- February 7, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు.. దీప, కార్తీక్‌లు చిక్కేనా?

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 7న సోమవారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Episode 1269 ధారావాహికలో కార్తీక, దీపలు మోనిత నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. భారతి, మోనితలను అంజలి ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌లో దీప చూసేస్తుంది. మోనిత కంట పడకుండా ఉండేందుకు కార్తీక్ తెగ కష్టపడ్డాడు. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
ఏమనుకోకుండా వంటల సంగతి చూసుకోండి.. అని మోనితను అంజలి రిక్వెస్ట్ చేస్తుంది. సరే అంజలి గారు నేను వంటల సంగతి చూసుకుంటాను.. అని అటు వైపు వెళ్తుంది. అక్కడ కార్తీక్‌ని చూసి మోనిత సంబరపడిపోతుంది. కార్తీక్.. కార్తీక్.. అని భారతికి విషయం చెప్పేందుకు పరిగెత్తుంది. తీరా భారతిని పిలిచి చూపిస్తే అక్కడ వేరే వ్యక్తి అదే షర్ట్ వేసుకుని ఉంటాడు.
దీంతో భారతి తిడుతుంది. ఎవరిని చూసినా నీకు కార్తీక్‌లా కనిపిస్తాడని నువ్వే చెప్పావ్ కదా?. ఆపరేషన్ చేశాడని అంజలి అంటుంటే.. నువ్వేమో ఇక్కడ వంటలు చేశావని అంటున్నావ్.. పద ఇక్కడి నుంచి వెళ్దాం.. ఇది వేరే వాళ్లు చూసుకుంటారు.. అని మోనితను అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక అంజలి తన భర్తను భారతికి, మోనితకు పరిచయం చేస్తుంది.
అక్కడి నుంచి మోనిత దూరంగా వస్తుంది. భారతిని కూడా పిలుస్తుంది. ఊర్లో ఉన్న హాస్పిటల్స్‌లో కార్తీక్ గురించి ఎంక్వైరీ చేద్దామా? అని భారతిని మోనిత అడుగుతుంది. ఈ ఊర్లోనే ఉన్నారని తెలిసింది కదా? పార్టీ అయ్యే వరకు కూడా ఆగలేవా?..అని మోనితపై భారతి అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక మరో వైపు కార్తీక్‌కు కాఫీ ఇస్తుంది దీప. మీరెందుకు వంకాయలను కోస్తున్నారు.. వాళ్లకు పని చెప్పండి.. మీరు కూర్చోండి అని అంటుంది దీప.
ఇక అందరికీ కాఫీ ఇచ్చేందుకు బయల్దేరుతుంది దీప. అయితే మోనిత కూడా వంటల వైపు వస్తుంటే.. అంజలి వచ్చి తీసుకెళ్తుంది. అలా అంజలి, మోనిత ముందు.. వారి వెనక దీప వస్తూ ఉంటారు. కాఫీ అంటూ దీప అందరికీ సర్వ్ చేస్తుంటుంది. అక్కడ భారతి, మోనితలను దీప చూసి కంగారు పడుతుంది. ఆ విషయాన్ని కార్తీక్‌కు చెబుతుంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోదాం పదా? అని దీప అంటుంది.
అలా ఎలా వెళ్తాం.. ఈ పని అంతా కావాలి కదా? మనకు అంజలి గారు ఎంతో సాయం చేశారు.. ఇలా పనిని మధ్యలో వదిలేస్తే ఎలా.. అంతా పూర్తి చేసేసి వెళ్దామని కార్తీక్ అంటాడు. వంటలన్నీ పూర్తవ్వడంతో వెళ్దామని దీప అంటుంది. ఒకసారి అంజలి గారికి చెప్పేసి రా అని కార్తీక్ అంటాడు. అంతలో అంజలి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఎదురుచూస్తుంటారని వెళ్తామని దీప అంటుంది.
కేక్ కట్ చేసి, భోజనం చేశాక వెళ్లండి అని అంజలి అంటుంది. ఎక్కువగా బతిమాలించుకోకండి నాకు చిరాకు వేస్తుంది అని అంజలి అంటుంది. కేక్ మీరే అందరికీ సర్వ్ చేయండి అని అంజలి చెప్పి వెళ్లిపోతుంది. ఇక మొహం కనిపించకుండా కార్తీక్ టవల్‌ను చుట్టుకుంటాడు. అలా ఎందుకు కట్టుకుంటున్నారు అని అంజలి అడుగుతుంది. ఓ సర్వ్ చేస్తుంటే పడకూడదు అనా? అని అంజలి అనుకుంటుంది.
ఇక కేక్ కట్ చేసే సమయంలో మోనిత, భారతిల పక్కనే కార్తీక్ ఉంటాడు. దేవుడా ఏంటి పరీక్ష అనుకుంటాడు. మోనితకు కేక్ అందిస్తాడు కార్తీక్. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కేక్ సర్వ్ చేస్తున్నవాడు కూడా నాకు కార్తీక్‌లానే కనిపిస్తున్నాడు అని మోనిత భారతితో అంటుంది. ఆ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ల వివరాలు చెప్పండి. మా వారు నా మీద అలిగారు.. నాకు చెప్పకుండా వచ్చారు అంటూ అంజలిని మోనిత అడుగుతుంది. వారు ఇక్కడే ఉన్నారంటూ అంజలి అసలు విషయం చెబుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి.