• January 28, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. బిడ్డ కోసం తల్లిదండ్రుల వద్దకు కార్తీక్.. అడ్డంపడ్డ రుద్రాణి!

Karthika Deepam నేటి ఎపిసోడ్.. బిడ్డ కోసం తల్లిదండ్రుల వద్దకు కార్తీక్.. అడ్డంపడ్డ రుద్రాణి!

    కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే.. జనవరి 28న శుక్రవారం ప్రసారం కానున్న Karthika Deepam Episode 1261 ధారావాహికలో కార్తీక్‌కు కష్టాలు వస్తాయి. డాక్టర్ అయి ఉండి కూడా తన కూతురికి వైద్యం చేయలేని పరిస్థితులో ఉంటాడు. డబ్బుల కోసం సౌందర్య దగ్గరకు వెళ్తాడు. కానీ ఫలితం లభించదు. ఇక రుద్రాణి తన మనుషులని పంపి కార్తీక్‌కి అడ్డుపడుతుంది. అలా కార్తీకదీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    అత్తయ్య మామయ్యలను చూసిన విషయం చెబితే మీరు బాధపడతారు అని నిజం దాచాను.. అని దీప చెబుతుంది. అయితే నాలానే నువ్ కూడా ఆలోచించావా? అంటే నేను దాచడం కూడా తప్పు కాదు.. అపరాధభావంతో ఇన్ని రోజులు బాధపడ్డాను.. ఇప్పుడు మనసు శాంతించింది.. అని కార్తీక్ అంటాడు. వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటారు.. డాడీకి ఏమై ఉంటుంది..

    ఎందరికో ట్రీట్మెంట్ చేసిన నేను డాడీకి హెల్ప్ చేయలేకపోతున్నాను చూడు.. ఇదేం దురదృష్టం.. ఇప్పుడు మనం ఏమీ చేయలేం కదా.. రుద్రాణి అప్పు తీరిస్తే తప్పా.. అడుగు ముందుకు వేయలేం .. ఊరు వదిలి వెళ్లలేం.. ఎలా దీప..అని కార్తీక్ బాధపడుతుంటాడు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి డాక్టర్ బాబు అని దీప అంటుంది. మళ్లీ నన్ను డాక్టర్‌ని చేద్దామని..అలా పిలుస్తున్నావా?దీప అని కార్తీక్ అంటాడు. మీరు వద్దంటే ఆపుతానేమో గానీ మానను కదా? అప్పుడప్పుడు పిలవనివ్వండి.. అని దీప అంటుంది.

    తాడు ఆట ఆడేందుకు స్కిప్పింగ్ తాడు కోసం పిల్లలు ప్రయత్నిస్తారు. ఇంతలో కార్తీక్ ఆ తాడుని తయారు చేసిస్తాడు. అమ్మా నీకు ఆడటం వచ్చా? రా ఆడుకుందాం అని పిల్లలు అడుగుతారు. నాకు పని ఉంది.. మీరే ఆడుకోండి.. అని అంటుంది. తాడు ఇవ్వడంతో థ్యాంక్స్ డాడీ.. అని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో శౌర్య పడిపోతుంది. డాడీ శౌర్య పడిపోయింది.. అని హిమ అరుస్తుంది.

    ఏమైంది రౌడీ అని కార్తీక్ వస్తాడు. దీప పట్టుకో అని ఇంట్లోకి తీసుకెళ్తారు. ఊపిరి ఊదుతాడు. సమస్య అర్థమైంది. డాడ్ ఉన్నాడు ఏం కాదు.. ఊపరి తీసుకో అని చెబుతాడు కార్తీక్.. ఏడ్వకండి.. అని దీపకు, హిమకు చెబుతాడు. దయచేసి ఏడ్వకండి అని అంటాడు.. అత్తమ్మకి ఏమైంది అని దీప కంగారు పడుతుంది.. హార్ట్‌కి హోల్ ఉండేది.. అది తిరగబడిందా?.. అర్జెంటుగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి అని కార్తీక్ లోలోపల అనుకుంటాడు..

    నన్నేం అడక్కు.. డబ్బులున్నాయా?.. డాడ్ నిన్ను రక్షించుకుంటాడు.. అని కార్తీక్ అంటాడు. ఇళ్లంతా వెతికితే కొన్ని డబ్బులు దొరుకుతాయి. ఆ డబ్బులు ఇంటికోసం వాడకుండా ఉన్నా బాగుండు.. అని దీప అనుకుంటుంది. ఏమైంది డాడీ అని హిమ ఏడుస్తుంది. గుండెకు హోల్ పడిందని చెప్పనా? ఆపరేషన్ చేయకపోతే ప్రమాదమని చెప్పనా?.. అని కార్తీక్ బయటకు వెళ్తాడు. గాలి ఆడేలా చూసుకోండని చెబుతాడ. భగవంతుడా నా బిడ్డకు ఏమైంది.. నన్ను ఎందుకు శిక్షిస్తోన్నావ్.. పాత గుండెజబ్బు ఇలా తిరగబెట్టిందా? అని దీప బాధపడుతుంది.

