• February 5, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. మోనిత కంటపడ్డ కార్తీక్.. మళ్లీ కథ మొదటికేనా?

Karthika Deepam నేటి ఎపిసోడ్.. మోనిత కంటపడ్డ కార్తీక్.. మళ్లీ కథ మొదటికేనా?

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 5న శనివారం ప్రసారం కానున్న Karthika Deepam Episode 1268 ధారావాహికలో అసలు సిసలు కథ నడిచింది. మోనిత అనుకున్నదే జరిగింది. కార్తీక్ దగ్గరకే వెళ్తున్నానని అనిపిస్తోందంటూ చెప్పిన మాటలే నిజమయ్యాయ్. చివరకు డాక్టర్ అంజలి ఇంట్లో కార్తీక్ ఆచూకిని తెలుసుకుంది. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ అలా ముందుకు సాగింది.

    పదే పది రోజుల్లో కార్తీక్‌ని కనిపెడతాను అని చెప్పాను కదా? అంటూ మోనిత చేసిన చాలెంజ్‌ను ఆదిత్య, శ్రావ్యలు గుర్తు చేసుకుంటారు. మోనిత ధైర్యంఏంటి.. ఊరికే అని ఉంటుందా?.. అని ఆదిత్య శ్రావ్యలు అనుకుంటారు. తన మనసులో ఏమున్నా సరే అన్నయ్య కనిపిస్తే చాలు.. అక్కాబావల ఆచూకీ తెలిస్తే చాలు.. అదే మొదటి మంచి పని.. అవుతుందని ఆదిత్య, శ్రావ్యలు మాట్లాడుకుంటారు.

    బర్త్ డే ఫంక్షన్ అని తెలుసు.. రిలాక్స్ అవ్వొచ్చు అని అనుకున్నావ్ బాగుంది.. నా కార్తీక్ దొరికితే బాగుంటుందని నేను వస్తున్నా..అక్కడ హోటల్, లాడ్జ్‌లు కూడా ఉండవు. వెళ్లి ఇబ్బంది పెట్టడం ఎందుకు.. అని భారతతో మోనిత అంటుంది. ఇంతలో డాక్టర్ అంజలికి భారతి ఫోన్ చేస్తుంది. మాది పెద్ద ఇళ్లు.. మీరు ఉండొచ్చు రండి.. సరేనా? టెన్షన్ పెట్టుకోకు. అని భారతికి చెబుతుంది. సరేనని మోనిత కూడా ఓకే అంటుంది. భారతి..నా కార్తీక్ కనిపిస్తాడా? అక్కడ.. వెళ్తుంటే పాజిటివ్ వైబ్రేషన్స్.. వెళ్తుంటే కార్తీక్ దగ్గరైనట్టు అనిపిస్తోంది. అని మోనిత అంటుంది.

    వంట సామాన్లు పట్టుకుని కార్తీక్, దీప నడుచుకుంటూ వస్తారు. అలా కార్తీక్ నడుచుకుంటూ వస్తున్నా కూడా తనకు డాక్టర్ బాబు రూపమే కనిపిస్తుంటుంది. దీంతో ఏంటి దీప.. అలా చూస్తన్నావ్.. అని కార్తీక్ అడుగుతాడు. మీరు ఎలా ఉన్నా డాక్టర్ బాబు రూపంలోనే కనిపిస్తున్నారు. అదే దర్పంతో కనిపిస్తారు.. ఇప్పుడు కూడా వంట చేయడానికి వస్తున్నా.. ఆపరేషన్ చేసేందుకు వస్తన్నట్టు అనిపిస్తుంది. అని దీప అంటుంది. నీకు బాధేస్తుందా? అని కార్తీక్ అడుగుతాడు. బాధ లేదంటే అది అబద్దం అవుతుంది.. టైం బాగా లేనప్పుడు.. చాలా పెద్దవాళ్లే మన కంటే ఎక్కువగా కష్టాలు పడ్డారు.

    బీ లైక్ రోమన్ ఇన్ రోమన్.. అని సామెత ఉంది తెలుసా? అని కార్తీక్ అంటాడు. సామెతలకు ఏంటి గానీ నా డాక్టర్ బాబు దొరబాబులా రాజాల ఉండాలి.. అని అంటుంది. నువ్ వంటలక్కవి అయితే నేను వంటలయ్యని..అని కార్తీక్ అంటాడు. వెంటనే దీప నవ్వేస్తుంది. నీ నవ్వు బాగుంటుంది.. అని కార్తీక్ అంటాడు. డాక్టర్ అంజలి కష్టంలో మనల్ని ఆదుకున్నారు.. ఆవిడ మనకు ఎంతో సాయం చేసింది.. అని కార్తీక్ అంటాడు. నేను వంట చేస్తాను. మీరు వైద్యం చేయాలి అంతే అని దీప అంటుంది. అలిగినప్పుడు కూడా బాగుంటావ్.. అని దీపను పొగిడేస్తాడు కార్తీక్.

    ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా? అని దీప అంటుంది. పిల్లల్ని అప్పారావ్ ఇంట్లో పెట్టాం.. రుద్రాణికి తెలీదు కదా? మనం చేయాల్సిన పని గురించి ఆలోచిద్దాం.. అని కార్తీక్ అంటాడు. నీ వంటల రుచికి ఆశ్చర్యపోవాలి..అని కార్తీక్ అంటాడు. ఆశ్చర్యం పోతారు గానీ ఇంకోసారి ఇలా రావొద్దు.. అని దీప అంటుంది. ఇక భారతి ఇంట్లో మోనిత పనులు చేస్తూ ఉంటుంది. ఇలాంటివన్ని మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. మొత్తానికి మాటల్లో మాటగా.. కార్తీక్ తన భర్త అని చెబుతుంది మోనిత. కార్తీక్ మా హాస్పిటల్‌కు వచ్చి సర్జరీ చేశాడని తెలుస్తుంది. ఇక మోనిత ఫుల్ హ్యాపీ అయింది. ఇంతలో కార్తీక్, దీపలు డోర్ బెల్ కొట్టేస్తారు.

    దీంతో అంజలి వెళ్లి డోర్ తీస్తుంది. వంటలు ఎక్కడో చెబుతుంది. వాళ్లు ఇంటివెనక్కి వెళ్లి పని చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అంజలి మళ్లీ వచ్చి.. కార్తీక్ గురించి చెబుతూ మా హాస్పిటల్‌కు వచ్చారు అని చెబుతుంది. అవునా? అని మోనిత ఆశ్చర్యపడుతుంది. వాట్.. డాక్టర్ కార్తీక్ మీ హాస్పిటల్‌కి వచ్చారా? అని మోనిత అడుగుతుంది. మీకు చెప్పలేదా? అని అంజలి అడుగుతుంది. అన్నీ అడగలేం కదా? మీ హాస్పిటల్‌కి డాక్టర్ వచ్చారా? అని మోనిత అడుగుతుంది.

    నాకు ఇంకా అనుమానంగానే ఉంది.. అని అంజలి అంటుంది. అంటే కార్తీక్ ఇదే ఊర్లో ఉన్నాడా? దొరికావ్ కార్తీక్.. అని మోనిత లోలోపల అనుకుంటుంది. ఎందుకు వచ్చారు అని మోనిత అడుగుతుంది. పూర్ ఫ్యామిలీకి సర్జరీ చేసి వెళ్లారు.. మా లాంటి చిన్న హాస్పిటల్‌కి వచ్చారంటే నాకు నమ్మకంగా అనిపించలేదు అని అంజలి అంటుంది. మీరు నిజంగా చూశారా? అని మోనిత అడుగుతుంది. బేసికల్లీ ఎక్కువగా మాట్లాడరు కదా? అని అంజలి అంటుంది. కార్తీక్ ఇక్కడకు వచ్చి చేరావా?.. నాకు చిక్కి పోయావ్.. ఎంతో దూరంలోలేవు.. నీకు దగ్గరగా మోనిత వచ్చింది.. అని మోనిత అంటుంది.

    ఈవిడే ఈ రోజు మన మాస్టర్.. ఈవిడ ఏం చెబితే అది వినాలి.. అని కార్తీక్ వంట మనుషులకు చెబుతాడు. ఏంటండి ఈరోజు జోరుగా ఉన్నారు..అని దీప అంటుంది. మనం ఎక్కడికి బయటకు వెళ్లడం లేదు కదా? ఇందులో ఏదో కిక్ ఉంది.. అని కార్తీక్ అంటాడు. ఇక మోనిత ఊర్లోకి వెళ్లి వెతకాలని అనుకుంటుంది. బయటకు వెళ్తాను అని మోనిత అంటే.. నా పరువు తీయకు.. అంజలి భర్త వస్తాడు తరువాత వెళ్లి వెతుకుదాం అని భారతి అంటుంది. కార్తీక్ ఇదే ఊర్లో ఉన్నాడట.. నేను కూడా అదే ఆశ్చర్యపోతోన్నా. సర్జరీ.. ఎలా.. సర్జరీ ఏంటి.. కార్తీక్ ఇదే ఊర్లో ఉన్నాడా?వెతుకుతాను.. అంజలి భర్త వస్తాడు.

    వంటలక్క ఈ రోజు బాగా వస్తున్నాయ్.. నాకు నేర్పించొచ్చు కదా?.. డబ్బులు కూడా ఇస్తాను.. అని అంటాడు కార్తీక్. మీరు చేయాల్సింది వైద్యం.. ఇంకోసారి మాట్లాడితే ఇంటికి పంపిచేస్తాను.. అని దీప అంటుంది. వంటలను చూసుకో అని మోనితు భారతి, అంజలి చెబుతారు. అలా మొత్తానికి వంటల దగ్గర కార్తీక్‌ను రేపటి ఎపిసోడ్‌లో మోనిత చూడబోతోంది. మరి ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply