- January 26, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. నిజం తెలుసి గుండెబద్దలు.. దీప మౌన పోరాటం

కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే బుధవారం నాడు జనవరి 26న ప్రసారం కానున్న Karthika Deepam Episode 1259 ధారావాహికలో అంతా కూడా కార్తీక్, దీప, మోనితల మ్యాటరే జరిగింది. రుద్రాణి జాడ కూడా నేటి ఎపిసోడ్‌లో కనిపించలేదు. చిట్టీ డబ్బుల కోసం ఓనర్ దగ్గరకు దీప వస్తుంది. అదే సమయంలో అక్కడ ప్లేట్లు క్లీన్ చేస్తూ కార్తీక్ కనిపిస్తాడు. దీంతో దీప గుండె బద్దలవుతుంది. ఇక మరో వైపు ఆదిత్య మోనిత వాగ్వాదం జరుగుతుంది. అలా కార్తీకదీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
మీ నాన్న జాగ్రత్త అంటూ రుద్రాణి మనుషులు బెదిరించారంటూ దీపతో పిల్లలు చెబుతారు. మళ్లీ రుద్రాణి ఏదైనా ప్లాన్ వేసిందా? డాక్టర్ బాబుకు ఏదైనా ప్రమాదం తలపెడుతుందా? రుద్రాణే కాదు.. ఆ దేవుడే అయినా సరే ఎదురిస్తాను.. అని దీప అంటుంది. ఇక హెటల్‌లో భద్రం, అప్పిగాడు మాట్లాడుకుంటారు. బొంబాయ్‌లో అయితే కలెక్షన్లు అదిరిపోయేవి. అని భద్రం అంటాడు. పెట్టుబడి కూడా అదిరిపోయేది అని అప్పిగాడు కౌంటర్ వేస్తాడు.
సినిమాకు వెళ్లాలని అప్పిగాడు ప్లాన్ వేస్తాడు. సినిమాకు చెప్పి వెళ్లాలా? చెప్పకుండా వెళ్లాలి.. చెబితే వెళ్లనివ్వడు అని అప్పిగాడు అనుకుంటాడు. నీ షర్ట్ బాగుంది.. కాదు కాదు నువ్వే బాగున్నావ్.. అంటూ కార్తీక్‌ను కాకపడుతుంటాడు అప్పిగాడు. నాకు సినిమాకు వెళ్లాలని ఉంది.. నా పని కూడా నువ్వే చేయాలి..అని అసలు విషయం చెబుతాడు. రాత్రి అయితే పిల్లలు ఎదురుచూస్తారు అని కార్తీక్ అంటే.. ఇప్పుడే వెళ్తాను.. అని అప్పిగాడ వెళ్తాడు. ఎక్కడికిరా అని ఓనర్ అంటే.. మన పని కోసమే బావకు చెప్పాను అడగండి..అని అప్పిగాడు వెళ్లిపోతాడు.
ఏంటే మోనితే ఎంత అందంగా ఉన్నావే.. అయినా కార్తీక్ మనసు కరగదేంటి.. అంత ప్రేమించావ్.. అన్ని మెట్లు దిగావ్.. మిస్టేక్ ఎక్కడ జరిగింది మోనిత.. ఆలోచించు.. అని మోనిత తనలో తానే అనుకుంటూ ఉంటుంది. హేయ్ నువ్వా?.. రా రా.. ఏంటి సంగతులు భారతి.. అని మోనిత అడుగుతుంది. ఇక్కడ హాస్పిటల్ పెట్టడం ఏంటో.. ఎవ్వరికీ అర్థం కావు..అని భారతి అంటుంది.
ఎవ్వరికీ అర్థం కాకపోవడమే మోనిత.. ఇప్పుడిప్పుడే బస్తీవాళ్ల మనసులో స్థానం సంపాదిస్తున్నాను.. అని మోనిత అంటుంది. నీకు నీదే క్లారిటీ లేదు.. కష్టాలు పడతావ్.. వాటిని కష్టాలుగా ఫీలవ్వవు.. ఓ లక్ష్యం లేదు..అని భారతి అంటుంది. నాకు మూడు లక్షాలున్నాయ్.. కార్తీక్ కార్తీక్ కార్తీక్.. అని అంటుంది. పాపం కార్తీక్‌కు అలా జరగడం ఏంటి అని భారతి అంటుంది.
నీకు నామీద జాలి ఉందా? కార్తీక్ మీద జాలి ఉందా? అని మోనిత అడుగుతుంది. ఆపరేషన్ చేసేవరకు బాగానే ఉన్నాడట.. సడెన్‌గా కళ్లు తిరిగినట్టు అయిందట.. అని భారతి నాటి విషయం గురించి చెబుతూ ఉంటుంది. జాబ్ పోతే.. డిప్రెషన్‌లో ఉంటే నా దగ్గరకు వస్తాడని అనుకున్నా కానీ ఇలా మొత్తానికి కనిపించకుండా పోయాడు అని మోనిత అనుకుంటుంది. ఆపరేషన్‌కి ముందూ వెనక డీటైల్డ్‌గా చెబుతున్నావ్.. ఇంకేమైనా తెలుసా? అని మోనిత అడుగుతుంది. దీంతో భారతికి అనుమానం వస్తుంది. కొంపదీసి కార్తీక్‌కి అంటూ భారతి ఆరా తీస్తుంది. నేనేం చేయలేదంటూ మోనిత బుకాయిస్తుంది. నీ క్రిమినల్ బ్రెయిన్ గురించి నాకు తెలుసు.. అని భారతి అంటే.. కార్తీక్ మీద నాకు ఎంత ప్రేముందో నీకు తెలీదా?..అని మోనిత కవర్ చేస్తుంది.
ఆనంద్ మనకేంటి ఈ కష్టాలు.. బంగారమ్మా చీటి ఇచ్చేలా లేదు.. నువ్వొచ్చాక కష్టాలు ఈజీగానే అనిపించాయి.. అలవాటైనట్టున్నాయ్.. చీటి డబ్బులు వస్తే కొన్ని సమస్యలైనా తీరుతాయ్.. పెద్దయ్యాక.. డాక్టర్ బాబులా ను్ డాక్టర్ అవ్వాలి..మీ ఇద్దరూ తెల్లకోటులో చూడాలి.., అలా చూసి చాలా రోజులు అవుతుంది.. మీ ఇద్దరూ ఒక్క జట్టే కదా? దొంగవిరా నువ్.. ఇన్ని కష్టాలున్నా కూడా చిరునవ్వుతో మాట్లాడుతున్నా అంటూ ఇలా ఆనంద్‌తో మాట్లాడుకుంటూ దీప నడుచుకుంటూ వెళ్తుంది. దారిలో అప్పారావ్ కనిపిస్తాడు. హోటల్‌లో పని చేసే జూనియర్ అంటూ కార్తీక్ ఫోటో చూపించబోతాడు. కానీ దీప చూడదు.
ఆదిత్య బాగున్నావా? అంటూ మోనిత పలకరిస్తుంది. హలో వదిన అని పలకరించవా? అని మోనిత అంటుంది. షటప్ మోనిత.. నువ్ నా వదినేంటి..అని ఆదిత్య విసుక్కుంటాడు. కార్తీక్ అన్న అయితే.. నేను వదినే కదా?.. అని మోనిత మళ్లీ అంటుంది. నాకు అసలే కోపం ఎక్కువ.. అని ఆదిత్య అంటాడు. నువ్ నా మరిదివే కదా? కోప్పడు అని అంటుంది మోనిత..
నన్ను ఇరిటేట్ చేయోద్దు.. అని ఆదిత్య అంటాడు. ఎందుకు ఇరిటేట్ అవుతావ్.. అత్తమామయ్యలు బాగున్నారా? మా చెల్లెలు శ్రావ్యను అడిగాను అని చెప్పు.. కార్తీక్ ఎక్కడున్నారో చెప్పు.. నా మీద జాలి వేయడం లేదా?.. అని మోనిత అంటుంది. నీ మూలంగానే ఇదంతా జరిగింది అని ఆదిత్య అంటే.. మొదట నాకు కార్తీక్ ఐ లవ్యూ చెప్పాడు.. అని మోనిత అంటుంది. షటప్ మోనిత.. జస్ట్ షటప్.. ఇంకొక మాట మాట్లాడితే.. అని ఆదిత్య విరుచుకుపడతాడ. నీకు వంద నమస్కారాలు.. మా ఫ్యామిలీ జోలికి రాకు.. అని ఆదిత్య అంటాడు. కార్తీక్ ఎక్కడున్నాడో చెబితే.. నీకు వంద నమస్కారాలు.. పెడతాను అని అంటుంది మోనిత. మనిషికో మాట.. అని ఊరికే అనలేదంటూ అక్కడి నుంచి ఆదిత్య వెళ్లిపోతాడు. కార్తీక్ లేని మోనిత ఎలా బతుకుతుందో.. నీకు కొత్త ఫోన్ ప్రాప్తిరస్తు.. అంటూ ఆదిత్య ఫోన్‌ను కారుతో తొక్కిపడేస్తుంది.
హోటల్‌లో అంతా కార్తీక్ ఒక్కడే చూసుకుంటాడు. ఆలస్యం అవుతోందని ఒక కస్టమర్ అంటే.. వేడివేడిగా తెస్తున్నాను.. ఐదు నిమిషాలు లేటు అయినా ప్రశాంతంగా తినాలి.. అని సర్ది చెబుతాడు. ఇలా కార్తీక్ పనితనం చూసి భద్రం సంబరపడిపోతాడు. ఆనందు నువ్వొచ్చాక సమస్యలు వస్తున్నాయ్ ఇలా పోతున్నాయి.. ఓనర్ గారు చీటి ఇప్పిస్తాను అని అన్నారు.. అని మరో వైపు దీప హోటల్ వద్దకు వస్తుంది. రత్తయ్య గారింటికి పార్శిల్ అని కార్తీక్ వెళ్తుంటే దాన్ని భద్రం తీసుకుంటాడు. నేను ఇచ్చి వస్తాను.. నువ్వే హోటల్లో పని చూసుకో అంటాడు. అదే సమయంలో దీప వస్తుంది. రత్తయ్యకు పార్శిల్ ఇస్తాను అని దీప అంటుంది. వద్దమ్మా.. హోటల్లో కూర్చో నేనే వెళ్లొస్తాను అని భద్రం అంటాడు.
ఇక అక్కడ ప్లేట్లు తీస్తున్న కార్తీక్‌ని చూసి దీప గుండె బద్దలవుతుంది. ఏమండి అని ఏడ్చేస్తుంది. కాలర్ పట్టుకుని నిలదీస్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్ మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా దీప మాట్లాడదు. మౌన పోరాటం చేస్తుంటుంది.