    దస్తావేజుల మీద సంతకం పెట్టించుకునే తెలివి కాదు.. డబ్బులు వసూల్ చేయించుకోవడం తెలివి కూడా ఉండాలి అని రుద్రాణి తన మనుషులతో అంటుంది.. ఇంకా సమయం ఉంది కదా? ఒకటి రెండు రోజుల్లో ఏమైనా జరగొచ్చు కదా? అని పిల్లిగడ్డం గాడు అంటాడు. వారు అప్పు తీర్చాలని ఉందా? తీర్చకపోతేనే వాళ్లతో ఆట ఆడతాను.. ఆట, వేట కొనసాగాలంటే సర్‌ను వెళ్లి పట్టుకురండిరా.. ఆ సర్‌ని మర్యాదగా తీసుకురండి.. మిగతా కథ నేను నడిపిస్తాను.. సారు ఎక్కడున్నారు సర్.. అని రుద్రాణి అనుకుంటూ ఉంటుంది.

    నేను డాక్టర్‌ని.. డాక్టర్ కార్తీక్‌ని.. నా రౌడీని నేను రక్షించుకుంటాను.. డాక్టర్‌ని అయినా కూడా బిడ్డను రక్షించుకునేలా లేకుండా చేశావ్.. దేవుడా ఏంటి పరీక్షలు.. గ్రేట్ కార్డియాలజిస్ట్.. వైద్యం చేయలేను.. చేయించలేను.. ఆశ్రమంలో మమ్మీని డబ్బులు అడగాలి.. సీరియస్‌గా ఉంది.. రేపటిలోగా ఆపరేషన్ చేయించకపోతే బతకదు.. దేవుడివా శాడిస్ట్‌వా.. అని సైకిల్ మీద కార్తీక్ వెళ్తూ బాధపడుతుంటాడు.

    ఆశ్రమంలో వ్యక్తి చిరాకు పడతాడు. మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నారు.. అని అడుగుతాడు. నేను వాళ్లబ్బాయిని.. అని కార్తీక్ చెబుతాడు. మంచి కథే తీసుకొచ్చారు.. మీరు వాళ్ల అబ్బాయి..వాళ్లు మీ తల్లిదండ్రులు.. వాళ్లకు మీకు గొడవలు అయ్యాయ్.. మంచి కథే చెప్పారు అని ఆశ్రమంలోని వ్యక్తి అంటారు. మీరు డిస్టర్బ్ చేస్తున్నారే.. వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు..అని అసలు విషయం చెబుతారు. నా కూతురికి బాగా లేదు అని కార్తీక్ చెబుతాడు. ఏంటి ఆలోచిస్తున్నారు.. వెళ్లండి వెళ్లండి.. మీరు గొప్ప అవకాశవాదిలా ఉన్నారే.. ఇందులో నిజమెంతో అబద్దమెంతో దేవుడికే తెలియాలి అని ఆ వ్యక్తి అంటాడు.. దేవుడా ఇప్పుడు శౌర్యను ఎలా కాపాడుకోవాలి అని కార్తీక్ లోలోపల అనుకుంటాడు.. మీరు ఇలా అడుగుతారనే వాళ్లని పంపించి మంచి పని చేశాం.. అని ఆ వ్యక్తి అనుకుంటాడు.

    అత్తమ్మ ఏమైంది అని దీప బాధపడుతుంటుంది.. నాన్న ఏడమ్మ.. నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లరా అమ్మా.. మాట్లాడవేంటమ్మా అని శౌర్య అంటుంది.. నాన్న వస్తారు.. తీసుకెళ్తారు.. అని దీప అంటుంది. అమ్మా నాకు ఎలాగో అవుతోంది.. నాన్న డాక్టరే కదా? అమ్మా.. ఎక్కడికి వెళ్లారు.. అని శౌర్య అడుగుతుంది. నాన్న డబ్బుల కోసం అని హిమ చెప్పబోతోంటే దీప వారిస్తుంది..

    నాన్న వస్తున్నారు..చిన్న సమస్యే.. అని దీప చెబుతుంది. చిన్నది కాదు నాకు తెలుస్తుంది కదా అమ్మా.. నాన్నకు చెప్పి త్వరగా బాగు చేయమని చెప్పు.. నాన్న పెద్ద డాక్టర్ కదా.. డాక్టర్ అని చెప్పొద్దన్నారు కదా.. నాకు బాగవుతుందా? అని శౌర్య అడుగుతూ ఉంటుంది. నీకేం కాదు అత్తమ్మ.. అని దీప ధైర్యం చెబుతుంది. నాకేందుకో ఎలానోఉంది. శక్తి లేనట్టుగా.. డల్లుగా నొప్పిగా ఉందమ్మా.. లేచి నడుస్తానా? తమ్ముడితో ఆడుకుంటానా?.. అని శౌర్య బాధపడుతుంది.

    అత్తమ్మ నీకేం కాదు.. మేం ఉన్నాం కదా.. అని దీప అంటుంది. కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా? అని శౌర్య అంటుంది. నువ్ పెద్దింటి కోడలు.. డాక్టర్ కార్తీక్ భార్యవి అని సౌందర్య అన్న మాటలు దీప తలుచుకుంటుంది. ఎక్కడున్నారు కార్తీక్ బాబు అని దీప అనుకుంటూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్‌ని రుద్రాణి మనుషులు అడ్డుకుంటారు. కార్తీక్ ఎంత చెప్పినా వినిపించుకోరు. రుద్రాణి వద్దకు తీసుకెళ్తుంటారు. ఇక మరో వైపు నాన్నమ్మ, తాతయ్యలకు ఫోన్ చేయమని దీపకు హిమ సలహా ఇస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply