• January 24, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. వడ్డీ డబ్బుల కోసం నానాతంటలు.. నిజం తెలుసుకున్న కార్తీక్

Karthika Deepam నేటి ఎపిసోడ్.. వడ్డీ డబ్బుల కోసం నానాతంటలు.. నిజం తెలుసుకున్న కార్తీక్

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 24న సోమవారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Episode 1257 ధారావాహికలో వడ్డీ డబ్బుల కోసం కార్తీక్, దీప తెగ కష్టపడతారు. ఇళ్లంతా వెతికినా కూడా డబ్బులు సరిపోవు. రుద్రాణేమో వడ్డీ డబ్బులు కడితే గానీ రంగారాజును ఇవ్వను అని చెబుతుంది. అలా మొత్తానికి దీప వడ్డీ డబ్బులు తెచ్చేస్తుంది. అలా కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగుతుంది.,

    రాక్షసి వడ్డీ కట్టలేదని పిల్లాడిని ఎత్తుకెళ్తుందా.. వడ్డీ డబ్బులు ఇచ్చేసి ఆనంద్‌ను తీసుకొస్తాను.. ఎంత ఏడుస్తున్నాడో ఏమో.. అని దీప అనుకుంటూ ఉంటుంది. ఇళ్లంతా వెతుకుతుంది. మొత్తం మూడు వేలున్నాయి..అని తెలుస్తుంది. ఇంకా నాలుగు వేలు కావాలని హోటల్ యజమానిని అడుగుతాను.. ఇస్తాడో లేదో తెలీదు.. అని దీప అనుకుంటూ వెళ్తుంది.

    ఇక రుద్రాణి పగలబడి నవ్వుతుంటే.. అర్థం కాక చూస్తుంటారు రౌడీలు. ఎందుకు నవ్వుతున్నానో అర్థం కావడం లేదా?.. అని రుద్రాణి అంటుంది. ఇంతకు ముందు వాళ్లు ఏం చేసేవారో నాకు తెలీదు కానీ ఆత్మ గౌరవం కుప్పకుప్పలుగా ఉంది.. వడ్డీ డబ్బులకే ఇంత తిరుగుతున్నారు.. దీప వచ్చి నాలుగు మాటలు మాట్లాడింది వెళ్లింది. ఇంత వరకు రాలేదు.. ఈ నెల కడుతుందని అనుకుందాం.. తరువాత నెల సంగతి ఏంటి.. తిరిగి తిరిగి విసుగొచ్చి.. రంగరాజును మీరే తీసుకోండి.. అని అప్పిజెప్పుతారు.. వడ్డీ వస్తుంది.. రంగరాజు వస్తాడు.. రంగరాజు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది.. మనిషి సంతోషం వస్తే ఏం చేస్తాడు.. నవ్వుతాడు.. అందుకే నవ్వుతున్నానురా.. అని రుద్రాణి అంటుంది.

    ఇక హోటల్ యజమాని భద్రం వద్దకు దీప వస్తుంది. నాలుగు వేలు అడ్వాన్స్ ఇవ్వండి.. జీతంలో కట్ చేసుకోండని అడుగుతుంది. చాలా అవసరం ఉందండి.. అని దీప అంటుంది. వంటలు రుచికరంగా చేస్తోంది.. పనోళ్లు దొరకరు.. ఈ అమ్మాయిని వదులుకోవద్దు.. అని భద్రం ఆ డబ్బులను ఇస్తాడు. సంతోషమండి.. అడగ్గానే ఇచ్చారు థ్యాంక్స్.. అని అంటుంది. ఇక సౌందర్య, ఆనంద్ రావులు తన గురించి ఆరా తీసిన విషయాన్ని చెబుతాడు. దీంతో దీప ఆనంద పడుతుంది. అత్తయ్య వాళ్లు వచ్చి ఉంటారా?.. అని సంతోషిస్తుంది.

    ఆశ్రమం వాళ్లకు వచ్చిన వారికి ఏదో ఒక సమస్య ఉంటుంది కదా? అని కూరగాయాలు అమ్మే వ్యక్తి అన్న మాటలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. వాళ్లు ఇక్కడకు ఎందుకు వచ్చారో ఎలా తెలుస్తుంది.. అని కార్తీక్ అనుకుంటాడు. ఇక మహాలక్ష్మీ అసలు విషయాన్ని చెబుతుంది. దీంతో రుద్రాణి వద్దకు వీరావేశంగా కార్తీక్ వెళ్తాడు. అత్తయ్య మామయ్యలు కాఫీ రుచి చూసి నన్ను గుర్తు పట్టారా? నేనేంట ఎంత ప్రేమ మీకు.. ఆ హోటల్ ఓనర్ అబద్దం చెప్పి మేలు చేశాడా?కీడు చేశాడా?.. ఈ సారి భోజనం చేసి పంపిస్తాను అని దీప అనుకుంటుంది.. పసివాడి మీద జాలి కూడా లేకుండా పోయింది రాక్షసి..అని దీప అనుకుంటుంది.

