• February 3, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. భారతి సాయంతో మోనిత.. కార్తీక్ గుట్టురట్టు

Karthika Deepam నేటి ఎపిసోడ్.. భారతి సాయంతో మోనిత.. కార్తీక్ గుట్టురట్టు

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం ఫిబ్రవరి 3న ప్రసారం కానున్న Karthika Deepam Episode 1266 ధారావాహికలో కార్తీక్ డాక్టర్ బాబుగా మారుతాడు. ఇక మరో వైపు కార్తీక్, దీప ఆచూకి కోసం రుద్రాణి వెతుకుతుంది. ఇంకో వైపు భారతి, మోనితలు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక భారతి మూలాన మోనితకు అదృష్టం పట్టేసింది. త్వరలోనే కార్తీక్ ఆచూకి దొరకబోతోంది. అలా కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ ముందుకు రాడు. నాకన్నా బాగా డాక్టర్ కార్తీక్కే తెలుస్తుంది అని అంటాడు. కండీషన్ బాగా లేదన్నారు.. కార్తీక్ రావాలంటున్నారు.. ఇది సాధ్యమయ్యేదేనా? అని డాక్టర్ అంజలి అంటుంది. గడిచే ప్రతీక్షణం ఆయుష్షు తగ్గినట్టే అని అంటాడు.. ఈ సర్జరీ చేయడం నావల్ల కాదు.. కేవలం ఆయన వల్లే ఇది సాధ్యమవుతుంది.. అని అంటాడు.

    ఇప్పటికిప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఎలా దొరుకుతుంది. ఆయనకు ఏం జరిగిందో.. ఈ మధ్య ఏమీ వినిపించడం లేదు.. వస్తారని అంటావా? అని డాక్టర్లు మాట్లాడుకుంటారు. నేను పిలిపించుకుంటాను.. అని దీప అనడంతో షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు.. గ్రేట్ కార్డియాలజిస్ట్.. ఆయన ఎందుకు వస్తారు.. ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటే వచ్చే నెల దొరుకుతుంది.. అని ఓ డాక్టర్ అంటే.. అవును ఎలా వస్తారు..అని ఇంకో డాక్టర్ అంటుంది.

    నేను రప్పించుకుంటాను.. అని దీప అంటుంది. దీప అని కార్తీక్ పిలుస్తాడు. అవును కరెక్టే.. ఎలా వస్తారు చెప్పండి.. అని డాక్టర్ అడుగుతుంది. కాళ్లు పట్టుకుని బతిమాలాడుకుంటాను.. మీరు ఏర్పాట్లు చేయండి సర్.. కా కూతురు ప్రాణాలను కాపాడమని వేడుకుంటాను.. అని దీప చెబుతుంది. ఏంటి దీప.. నువ్ ఏమనుకుంటున్నావ్.. అలా ఎలా మాటిస్తావ్.. అని కార్తీక్ అడుగుతాడు.

    అత్తమ్మని కాపాడుకునే అవకాశం వచ్చినా కూడా ఇలానే చేస్తారా? అని దీప అడుగుతుంది.. అవకాశం కాదు.. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చేయగలను.. అని కార్తీక్ అడుగుతాడు. అత్తమ్మ ఆరోగ్యం కంటే ఎక్కువా? వాళ్లు అంత అవకాశం ఇచ్చారు.. డాక్టర్ కార్తీక్ అయితేనే ఆపరేషన్ చేయగలరు అని అన్నారు.. ఇంకా ఆలోచిస్తున్నారేంటి.. అని దీప నిలదీస్తుంది.

    నాకేం చేయాలో తోచడం లేదు.. నేను ఆపరేషన్..అని కార్తీక్ సతమతమవుతాడు. ఆలోచించకండి.. దండం పెడతాను.. ఇంత చేసింది పిల్లలు, వారి భవిష్యత్తు కోసమే కదా.. నాకంటే ఎక్కువగా శౌర్య ఆరోగ్యం గురించి తెలుసు. చూస్తూ చూస్తూ పిల్లని పోగొట్టుకుంటామా? కాదనకండి డాక్టర్ బాబు.. కార్తీక్ భార్యగా కాకుండా.. శౌర్య తల్లిగా అడుగుతున్నాను.. నా కూతురికి ప్రాణ భిక్ష పెట్టండి.. అని దీప కన్నీరు పెట్టుకుంటుంది.

    ఆనంద్ రావు గారు.. ఎక్కడున్నారండి.. అమ్మను వదిలేసి ఎక్కడున్నారు.. ఎంత ఏడుస్తున్నారో ఏమో.. ఎవడ్రా నువ్.. నా ఆనంద్ రావునే తీసుకెళ్లావ్ ఏంట్రా.. కార్తీక్.. ఎక్కడున్నావ్.. మన బిడ్డను మనం ఎలా కలుసుకోవాలి కార్తీక్.. అంటూ శ్రావ్యతో చాలెంజ్‌ను మోనిత గుర్తు చేసుకుంటుంది.. కార్తీక్ దొరకాలి.. ఆనంద్ రావు దొరకాలి.. ఇది అయ్యే పనా?.. అవుతుంది.. చాలెంజ్ చేయడం మంచిదైంది.. గెలవాలన్నా కసితో ఇంకా ప్రయత్నిస్తాను.. నువ్ గెలవాలి.. చాలెంజ్ విసరగానే సరిపోదు.. గెలవాలి..అని మోనిత తనలో తాను అనుకుంటుంది.

