- February 10, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. బిడ్డ గురించి నిజం తెలుస్తుందా? కార్తీక్ పోలికలున్నాయనడంతో అంతా షాక్

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 10న గురువారం ప్రసారం కానున్న Karthika Deepam Episode 1272 ధారావాహికలో ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. సౌందర్య కంటతడి పెట్టేసింది. మొత్తానికి హైద్రాబాద్ వెళ్లేందుకు కార్తీక్ ఒప్పుకున్నాడు. ఇక మరో వైపు మోనిత తెగ బాధపడుతూ ఉంది. ఇంకో వైపు చేసిన తప్పుకు రుద్రాణి పశ్చాత్తాపడింది.
నువ్వొక గొప్ప డాక్టర్‌వి.. అని సౌందర్య అంటుంది. ఒకప్పుడు అది, ఇప్పుడు కాదు.. అని కార్తీక్ అంటాడు. నువ్ డాక్టర్ కాక ముందు కూడా నా కొడుకువే.. మొన్న కలిసిన బిడ్డ మీదే మీకు అంత అబిమానం ఉంటే.. కన్నకొడుకువి నాకెంత ప్రేమ ఉంటుందో ఊహించలేవా? హిమను కనిపించలేదంటే.. మీకు అంత ఉంటే.. ఇన్ని రోజులు మీరెక్కడున్నారో తెలియక మేం ఎంత నరకం చూసి ఉంటామో మీకు తెలుసా? మీరు మాట్లాడకపోతే, రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నావా? మీకే అంత పట్టుదల ఉంటే మీ అమ్మను నాకు ఎంత పట్టుదల ఉంటుంది.. చెప్పకుండా వెళ్లిపోవడం, ఫోన్లు పడేయడం మేం కూడా చేయగలడం.. మీరు హైద్రాబాద్ రాకపోతే మేం వెళ్లిపోతాం.. అవసరమైతే ఇద్దరం కలిసి..అని సౌందర్య అనబోతోంటే కార్తీక్ ఆపేస్తాడు. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దు మమ్మీ.. అని కార్తీక్ అంటాడు. నువ్ కూడా ఇంకోసారి ఇలా దూరం అవ్వొద్దు.. మనం అంతా కూడా హైద్రాబాద్‌కు వెళ్తున్నామా? లేదా? అని సౌందర్య అడుగుతుంది. సరే నీ ఇష్టం మమ్మీ.. అని కార్తీక్ అంటాడు.
ఏంటి భారతి.. ఎంత ఆశగా వచ్చాను.. కార్తీక్ కనిపిస్తాడని అనుకున్నా.. ఈ హోటల్లో ఉండటం ఏంటో.. నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో.. అని మోనిత బాధపడుతుంటే.. ఇవేం పట్టించుకోకుండా భారతి బుక్కు చదువుకుంటూ ఉంటుంది. ఆ బుక్కును మోనిత విసిరి కొట్టేస్తుంది. దీంతో ఏంటి మోనిత అని భారతి అరిచేస్తుంది.. అదే నేనడుగుతున్నా.. నా బాధ చెబుతుంటే.. నువ్వేంటి బుక్స్ చదువుకుంటూ ఉన్నావ్ అని మోనిత అంటుంది.
నీవి కష్టాలు కానే కావు..కోరి తెచ్చుకున్నవి.. అని అంటుంది. నీ సానుభూతి అవసరం లేదు.. కాస్త ధైర్యం చెప్పు అని మోనిత అంటుంది.. నీ తప్పొప్పులు పక్కన పెట్టేసి ఎన్నో సార్లు సాయం చేశాను.. అని భారతి అంటుంది. ఇకపై సాయం చేయనని అంటావా? నా కార్తీక్ నాకు ఎలాగూ దొరుకుతాడు.. నా బాబును పట్టించుకోవడం లేదు.. ఎక్కడున్నాడో ఏమో అని మోనిత బాధపడుతుంది. బిడ్డను దూరం చేసుకున్న బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. నువ్ మొండిదానివి కాబట్టి భరిస్తున్నావ్..అని భారతి అంటుంది.
హిమ.. ఏమైంది..ఏడ్వకు హిమ..అని శౌర్య అంటుంది. నానమ్మ రాకపోయి ఉంటే.. నేను ఇంట్లోకి వచ్చి ఉండేదాన్ని కాదు.. అని హిమ అంటుంది. నానమ్మ వచ్చింది కదా? అప్పు తీర్చేసింది కదా? ఏడ్వకు నీకు జ్వరం వస్తుంది.. అని శౌర్య అంటుంది. నన్ను వేరే ఊరికి తీసుకెళ్తానని అన్నారు.. మళ్లీ మిమ్మల్ని చూడనేమోనని అనుకున్నా.. అని హిమ చెబుతూ ఏడుస్తుంటుంది.
నానమ్మ వచ్చింది కదా?. నేను కూడా నీకోసం ఏడ్చాను.. మనం హైద్రాబాద్ వెళ్తున్నాం కదా? అని శౌర్య అంటుంది. మనం నిజంగానే హైద్రాబాద్‌కు వెళ్తున్నామా? అని హిమ అంటుంది.. నాన్న మాటిచ్చాడు కదా? వెళ్తున్నాం అని శౌర్య అంటుంది. అయితే మనం మన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటాం.. దీపు, ఆనంద్ ఒకే చోట ఉంటారు.. అని హిమ అంటుంది. ఇకపై నానమ్మ మాట విందాం.. అని శౌర్య అంటే అమ్మానాన్నలమాట వినొద్దా అని హిమ అడుగుతుంది.. ఏదైనా నానమ్మకు చెప్పిన తరువాత చేద్దామని శౌర్య అంటే.. వాళ్లకు చెబితే మనకు కష్టాలుండవ్..అని హిమ అంటుంది. మళ్లీ మనం ఎప్పుడు ఆడుకుందాం.. అని శౌర్యను హిమ అడుగుతుంది.
మీరు కనిపించకపోతే.. ఇలా వస్తువులు చూసుకుంటూ ఏడ్చేదాన్ని.. ఈ బిడ్డల్ని చూడకుండా ఇలా ఇన్ని రోజులు ఎలా ఉన్నానో ఆ ఈశ్వరుడికే తెలియాలి.. ఏమ్మా దీప.. నువ్వైనా ఒక్కసారైనా పెద్దోడికి చెప్పాలి కదా? అయ్యో అత్తయ్య మామయ్యలకైనా చెప్పాలి కదా? బాగున్నామని ఫోన్‌లో ఒక్క మాట చెప్పినా బాగుండేది కదా?. ఈ బుక్స్ అన్నీ కూడా బ్యాగులో పెట్టేసుకో అని సౌందర్య అంటుంది.
ఈ పర్స్ ఎవరిది.. అని హిమ అడుగుతుంది. ఈ పర్స్ మీ నాన్నది.. ఇందులో మీ అమ్మానాన్నల ఫోటో ఉంటుంది.. మేం ఏం తప్పు చేశాం.. ఎందుకువదిలి వెళ్లారని అడిగేదాన్ని అంటూ ఆ ఫోటోలను చూపించింది.. డాడీ ఒకసారి నీ పర్స్ ఇవ్వు.. ఇన్ని డబ్బులు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు.. అని పిల్లలు అంటాడ. ఇదంతా తన సంపాదన.. పర్స్ ఇంట్లోమరిచిపోయి వచ్చారు.. మీరు ఎంత శ్రీమంతులో పిల్లలు కూడా మరిచిపోయారు..అని సౌందర్య అంటుంది.ఇవి ఎన్ని ఉన్నాయో లెక్కపెడతాం.. అని పిల్లలు వెళ్లిపోతారు.
అవన్నీ నీ డబ్బులే.. వెళ్లి దీప బంగారాన్ని విడిపించుకునిరా.. నా కోడలి బంగారం తాకట్టు కొట్లో ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది.. అని సౌందర్య అంటుంది. ఆ డబ్బుతో తీసుకురావాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది అని కార్తీక్ అంటాడు.. అవి నీ డబ్బులేరా.. గర్వంగా ఖర్చు పెట్టుకో.. ఆశ్రమంలోకి వచ్చాక నీ గురించి మాట్లాడుకుంటూ.. నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమోనని అనుకున్నాంరా అని సౌందర్య అంటే.. ఆశ్రమంలో ఓ సారి మిమ్మల్ని చూశామని కార్తీక్, దీపలు చెబుతారు.. డాడీ చాలా ఉన్నాయ్..అంటూ పిల్లలు డబ్బులు లెక్కపెట్టి వస్తారు.
పదే పది రోజుల్లో కనిపెడతాను అంటూ చేసిన చాలెంజ్‌ను మోనిత గుర్తు చేసుకుంది.. కార్తీక్, ఆనంద్ ఎక్కడున్నారో తెలియడం లేదు అని మోనిత అనుకుంటుంది. ఇంతలో భారతి తన భర్త రవితో మాట్లాడుతుంటుంది.. రవి వచ్చేస్తున్నా.. అనుకోకుండా ఆగిపోయాను.. అంటూ చెబుతుంది. భారతి నా వల్ల నువ్ ఇబ్బంది పడుతున్నావ్ కదా?..అని అంటుంది. అలా మొత్తానికి అక్కడి నుంచి వెళ్లేందుకు మోనిత రెడీ అవుతుంది.
చిత్రంగా మీ సంపాదనతోనే వీటిని విడిపించారా? అని తన తాళిని మెడలో వేసుకుంటుంది దీప..మీరు అత్తయ్య వాళ్లు ఎంత మంచి వాళ్లు అని దీప అనుకుంటుంది.. నేనే నిన్ను ఎన్నో కష్టాలపాలు చేశాన్.. మంచితనం అంటే నీది.. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం.. అని కార్తీక్ అంటాడు. ఇక అందరూ హైద్రాబాద్‌కు వెళ్లేందుకు రెడీ అవుతుంటారు. ఇంతలో రుద్రాణి వస్తుంది.
ఎక్కడికో బయల్దేరినట్టున్నారు.. అని రుద్రాణి అడుగుతుంది. మేం హైద్రాబాద్‌కు వెళ్తున్నాం.. మీకు ఇవ్వాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? అని దీప అడుగుతుంది. చెక్కు రాసి వెళ్లిపోతే ఎలా.. ఈ చెక్కు నాకొద్దు మేడం.. నన్ను క్షమించండి సారు.. సారు ఏంటి.. నన్ను క్షమించండి డాక్టర్ గారు.. మీ గురించి తెలియక చాలా ఇబ్బంది పెట్టాను.. దీపమ్మ నన్ను మన్నించమ్మా.. పిల్లలంటే ఇస్టం.. డబ్బు అధికారం.. అహంకారంతో మిమ్మల్ని ఎన్నో కష్టాలు.. ఈ మేడం మీ గురించి చెబుతుంటేబుర్ర తిరిగిపోయింది.. అని రుద్రాణి అంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో హైద్రాబాద్‌కు అందరూ వెళ్తుంటారు. ఆ బిడ్డ కోసం ఫంక్షన్ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది. తమ్ముడు అచ్చం నాన్నలానే ఉన్నాడు కదా? అని హిమ అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇక మున్ముందు మరేం జరుగుతుందో చూడాలి.