    ఇక పిల్లాడు ఏడుస్తూ ఉంటే.. మీరు ఇకపై జోల పాటలు నేర్చుకోండిరా అని రుద్రాణి తన మనుషులకు చెబుతుంది. రుద్రాణి నువ్ మనిషివేనా?.. అని కార్తీక్ ఫైర్ అవుతాడు. వచ్చీ రాగానే తిట్టడమేనా? కుశల ప్రశ్నలు అడగరా? అసలు చెల్లించడం లేదు.. వడ్డీ డబ్బులైనా లేదు.. ఆస్తులు జప్తు చేస్తాం.. అవి లేవు కాబట్టి.. రంగరాజును తీసుకొచ్చాను.. వడ్డీ తెచ్చి రంగరాజును విడిపించుకోగలరు..నాకు ఓపిక చాలా తక్కువ సారు.. దీపమ్మ వచ్చింది.. తిట్టింది వెళ్లింది.. నాకు డబ్బులు కావాలి.. తిట్లు కాదు.. అని రుద్రాణి అంటుంది.

    ఇది కరెక్ట్ కాదు అని కార్తీక్ అంటాడు. అవును కానీ డబ్బు పాపిష్టిది అని రుద్రాణి చెబుతుంది.. బాబు ఏడుస్తున్నాడు..పాలు పట్టించు.. అని పిల్లి గడ్డంగాడికి చెబుతాడు కార్తీక్. వాడేమో రుద్రాణి పర్మిషన్ అడుగుతాడు. నా మనుషులు అలానే ఉంటారు.. బాబుకు పల్లు పట్టించురా అని చెబుతుంది రుద్రాణి. వెళ్లి డబ్బులు తీసుకురండి.. తెస్తారన్నా నమ్మకం నాకు లేదు.. అని రుద్రాణి అంటుంది.

    ఇక ఇంట్లో తమ్ముడు లేడేంటి? అని హిమ, శౌర్యలు అనుకుంటారు. పక్కన ఉన్న ఆంటీకి తమ్ముడిని ఇచ్చి వెళ్లి ఉంటే బాగుండేది.. వాడితో ఆడుకునేవాళ్లమని అంటార. అసలు మనం ఇక్కడకు ఎందుకు వచ్చాం.. మనం ఫోన్‌లు ఎందుకు వాడటం లేదు.. ఎవరికీ ఎందుకు చెప్పడం లేదు.. డాక్టర్ అని ఎందుకు చెప్పడం లేదు..అని హిమ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు.. అవసరం లేనివి మనకు ఎందుకు.. అడిగితే బాధపడతారు.. అని శౌర్య అంటుంది.

    వడ్డీ కడితే సరిపోదు..అసలు సమయం గడుస్తుంది.. మొత్తం బాకీ ఇస్తేనే ఒప్పుకుంటాను.. లేదంటే.. రంగరాజును తీసుకుంటాను.. ఇళ్లు కూడా తీసుకుంటాను.. అప్పటికి కూడా నా మనసుకు సరిపోదనిపిస్తే ఇద్దరి పిల్లల్లో ఒక్కరిని అని రుద్రాణి అంటుంది. దీంతో దీప అరిచేస్తుంది. రుద్రాణి అంటూ ఫైర్ అవుతుంది… చెల్లించాల్సిన అప్పు తీర్చు.. తరువాత అరిచేవ్.. గడువు గుర్తు పెట్టుకో.. ఈ రుద్రాణి మంచిది కాదు అని ఎందుకు అనుకుంటారో.. గడువు తీర్చాక తెలుస్తుంది.. ప్రస్తుతానికి వెళ్లిరా.. దీప.. పిల్లలు జాగ్రత్త.. అని రుద్రాణి చురకలు అంటిస్తుంది.

    అడుగుతున్నాను అని ఇలా అనుకోవద్దు.. నాకు ఒక ఆరువేలు అడ్వాన్స్ ఇవ్వండి అని భద్రంను కార్తీక్ అడుగుతాడు. వంట మనిషి వచ్చి నాలుగు వేలు.. నువ్వెమో ఇలా.. ఇద్దరూ కూడబలుక్కుని అడుగుతున్నారా?.. మంచితనం అంతా కూడా నీ మొహంలోనే కనబడుతోంది..నీకు ఇవ్వకుండా ఉండలేను.. మరీ ఆరువేలు అడ్వాన్స్ ఏందయ్యా.. నేను ఇవ్వను కానీ ఎందుకు ఇవ్వాలనిపిస్తోంది.. ఇదే ముంబైలో అయితే.. అని భద్రం అంటాడు. ఇది ముంబై కాదు కదా? సర్.. అని కార్తీక్ అనడంతో భలే జోక్ వేశావయ్యా అని అంటాడు భద్రం.

    బాబును పట్టుకుని దీప రావడం చూసి పిల్లలు సంతోషిస్తాడు. తమ్ముడి కోసమే ఎదురుచూస్తున్నాం.. ఎక్కడికెళ్లావ్ అమ్మా.. తమ్ముడితో ఆడుకుంటాం అని అంటారు. ఇక ఇంతలో మహాలక్ష్మీ వస్తుంది.. మనం భయపడిందంతా జరిగింది కదా? ఆ రుద్రాణికి ప్రేమ, మానవత్వం అనేవీ తెలియదు.. డబ్బు పిచ్చిది అని అంటుంది. ఒక్కతే ఉంటుంది.. డబ్బేం చేసుకుంటుంది.. సంతకం కూడా పెట్టాం.. అయినా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.. పిల్లాడిని ఎత్తుకెళ్లిందంటే అది ఎంత దుర్మార్గురాలో తెలుస్తోంది.. అని దీప అంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్‌కి అసలు విషయం తెలుస్తుంది. హోటల్‌లో పని చేసేది దీపేనని అర్థమవుతుంది. మరి కార్తీక్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

    Leave a Reply