    ఇంతలో భారతి వస్తుంది. రా భారతి.. సరైన టైంకి వచ్చావ్.. కష్టాల్లో ఉన్నప్పుడే స్నేహితులు వస్తారు.. ఆవేశంలో ఓ పని చేశాను.. అని మోనిత అంటే.. నువ్ చేసేవన్నీ ఆవేశంలోనే కదా? అని కౌంటర్ వేస్తుంది. పదిరోజుల్లో కార్తీక్, బాబుని తీసుకొస్తాను అని చాలెంజ్ చేశాను.. అని మోనిత చెబుతుంది. అది సాధ్యమయ్యే పనేనా? అని భారతి చురకలు అంటిస్తుంది.

    సాధ్యానికి, అసాధ్యానికి ఒకే అక్షరం తేడా.. నాలో ఉత్సాహాన్ని నింపు.. ప్రొత్సహించు.. ఆ ఫోన్ మహేష్ గాడికి దొరికింది.. లేదంటే ఎప్పుడో దొరికేసే వాడు.. కార్తీక్ దొరుకుతాడు భారతి.. ఎక్కడికీ వెళ్లడు.. నా ప్రేమే కార్తీక్‌ని, నన్ను కలుపుతుంది.. నా బాబు దొరుకుతాడు.. కార్తీక్ వచ్చాక.. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయోచ్చా? మెడికల్ అసోసియేషన్ ఒప్పుకుంటుందా? అని మోనిత అడుగుతుంది. ఇప్పుడే చెప్పలేం అని భారతి అంటుంది.

    నా ఫ్రెండ్ కూతురు బర్త్ డే పార్టీకి.. వస్తావా?.. అని డాక్టర్ అంజలి వద్దకు వెళ్లబోతోన్నట్టు తెలుస్తోంది. ఆ ఆస్పత్రిలోనే ఇప్పుడు శౌర్య ఉందని వీళ్లకు తెలియదు. అయితే మోనితను వస్తావా? అని భారతి అడుగుతుంది. మొదట మోనిత రానని చెబుతుంది. ఒకవేళ నా కార్తీక్ అక్కడే ఉన్నాడేమో అని మోనిత అనుమానిస్తుంది. మళ్లీ వెంటనే వస్తాను అని చెబుతుంది. కార్తీక్ కూడా అక్కడే ఉన్నాడేమో.. దేవుడు భారతి రూపంలో వచ్చాడేమో.. నేను క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటాను.. అలా కలిసొస్తాయ్..అని మోనిత అనుకుంటుంది. అలా బర్త్ డే పార్టీలో భాగంగా కార్తీక్ గుట్టురట్టు అయ్యేలా ఉంది.

    రుద్రాణి అనుకున్నది ఇప్పటి వరకు అనుకున్నది కానిది లేదు.. నన్ను ఎదురించిన శ్రీవల్లి, కోటేశులను పైకి పంపించాను.. కానీ వీరు మాత్రం నన్నే ఆడుకుంటున్నారు.. ఆత్మ విశ్వాసంతో ఉన్నారు.. హిమను వదిలేదే లేదు.. నా కూతురిగా పెంచుతాను.. దీప వాళ్ల ఏ హాస్పిటల్‌లో ఉన్నారో ఏమో.. గడ్డం గాళ్లు ఏం చేస్తున్నారో.. అని వాళ్లకు ఫోన్ చేస్తుంది. చెడామడా తిట్టేస్తుంది. వాళ్లకు ఆత్మాభిమానం ఉంది కానీ.. డబ్బుల్లేవ్.. ఈ కష్టాలను లాభాలుగా మార్చుకుందామంటే కుదరడం లేదు.. ఈసారి వదిలేదు లేదు.. ఈ కష్టాన్ని అనుకూలంగా మార్చుకుంటాను.. హాస్పిటల్‌కు వెళ్లి వీరంగం చేస్తాను. అని రుద్రాణి అనుకుంటుంది.

    అమ్మా డాడీ ఎక్కడ.. అని హిమ అడుగుతుంది. డాక్టర్ బాబుకు ఏమైంది.. ఎంత చెప్పినా మనసు కరగలేదా.. అవకాశాన్ని వదిలేస్తున్నారా?అని దీప ఆలోచిస్తుంటుంది. డాక్టర్ కార్తీక్ వస్తారా? ఎంత వరకు నమ్మొచ్చు.. అని డాక్టర్లు మాట్లాడుకుంటారు. అనస్తీషియా ఇవ్వొచ్చా?. అని అడిగితే.. ఇవ్వండి.. ఆయన్ను వెయిట్ చేయించలేం కదా? అని అంటాడు డాక్టర్. ఇంతలో డాక్టర్ కార్తీక్ వచ్చేస్తాడు… ఐ యామ్ డాక్టర్ కార్తీక్.. రిపోర్ట్స్ ప్లీజ్.. అని అనేస్తాడు. ఇక డాక్టర్ అంజలికి ఈ విషయం తెలిసి సంబరపడుతుంది. ది గ్రేట్ కార్డియాలజిస్ట్ కార్తీక్ మన ఆస్పత్రికి వచ్చాడా? అని ఆపరేషన్ థియేటర్లోకి వస్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో శౌర్యకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అవుతుంది.

    Leave a Reply