• October 27, 2021

Karthika Deepam: మొత్తానికి అనుకున్నట్టే షాక్ ఇచ్చింది.. మోనిత కొత్త నాటకం

Karthika Deepam: మొత్తానికి అనుకున్నట్టే షాక్ ఇచ్చింది.. మోనిత కొత్త నాటకం

    Karthika Deepam కార్తీకదీపం సీరియల్ ఇంకా ఎన్ని రకాల మలుపులు తిరుగుతుందో తెలియడం లేదు. ఒకప్పుడు సీరియల్ కార్తీక్ దీపల మద్య ఉండేది.. ఆ తరువాత కార్తీక్, దీప, మోనితల మధ్య తిరిగింది. ఆ తరువాత హిమ, శౌర్యల చుట్టూ కొన్నాళ్లు తిరిగింది. ఇక ఇప్పుడు మోనిత గర్భం చుట్టూ, పుట్టబోయే బిడ్డ చుట్టూ తిరుగుతోంది.

    ఇన్ని రోజులు అది కృత్రిమ గర్భం అని అందరినీ నమ్మించింది. కానీ నేటి ఎపిసోడ్‌లో మాత్రం అసలు గుట్టు బయటపెట్టేసింది. పురిటినొప్పులు వస్తున్నట్టుగా యాక్టింగ్ చేసి ఆపరేషన్ బెడ్డు మీదున్న మోనిత.. కార్తీక్ వచ్చే వరకు కూడా ఆపరేషన్ చేసుకోనని మొండి పట్టు పట్టుకుని కూర్చింది. చచ్చేలోపు ఆ నిజం చెప్పి చచ్చిపోతాను అని అంటుంది.

    అది కృత్రిమ గర్భం కాదు.. ఒక రోజు రాత్రి నువ్ తాగి ఉన్నావ్ అంటూ ఏదో చెప్పబోయింది.. ఆపు ఆ ఛండాలం అంటూ కార్తీక్ ఉడికిపోయాడు. చచ్చేముందు ఇలా ఎందుకు అబద్దం చెబుతాను..మన ప్రేమ మీద ఒట్టేసి చెబుతున్నా.. అది మన బిడ్డే.. మన రక్తం పంచుకుని పుట్టేవాడు.. నేను చచ్చిపోతే పుట్టేవాళ్లను అనాథలుగా వదలకు అంటూ ప్రాథేయపడుతుంది. అయితే ఇదంతా ఒక వైపు జరుగుతుంటే.. దీప మాత్రం అసలు కథ ఏంటని పరిశోధించేందుకు కార్తీక్ శాంపిల్స్ ఇచ్చిన హాస్పిటల్‌కు వెళ్తుంది. కానీ అక్కడ దీపకు చుక్కెదురు అవుతుంది.

    ఇక అసలు ట్విస్ట్ రేపు రాబోతోన్నట్టు కనిపిస్తోంది. సౌందర్య ఒత్తిడితో ఆపరేషన్ కోసం భర్తగా కార్తీక్ సంతకం పెట్టేశాడట. పండంటి బిడ్డ పుట్టేశాడట. ఈ విషయాలన్నీ కూడాప్రియమణి.. దీపకు చెబుతుంది. దీంతో ఒక్కసారిగా దీప కుంగిపోతోంది. గుడికి అని అబద్దం చెప్పి హాస్పిటల్‌కు వెళ్తారా? అని దీప కుమిలిపోతోంది. ఇక రేపు ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply