• February 1, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. అడుగడునా రుద్రాణి అడ్డు.. శౌర్యను కాపాడుకునేందుకు దీప కష్టాలు

Karthika Deepam నేటి ఎపిసోడ్.. అడుగడునా రుద్రాణి అడ్డు.. శౌర్యను కాపాడుకునేందుకు దీప కష్టాలు

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 1 మంగళవారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Episode 1264 ధారావాహికలో రుద్రాణి అరాచకాలే కనిపిస్తాయి. ఆస్పత్రిలో శౌర్య, అప్పు కోసం దీప, హిమ కోసం రుద్రాణి అడుగడుగుతా అడ్డగిస్తూనే ఉంటుంది. అలా మొత్తానికి శౌర్యకు హాస్పిటల్‌లో వైద్యం చేయించేందుకు నానా కష్టాలు పడుతుంటారు. కార్తీక్ దీపం నేటి ఎపిసోడ్ మొత్తానికి అప్పు చుట్టూ తిరిగింది.

    డబ్బుల కోసం రుద్రాణి ఇంటికి హిమ వచ్చిన సంగతి తెలిసిందే. మా శౌర్య బాగావ్వాలంటే డబ్బులు కావాలి అని హిమ ఏడుస్తూ ఉంటుంది.. డబ్బులు నేనిస్తా బంగారం.. స్వీట్ కొంచెమైనా తిను.. తినమ్మా.. ఎందుకమ్మా ఏడుస్తున్నావ్.. నా ఆస్తులన్నీ నీకే.. మరో రుద్రాణిలా తయారు చేస్తా అని అంటుంది. ఇంతలో.. రుద్రాణి అంటూ దీప అరిచేస్తుంది..

    వచ్చావా దీప.. తల్లి ప్రేమ కదా? వస్తావ్ అని నాకు తెలుసు.. తల్లి ప్రేమ పంచే అవకాశం ఇవ్వమని అంటున్నా అని రుద్రాణి అంటుంది.. హిమను ఎందుకు తీసుకొచ్చావ్ అని అంటుంది.. దీపమ్మకు మర్యాదలు చేయండిరా అని తన మనుషులకు రుద్రాణి చెబుతుంది..నేను తెప్పించలేదు.. రప్పించలేదు.. తనే వచ్చింది.. అని రుద్రాణి చెబుతుంది.

    తనే ఎందుకు వస్తుంది.. మీరే ఎత్తుకొచ్చారు.. అని దీప అంటుంది. నేనే వచ్చాను అమ్మా అని హిమ అంటుంది.. వాళ్ల అక్క ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇవ్వమని తనే వచ్చింది.. ఒట్టు దీప.. అని రుద్రాణి చెబుతుంది. ఏంటిది.. నువ్విక్కడకు రావడం ఏంటి.. డబ్బులు అడగడం ఏంటి.. అని దీప అడుగుతుంది. నేను ఇక్కడే ఉంటానమ్మ.. ఆంటి దగ్గర డబ్బులు తీసుకో.. శౌర్యను బాగు చేద్దామమ్మా.. డబ్బులు తీసుకెళ్దామ్ అమ్మ.. శౌర్యను కాపాడుదాం అమ్మా.. అని హిమ అంటుంది.

    నీ కూతురే చెబుతోంది కదా.. డబ్బులు తీసుకెళ్లు.. మీరు ఎటూ అప్పు తీర్చరు.. నేను నీ కూతురిని తీసుకొస్తాను జరిగేది ఇదే.. గుర్తు పెట్టుకో దీప.. అని రుద్రాణి అంటుంది. ఇక హిమను తీసుకెళ్తుంది దీప. ఊర్లో వాళ్లందరినీ అప్పు కోసం అడుగుతుంది. కానీ ఎక్కడా అప్పు పుట్టదు. ఇంతలో రుద్రాణి ఎదురవుతుంది. ఏంటి దీప.. అప్పుల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నావా?.. నువ్ తిరిగితే తిరిగావ్.. చిట్టి పిల్లని ఎందుకు తిప్పుతున్నావ్..దాహం వేస్తోందా.. కూల్ డ్రింక్ ఇప్పించాలా బంగారం అని హిమను అడుగుతుంది రుద్రాణి..

    తాడికొండలో నీకు నయా పైసా అప్పు పుట్టదు. పుట్టకుండా చేశాను.. ఎంత మందిని అడుగుతావో, దండం పెడతావో దండం పెట్టుకో. బతిమిలాడుకో. ఇక్కడ అందరికీ గుర్తొచ్చేది రుద్రాణే.. చివరకు వచ్చేది నా దగ్గరికే. తీసుకునేది నా డబ్బులే. డబ్బులకు బదులు హిమను ఇవ్వు అంటున్నా అని రుద్రాణి చెబుతుంది..రుద్రాణి అంటూ దీప అరిచేస్తుంది. డబ్బులు లేకున్నా.. ఓపిక లేకున్నా.. మీ మొగుడు పెళ్లాలు బాగానే అరుస్తారు.. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు.. డబ్బులు తీసుకెళ్లి వైద్యం చేయించు.. నీ కూతురి ప్రాణాలకే ప్రమాదం.. జాగ్రత్త.. మళ్లీ నా దగ్గరికే రావాలి.. నేనిచ్చే డబ్బులే తీసుకోవాలి.. గుర్తు పెట్టుకో.. అని రుద్రాణి అనుకుంటుంది.

    మరో హాస్పిటల్‌కు శౌర్యను తీసుకొస్తారు. అక్కడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. డాక్టర్ ఆలస్యంగా వస్తాడు. స్ట్రెచర్ కూడా ఎక్కువ సేపు ఇవ్వరు. దీంతో పక్కనే ఉన్న బల్ల మీద పడుకోబెడతారు. నీకేం కాదు శౌర్య నేనున్నాను అని కార్తీక్ అంటాడు. ఇంతలో దీప వస్తుంది. థియేటర్లో డాక్టర్ బిజీగా ఉన్నట్టున్నారు.. డబ్బుల్లేనందుకు మనం గట్టిగా కూడా అడగలేం కదా అని దీప అంటుంది.. చాలా చోట్ల డబ్బుల కోసం ప్రయత్నించాం కానీ అంటూ దీప చెబుతుంది..

    శౌర్యకు ఏం కాదు కదా?. అని హిమ అడుగుతుంది. నేనున్నా కదా? ఏం కాదు.. రౌడీ పరిస్థితి ఏం బాగా లేదమ్మా అని నీకు ఎలా చెప్పను అని డాక్టర్ బాబు అనుకుంటాడు.. ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నారు.. అని హిమ అడుగుతుంది. మనమే కాదు మన కంటే ముందు చాలా మంది వచ్చారు.. గట్టిగా మాట్లాడే అవకాశం మనకు లేదు.. జేబులు ఖాళీగా ఉన్నాయ్ కదా.. శౌర్య కళ్లు తెరువమ్మా.. అని కార్తీక్ అంటాడు.

    నేను మీ దగ్గరే ఎప్పటికీ ఉండిపోతాను.. అంటూ హిమ చెప్పిన మాటలను రుద్రాణి తలుచుకుంటుంది. ఆ కోటేశు శ్రీవల్లి పిల్లలు కోసం వైద్యం కోసం.. అప్పు తీసుకున్నారు. చివరకు పిల్లలు కలగలేదు. పిల్లాడు దొరికాడు. దత్తత తీసుకున్నారు. సంతోషం.. అప్పు తీర్చకుండానే పైకి పోయారు.. ఆ సారు వచ్చి ఆపద్భాంధవుడిలా వచ్చి సంతకం పెట్టాడు.. రాసుకున్న ప్రకారం పిల్లను, రంగరాజును ఇవ్వలేదు.. ఏంట్రా ఇది.. ఇప్పుడు నేనేం చేయాలి.. రాళ్ల గురించి ఆలోచిస్తున్నారా? రత్నంలాంటి హిమ గురించి ఆలోచిస్తున్నా.. తెలిసినవాళ్లకి ఏమైనా జరిగితే.. పరామర్శించాలి.. ఒకటి అనుకుంటే ఏదైనా చేయాలి.. ఎక్కడి దాకైనా వెళ్లాలి.. విసరాల్సింది రాళ్లు కాదు.. బాణాలు.. దగ్గరికి వెళ్లి మరీ విసరాలి.. అంటూ తన మనుషులతో మళ్లీ బయల్దేరుతుంది రుద్రాణి.

    కళ్ల ముందు ఇలా ఉన్నా కూడా ఆపరేషన్ చేయలేకపోతోన్నా అని కార్తీక్ బాధపడతాడు. ఇంతలో డాక్టర్ కోసం నర్స్‌ని అడుగుతాడు.. ఏది ఎమర్జెన్సీనే మీరు కాదు డాక్టర్ వచ్చి చెబుతారు అని నర్స్ అంటుంది. మాట్లాడు రౌడీ.. అని కార్తీక్ అత్తమ్మ హాస్పిటల్‌కు వచ్చాం అని దీప. శౌర్య ఏం భయపడకు.. మేం ఇక్కడే ఉన్నాం అని హిమ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు..

    కార్తీక్ బయటకు వెళ్తుంటే.. అప్పు తన దగ్గరున్న కొంత డబ్బులను ఇస్తాడు. నా దగ్గర ఇవే ఉన్నాయ్.. క్షమించు బావ.. అని అంటాడు. ఊర్లో ఉన్న హాస్పిటల్స్ వెతికేందుకు రుద్రాణి బయల్దేరుతుంది. ఓ హాస్పిటల్ వద్దకు రుద్రాణి వస్తుంది. అక్కడ ఓ కాంపౌండర్ ఎక్స్ ట్రా చేస్తే ఒక్కటి ఇస్తుంది. నువ్ రుద్రాణక్క పేరు విన్నావా? అని అంటుంది. విన్నాను అని చెబుతాడు.. అది నేనే అని రుద్రాణి అనడంతో వాడు భయపడతాడు. కార్తీక్ ఫోటో చూపించి.. ఇక్కడకు వచ్చారా? అని అడుగుతుంది. లేదు అని చెబుతాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది రుద్రాణి.

    మెడికల్ షాపుకి వెళ్లిన కార్తీక్ అక్కడ ఒకరికి మందుల విషయంలో సాయం చేస్తాడు. దీంతో మెడికల్ షాపు ఓనర్ షాక్ అవుతాడు. ఈ టాబ్లెట్లు ఇంత వరకు ఎవ్వరూ అడగలేదని అంటాడు. మీరు డాక్టరా?అని ఆ యజమాని అడిగితే.. లేదు మాకు ఒకప్పుడు మెడికల్ షాప్ ఉండేదని అబద్దం చెబుతాడు. అలా మొత్తానికి తనకు కావాల్సిన వన్నీ తీసుకెళ్తాడు. సరిగ్గా డబ్బులు ఇవ్వడంతో మరోసారి షాక్ అవుతాడు. ఓ మీకు మెడికల్ షాప్ ఉండేదని అన్నావ్ కదా? అంటాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్.. డాక్టర్ అవతరాన్ని ఎత్తి.. శౌర్యను కాపాడుతాడేమో చూడాలి.

    Leave a Reply