనంద్ రావు ధీనంగా అడుగుతాడు.. మామయ్య గారు ఒకటి చెప్పాలా? మీది కడుపు కోత.. నాది గుండెకోత.. పద్దెనిమిదేళ్లుగా ఏడుస్తూనే ఉన్నాను.. నా బిడ్డ సంగతి ఏంటి? అని మోనిత అంటుంది. నీ బాధ ఏంటి.. నీకు అసలు బుద్ది ఉందా? ఇలాంటి సమయంలో నీ గోలేంటి.. గెటవుట్.. అని మోనిత మీదకు అరిచేస్తాడు ఆదిత్య. ప్లీజ్ ఆదిత్య ఆగు అని సౌందర్య మాట్లాడుతూ.. నీతో మాట్లాడే ఓపిక మాకు లేదు.. ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు.. ఆదిత్య కోపం గురించి నీకు బాగా తెలుసు.. వాడు కోపంలో ఏం చేసినా తరువాత బాధపడకు.. వెళ్లిపో అని సౌందర్య అంటుంది.

    నాకు ఈ ఇంటికి సంబంధం లేదా?.. ఈ బిడ్డతో దోష నివారణ పూజ చేయించారు కదా? అప్పుడు మనవడు అన్నారు కదా?.. ప్రేమ కురుక్షేత్రం చేస్తున్నాను.. నేను ఎప్పటికైనా గెలిచి తీరుతాను.. ఒక మాట అంటే.. ఆ మాట మీదే ఉండాలి అత్తయ్య గారు.. అప్పుడు మీరే మనవడు అంటారు.. ఇప్పుడు కాదంటారు.. సరే నేనే నిజమేంటో కనుక్కుంటాను.. అందరికీ బాయ్ చెప్పండి ఆనంద్ రావు గారు.. అని మోనిత అంతా గందరగోళం సృష్టించి వెళ్లిపోతుంది.

    ఎక్కడున్నావ్.. ఏం చేస్తున్నావ్.. ఏం తింటున్నావ్ రా అని ఆనంద్ రావు తన కొడుకు కార్తీక్‌ను తలుచుకుంటాడు. ఇక పిల్లలు రకరకాల ప్రశ్నలు సంధిస్తుంటే.. వద్దని చెబుతుంది దీప.. నాన్నను డిస్టర్బ్ చేయకండి అని చెబుతుంది.. నిన్ను ఏం అడగం లే.. నువ్ ఇలా డల్‌గా ఉండకు.. అందరం కలిసి ఉంటే చాలు.. అని కార్తీక్‌తో హిమ, శౌర్య అంటారు.

    ఎవరు మీరు.. ఈ ఊళ్లో ఎప్పుడూ చూడలేదు.. అని ఓ మహిళ అంటుంది. నా పేరు దీప అని మన వంటలక్క చెబితే.. నా పేరు శ్యామల అని ఆ మహిళ చెబుతుంది.. ఏదైనా పని దొరుకుతుందేమోనని వచ్చామని దీప అంటే.. ఏ పని దొరుకుతుంది.. పని సంగతి దేవుడెరుగు.. ఆ ఇళ్లు ఎవరిదో తెలుసా? అని శ్యామల భయపెడుతుంది. ఎవరండావిడ.. అని దీప అంటుంది. రుద్రాణి.. ఊళ్లో ఆవిడ పేరు చెబితే అందరూ భయపడతారు.. ఆమె చేసే పనులు కూడా అలానే ఉంటాయి.. అని శ్యామల అంటుంది. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు.. ఖాళీగా ఉంది కదా?? అని దీప అంటే.. ఖాళీగా ఉందని కత్తితో చేయి కోసుకుంటామా?.. ఇవన్నీ మీకు చెప్పానని తెలిస్తే నేను ఏమైపోతానో.. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెబుతుంది.

    దీప, శ్యామల మాట్లాడుకోవడం చూసిన కార్తీక్ ‘ఏమంటోంది’ అని అడుగుతాడు… కొత్తగా కనిపించాం కదా? అడుగుతోంది అని దీప అంటే.. సీరియస్‌గా ఏదో చెబుతోంది అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. అదేం లేదండని దీప అంటుంది.. మనం ఈ ఇంటిని శుభ్రం చేద్దాం.. ఎవరు ఎక్కువగా పనులు, తక్కువగా ప్రశ్నలు వేస్తారో వారికి బహుమతులు ఇస్తాను.. మీ డాడీ సీక్రెట్ మార్కులు వేస్తాడు అని పిల్లలతో పని చేయించే ప్రోగ్రాం పెట్టింది దీప. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఏకంగా రుద్రాణి దగ్గరకే వెళ్లుంది దీప. ఏదైనా పని ఉంటే ఇస్తారా? అని అడుగుతుంది. నీకు నా గురించి తెలిసే వచ్చావా? ఎవ్వరూ నీకు చెప్పలేదా? అని రుద్రాణి భయపెట్టే ప్రయత్నం చేసింది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply