• February 8, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. దీప కష్టాలు తీరాయ్.. రుద్రాణిని వాయించిన సౌందర్య

Karthika Deepam నేటి ఎపిసోడ్.. దీప కష్టాలు తీరాయ్.. రుద్రాణిని వాయించిన సౌందర్య

    కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే మంగళవారం ఫిబ్రవరి 8న ప్రసారం కానున్న Karthika Deepam Episode 1270 ధారావాహికలో అదిరిపోయే సీన్లు పడ్డాయి. మోనిత కంట పడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే హిమను ఎత్తుకెళ్లిన రుద్రాణికి సౌందర్య గుణ పాఠం చెప్పింది. కార్తీక్, దీపల ముందే రుద్రాణిని వాయించేసింది. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    మోనిత గారు ముందు కేక్ కట్ తినండి.. ఆ తరువాత తీరిగ్గా మాట్లాడుకుందాం.. అందరికీ కేక్ ఇచ్చేయ్.. అని కార్తీక్‌కి అంజలి చెబుతుంది. కేక్ ఇచ్చిన పర్సన్ కూడా కార్తీక్‌లానే కనిపించాడు.. అని భారతితో మోనిత అంటుంది. ఊరుకో మోనిత..అని భారతి అంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉందా? అని అంజలి అడిగేస్తుంది. దీంతో మోనిత అసలు విషయం అడిగేస్తుంది.

    కార్తీక్ ఆపరేషన్ చేసిన వారి వివరాలు చెబుతారా?. అని మోనిత అడుగుతుంది. మీకు మీ వారికి ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? ఇలా అడగడం తప్పే కానీ.. అర్థం కాక అడుగుతున్నాను.. అని అంజలి అంటుంది. మా వారు నా మీద అలిగారు.. ఏదో చిన్న చిలిపి గొడవ చెప్పకుండా వచ్చేశారు.. అని మోనిత అంటుంది. ఆహా అబద్దాన్ని ఎంత సింపుల్‌గా అనుకూలంగా చెప్పేశావ్.. అని భారతి లోలోపల అనుకుంటుంది.

    ఇక్కడే ఈ ఊర్లేనో ఉన్నారు.. ఇందాక కేక్ ఇచ్చిన అతనే ఫాదర్ అని చెబుతుంది అంజలి. దీంతో మోనిత, అంజలి వంటలు చేసే చోటుకి వెళ్తారు. కానీ అంతలోపే దీప, కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. చ మంచి అవకాశం మిస్ అయింది.. అని మోనిత అనుకుంటుంది. మోనిత మాటలను తలుచుకున్న కార్తీక్, దీప.. పిల్లల కోసం ఆలోచిస్తూ వెళ్తుంటారు. పిల్లలు ఎలా ఉన్నారో.. ఎదురుచూస్తున్నారేమో.. అని అనుకుంటూ ఉంటారు.

    కానీ అక్కడ హిమను ఆల్రెడీ రుద్రాణి మనుషులు ఎత్తుకెళ్తారు. అయ్యో దేవుడా.. ఈ విషయం దీపకు చెప్పాలి.. కనీసం ఫోన్ కూడా లేదు.. ఆ రుద్రాణి మనుషులు హిమను తీసుకెళ్లారని దీప వస్తే ఎలా చెప్పాలమ్మా.. అని శౌర్యతో విజయలక్ష్మీ అంటూ ఉంటుంది. అమ్మ వాళ్లు ఇంకా రాలేదేంటి అత్త.. నాకు భయం వేస్తోంది.. అని శౌర్య అంటుంది. ఇక అప్పారావ్ ఇంటికి తాళం వేసి ఉండటంతో.. నా పిల్లలు ఇంట్లోనే ఉండాలి.. వాళ్లకేం కాకూడదు.. అని దీప కంగారు పడుతుంది.

    అప్పారావ్ ఇంట్లోంచి హిమను తీసుకెళ్లారట.. శౌర్యను కాపాడి నేను తీసుకొచ్చాను.. అని విజయ లక్ష్మీ అంటుంది. నేను బాగానే ఉన్నాను.. ముందు హిమను తీసుకుని రండి.. అని శౌర్య అంటుంది. నేను అమ్మా వెళ్తాం అని అక్కడి నుంచి దీప, కార్తీక్‌లు బయల్దేరుతారు.. కార్లో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు.. ఎందుకు అక్కా అని అడుగుతాడు.

