• February 9, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. బతిమిలాడిన సౌందర్య.. మోనిత శ్రమ వృథా

Karthika Deepam నేటి ఎపిసోడ్.. బతిమిలాడిన సౌందర్య.. మోనిత శ్రమ వృథా

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 9న బుధవారం నాటి Karthika Deepam Episode 1271 ధారావాహికలో అదిరిపోయే సీన్లు పడ్డాయి. రుద్రాణి పరువుతీసేసింది సౌందర్య. పది లక్షల చెక్కు రాసి మొహాన పారేసింది. ఇక మరో వైపు కార్తీక్ కోసం వెతికిన మోనితకు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తానికి నేటి ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా సాగింది.

    రుద్రాణి చెంపచెల్లుమనిపించేసిన సౌందర్య.. కార్తీక్ గొప్పదనాన్ని చెప్పింది. నీ అప్పు ఎంతే.. నా కొడుకు ఒక్క రోజు సంపాదన నీ ఏడాది అంత సంపాదన అవుతుంది. మా ఇంటి ముందుండే కార్లంతా విలువ ఉండదు నీ బతుకు.. పది లక్షలకు ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? తీసుకో అని పది లక్షల చెక్కు రాసిస్తుంది. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది.

    ఇంతలో ఏడుస్తూ హిమ వస్తుంది. బాగా ఏడుస్తుందని ఇక్కడకు తీసుకొచ్చాను అక్కా అని పిల్లగడ్డం గాడు అంటాడు. మనం ఇక్కడి నుంచి వెళ్దాం నాన్నమ్మ.. అని హిమ ఏడుస్తుంది.. వెళ్దాం అని సౌందర్య అంటుంది. అలా అక్కడి నుంచి ఆ నలుగురు వెళ్తారు. మరో వైపు తాడికొండలోకి మోనిత, భారతి ఎంట్రీలు ఇస్తారు. ఈ ఊరికి ఇంతకు ముందు వచ్చాను అని మోనిత అంటుంది.

    ఆంటీ వాళ్లు వైద్యం కోసం వచ్చారు నేను వారిని ఫాలో అవుతూ వచ్చాను అని చెబుతుంది మోనిత. వారిని ఇక్కడకు పంపించింది నేనే అని భారతి అంటుంది. ఇప్పుడేంటి ఈ బోర్డును ఫోటో తీసుకుని పూజ చేస్తావా? అని అంటుంది. ఇక సీన్ శౌర్య మీద ఓపెన్ అవుతుంది. నాన్న దగ్గర డబ్బుల్లేవ్.. హిమ ఎలా వస్తుంది అని శౌర్య బాధపడుతుంటుంది.

    ఇంతలో హిమ వస్తుంది. డబ్బులు ఎవరు కట్టారని శౌర్య అంటే.. నానమ్మను చూపిస్తుంది హిమ. నానమ్మ.. అని శౌర్య.. శౌర్య అంటూ సౌందర్య ఎమోషనల్ అవుతారు. ఎలా ఉన్నావే..ఈ నానమ్మను మరిచిపోయావా?.. అని అంటుంది సౌందర్య. నానమ్మే డబ్బులు కట్టింది..అని హిమ చెబుతుంది. పాలు కూడా తాగనంది దీప అని విజయ లక్షమీ చెబుతుంది.

    ఎవరో తెలుసా? మా నానమ్మ.. అని విజయ లక్ష్మీకి చూపిస్తుంది శౌర్య. ఆరోగ్యం బాగా లేదు అని శౌర్య గురించి హిమ చెబుతంది. దీంతో వద్దని హిమను వారిస్తాడు కార్తీక్. ఏమైందే అని సౌందర్య అడుగుతుంది. నానమ్మ మరేమో.. అని చెప్పబోతోంది.. కానీ ఇంతలో కార్తీక్ కలగజేసుకుని చిన్న ప్రాబ్లమే.. దానికేం కాలేదు.. ఏదో కడుపు నొప్పి చిన్న సమస్యే.. అంతే.. వివరాలు తరువాత చెబుతాను.. అని అంటాడు.

    పాలు తాగట్లేదా?. ఎలా తాగదో నేను చూస్తాను అని శౌర్యకు పాలు తాగిస్తుంది సౌందర్య. ఇక జరిగిన ఘటనలను సౌందర్యకు కార్తీక్ వివరిస్తాడు. అలా ఈ వీడు మా దగ్గరకు వచ్చాడని చెబుతారు. వీడి పేరెంటో తెలుసా? ఆనంద్.. అనిఅనుకోకుండా పేరు పెట్టారు.. అని శౌర్య చెబుతుంది. ఇలాంటి ఇంట్లోనా?. ఏంట్రా ఈ కర్మ.. అన్నీ వదిలేసి ఇలా రావడం ఏంటి.. అని సౌందర్య అడుగుతుంది. ఆయన్ను ఏం అనకండి..అని దీప అంటుంది. చెవులు బోసిగా ఉంది.. మెడలో ఏం లేదే.. అని అడుగుతుంది.

    ఇక మరో వైపు తాడికొండ మొత్తాన్ని మోనిత వెతుకుతుంది. కానీ కార్తీక్ కనిపించడు. నా ప్రేమ నాకు ఇలా పరీక్ష పెడుతుంది ఏంటి.. అయినా ఈ మాత్రం పరీక్ష పెట్టకుండా ఉంటే నా కార్తీక్, ప్రేమకు విలువేం ఉంటుంది..అని మోనిత అంటుంది. అన్నీ నువ్వే చెప్పుకో ప్రశ్న, సమాధానాలు నీ దగ్గరే ఉంటాయి అని భారతి అంటుంది.. నాకు నేనే సమాధానాం చెప్పుకుంటూ ధైర్యంగా ఉంటున్నాను.. ఆంటీ వాళ్లు కూడా లేరట.. వాళ్లున్నా కూడా ఏదో ఒక పరిష్కారం దొరికేది.. అని మోనిత అనుకుంటుంది.

    పెద్దోడా మన ఇంటికి వెళ్దాం.. అని సౌందర్య అడుగుతుంది. నేను రాలేను మమ్మీ.. అని సమాధానం చెబుతాడు కార్తీక్. రాలేవా? ఏం సాధించావ్ రా ఇక్కడకు వచ్చి.. నువ్ బాధపడుతున్నావ్.. దీపనీ బాధపెడతున్నావ్.. అభం శుభం తెలియని పిల్లల్నీ ఇబ్బంది పెడుతున్నావ్.. ఇక్కడ నువ్ అక్కడ మమ్మల్ని బాధపెడుతున్నావ్.. ఏమైనా మాట్లాడే దీప.. వాడేం చేసినా ఎదురు చెప్పనని అంటున్నావ్.. నీ పతి ధర్మం బాగానే పాటిస్తున్నావ్.. నా తల్లి మనసేంటి..

    అక్కడం మేం ఇంట్లో ఉండలేక భోజనం చేస్తుంటే.. అన్నం ముద్ద చూస్తుంటే.. వాళ్లు ఎలా ఉన్నారో.. తిన్నారో లేదో అని కన్నీరు పెట్టుకున్నాం.. రేయ్ పెద్దోడా.. ఆరోగ్యం పాడు చేసుకుంటే.. ఆయన్ను ఓదార్చలేక.. మీ జాడ తెలియక.. మేమంతా ఎంత కుమిలిపోయామో తెలుసా? అరే.. మమ్మీడాడీ ఏమైపోతారో.. ఉత్తరం లేదు కబురు లేదు.. ఫోన్ లేదు అని ఒక్కసారైనా ఆలోచించావా? పెద్దోడా? ఏం తప్పు చేశావనిరా.. ఎందుకిలా తల దించుకుంటున్నావ్.. నువ్ ఒక గొప్ప డాక్టర్ వి.. కార్డియాలిజిస్ట్ ది గ్రేట్ హార్ట్ సర్జన్.. నా పెద్దబ్బాయి.. నా పెద్ద కొడుకు అని గర్వంగా చెప్పుకుంటానురా.. మీకు దొరికిన పిల్లాడి మీదే ఇంత ప్రేమ చూపిస్తుంటే మరి మాకు మీ మీద ఉండదా? అని సౌందర్య ఎమోషనల్ అవుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    Leave a Reply