• January 20, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. మనసులు ఒకటే ఆలోచన ఒకటే.. మథనపడ్డ కార్తీక్, దీప

Karthika Deepam నేటి ఎపిసోడ్.. మనసులు ఒకటే ఆలోచన ఒకటే.. మథనపడ్డ కార్తీక్, దీప

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం నాడు అంటే జనవరి 20న ప్రసారం కానున్న Karthika Deepam Episode 1254 ధారావాహికలో గుండెలు చిదిమిసేలా ఎమోషనల్ సీన్లు పడ్డాయి. తల్లిదండ్రుల కోసం కార్తీక్ పడే ఆరాటం.. అత్త మామలను చూసి కూడా పలకరించలేని స్థితిలో ఉన్నానని దీప కంటతడి పెట్టడం వంటి సీన్లతో కార్తీక దీపం నేటి ఎపిసోడ్ అంతా కూడా ఎమోషనల్‌గానే సాగింది.

    ఇంటికి వచ్చిన దీప చుట్టూ పిల్లలు చేరతారు. కానీ దీప మాత్రం తాను అలిసిపోయాను అని డల్లుగా ఉంటుంది. ఏం జరిగిందమ్మా అని అడిగినా కూడా చెప్పదు. ఆనంద్‌ను తీసుకోని ఆడించండి నేను అలిసిపోయాను అని చెబుతుంది దీప. డాడీ కూడా ఇలానే మనసు బాగా లేదని అన్నారు అని పిల్లలు చెబుతారు. డాక్టర్ బాబు వచ్చారా? అని దీప అంటుంది.

    వచ్చారు.. గ్యాస్ బిగించారు.. వెళ్లారు అని పిల్లలు చెబుతారు. ఆయన గ్యాస్ ఎక్కడి నుంచి తెచ్చారు.. ఏం చేస్తున్నారు అని దీప ఆలోచిస్తుంటుంది. అత్తమామలను చూశాను అని చెప్పాలా? వద్దా? చెప్పి బాధపెట్టడం అవసరమా? అని దీప ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక మరో వైపు కార్తీక్ ఆశ్రమానికి వెళ్తుంటాడు. అమ్మానాన్నలకు ఈ గతి పట్టడానికి తానే కారణమని బాధపడుతుంటాడు కార్తీక్.

    అయితే లోపలకు వెళ్లేందుకు అక్కడ అనుమతించారు. వారు మీకేం అవుతారో చెబితే.. వాళ్లను అడుగుతాను.. వాళ్లు రమ్మని చెబితే పంపిస్తాను అని అంటాడు. చివరకు కొడుకుని అని చెప్పుకోలేని హేయమైన స్థితిలోకి వచ్చానా? అని అనుకుంటాడు కార్తీక్. హోటల్ నుంచి భోజనం తెచ్చింది నువ్వే కదా? అని గుర్తు పడతాడు. వారేదో ప్రశాంతత కోసం వచ్చారు.. వాళ్లను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు.. ఇంతకు ముందు కూడా ఒకావిడ వచ్చింది అని చెబుతాడు. ఆమె ఎవరు అని కార్తీక్ అడిగితే.. అలాంటివి చెప్పకూడదని అంటాడు.

    అలా మొత్తానికి కార్తీక్ వెనుదిరిగి వెళ్తాడ. ఇక మరో వైపు కోటేశ్ గురించి మోనిత ఆలోచిస్తుంది.. నువ్వు ఎవడ్రా.. నా ఆనంద్‌ను ఎత్తుకెళ్లావ్.. నా కార్తీక్ లేడని నీ మీద ఫోకస్ పెట్టడం లేదు.. నేను ఫోకస్ పెడితే.. భూమండలంలో ఎక్కడున్నా కూడా కనిపెడతాను.. అని అనుకుంటుంది. అత్తమామలు అక్కడికి ఎందుకు వెళ్లారు.. ఆ ఇంట్లో ఏం జరుగుతోంది.. ఒక వేళ ఆనంద్ రావు గారు చనిపోతే.. కార్తీక్ వస్తాడు.. అప్పుడు నేను కలుస్తాను.. ఎంతైనా నేను కూడా నా ఇంటి కోడలినే..

    అయితే అప్పుడు కార్తీక్ బిడ్డ గురించి అడిగితే ఏం చేయాలి అని ఆలోచిస్తుంది.దీపి పిల్లల కోసం మొగుడ్ని వదిలేసింది.. నేను పిల్లలను వదిలేసి మొగుడి కోసం ఆలోచిస్తున్నాను. దీప కంటే నాకే ఎక్కువ ప్రేమ ఉంది అని మోనిత అనుకుంటుంది.. బుల్లి ఆనంద్ రావుని ఎత్తుకెళ్లిన వాడిని పట్టుకోవాల్సిందే.. నా ఆస్తి మొత్తం పోయినా పర్లేదు.. ఆనంద్ రావు గారు ఎక్కడున్నారు.. మీ కోసం ఈ అమ్మ వచ్చేస్తుంది.. అని మోనిత అంటుంది.

    బయటకు వెళ్లి అలా నడిచొద్దామా? అని సౌందర్యను ఆనంద్ రావు అడుగుతాడు. వద్దండి చలిగా ఉంది. మీకు పడదు అని సౌందర్య అంటుంది. శరీరానికి పడదు.. మనసుకి అన్నీ పడతాయి.. అన్నీ ఓర్చుకుంటాం. కార్తీక్ నా గుండెల మీద పడుకునేవాడు.. జ్ఞాపకంగా నా గుండెల్లోనే ఉండిపోయాడు.. ఎక్కడికోపోయాడు.. పిల్లలను దూరం చేసుకోవడం కంటే దురదృష్ణకరం ఇంకోటి ఉండదు అని ఆనంద్ రావు బాధపడుతూ ఉంటాడు.

    హోటల్ నుంచి భోజనం తెప్పించమంటారా? అని ఆశ్రమంలో పని చేసే వ్యక్తి వచ్చి సౌందర్య, ఆనంద్ రావులను అడుగుతాడు. ఇంతకు ముందు తెచ్చిందే తినలేదు.. రేపు ఆశ్రమంలోనే తింటాను.. అని అంటాడు ఆనంద్ రావు. ఆవిడ మళ్లీ వచ్చిందా? రుద్రాణి అంత మంచిది కాదు..అని చెప్పి వెళ్లిపోతాడు. అమ్మానాన్నలను చూసిన విషయంలో దీపకు చెబుదామా? వద్దా? అని డాక్టర్ బాబు.., అత్తమామలను చూసిన విషయం చెప్పాలా? వద్దా? అని దీప ఇద్దరూ ఒకేరకంగా ఆలోచించుకుంటారు.

    ఇక తాను ఆశ్రమంకు వెళ్లిన సంగతి దీప చెబుతుంది. రుద్రాణిని ఎవరో కొట్టారట.. చూసేందుకు వెళ్లాను.. కానీ కనిపించలేదు.. నిజంగా ఆమె మహానుభావురాలు.. కాళ్లకు దండం పెట్టాలి అని అంటుంది దీప. గ్యాస్ సిలిండర్ ఎక్కడిది అని దీప అడుగుతుంది. ఎరువుల కొట్లో ఉందని డాక్టర్ బాబు అబద్దం చెబుతాడు. ఏంటి ఇలా దీపకు అబద్దాలే చెబుతున్నాను అని డాక్టర్ బాబు అనుకుంటాడు.

    హోటల్‌లో పని చేస్తున్నానని ఆయన దగ్గర దాచి అబద్దాలే చెబుతున్నాను.. ఆ వేడి నాకు పడదని మళ్లీ వద్దంటారు.. బాధపడతారు అని డాక్టర్ బాబు గురించి దీప ఆలోచిస్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో రంగరాజుని రుద్రాణి ఎత్తుకొస్తుంది. డబ్బులు కట్టి తీసుకెళ్లండని దీపకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఏం చేయలేక వెనక్కి వెళ్లిపోతుంది దీప.

    Leave a Reply