    ఈ రుద్రాణి ప్లాన్ నీకు అర్థం కాదు లేరా?.. వాళ్లు ఇక్కడకు వస్తారు..అరుస్తారు.. పాప కనిపించదు.. డబ్బిస్తేనే పాప ఎక్కడుందో చెబుతాను.. లేదంటే ఊరు వెళ్తున్నాను నెలరోజులు కనిపించదు అని చెబుతాను..అని అంటుంది. ఇదేదో హిమను ఇక్కడే పెట్టుకోవచ్చు కదా?.. అని సలహా ఇస్తే వాడి చెంపను పగలగొడుతుంది. మనల్ని కొట్టి హిమను తీసుకెళ్లొచ్చు కదా?.. అందుకే ఇక్కడ ఉంచలేదు.. అని రుద్రాణి అంటుంది.

    మీ గురించే అనుకుంటున్నాను.. మీరే వచ్చారు.. అని దీప్, కార్తీక్‌లను చూసి రుద్రాణి సెటైర్ వేస్తుంది. మర్యాదగా అడుగుతున్నాను.. ఎక్కడుందో చెప్పు.. అని కార్తీక్ అడుగుతాడు. అరవకండి. మీకు గుండెనొప్పి, నాకు తలనొప్పి.. నో మాటలు.. మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్.. సారూ.. పాప ఇక్కడ లేదు.. డబ్బులిస్తే పాప కనిపిస్తుంది.. అని రుద్రాణి అంటుంది.

    అంత డబ్బు ఒకేసారి అంటే ఎలా ఇవ్వాలి అని దీప అంటుంది. ఆపరేషన్‌కు ఎక్కడినుంచి వచ్చాయ్.. అవి నాకు అనవసరం.. నేను ఊరెళ్తాను.. మళ్లీ నెల వరకు రాను.. అంటే మీ పాప కూడా కనిపించదు అని రుద్రాణి అంటుంది. ఇంటి లోపల పాప ఉందేమోనని వెతుకుతారు. అడ్డం వచ్చిన వాడిని చెంపవాయిస్తాడు కార్తీక్. లోపలంతా వెతికినా ఉండదు.

    రుద్రాణి ఊరికి బయల్దేరుతుంది. దీంతో దీప వేడుకుంటుంది. మొత్తం డబ్బులిస్తేనే మీ పాప.. లేదంటే నా పాప.. దీపమ్మా దండాలతో పని కాదమ్మా.. డబ్బు కావాలి.. కోపం వస్తే కొట్టు పడతాను.. డబ్బు చేతిలో పెడితేనే కూతురు కనిపిస్తుంది..అని అంటుంది రుద్రాణి. నీకు దండం పెడతాను.. కాళ్లు పట్టుకుంటాను.. అని కిందకు వంగుతుంది దీప. ఇందులో సౌందర్య వస్తుంది.

    నువ్వేంటి ఇక్కడ నీకు కూడా డబ్బులు కావాలా? లేదా నా కాళ్లు పట్టుకోవడానికి వచ్చావా? అని సౌందర్యతో రుద్రాణి పిచ్చిపిచ్చిగా వాగుతుంది. దీంతో లాగి చెంప మీద కొడుతుంది.. నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా? అని రుద్రాణి అరిస్తే.. గొంతు తగ్గించి మాట్లాడు.. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సౌందర్యతో.. సౌండ్ తగ్గించు.. ఆయుష్షు మిగులుతుంది.. అని రుద్రాణికి సౌందర్య వార్నింగ్ ఇస్తుంది.

    ఏంటి దీప ఇది.. ఏం చేస్తున్నావే నువ్.. అని సౌందర్య అంటుంది. దీప నీకు తెలుసా? అని రుద్రాణి షాక్ అవుతుంది. తెలుసా? ఏంటి.. దీప ఎవరనుకున్నావ్.. నా పెద్ద కోడలు.. అని చెబుతుంది సౌందర్య. మమ్మీ.. నువ్ ఇక్కడ.. అని కార్తీక్ అంటాడు. ఇతను మీ కొడకా? అని రుద్రాణి మళ్లీ షాక్ అవుతుంది. ఇతనేంటి.. ఇతను.. నా పెద్ద కొడుకు.. డాక్టర్ కార్తీక్.. అని సౌందర్య గర్వంగా చెబుతుంది. డాక్టరా?.. అని రుద్రాణి మరింత షాక్ అవుతుంది. అవును.. ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్.. నా పెద్ద కొడుకు.. ఏం చేస్తావే నువ్.. డబ్బులు వడ్డీకి తిప్పుతావా.. వందల మందికి గుండె ఆపరేషన్ చేశాడు తెలుసా? నీకు.. వందల మంది చేతులెత్తి మొక్కుతారే నా కొడుకు పేరు చెబితే.. అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి చూస్తారు.. నువ్వెంత నీ బతుకెంత అని రుద్రాణిని చీల్చి చెండాడుతుంది సౌందర్య. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    Leave a Reply