• January 12, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. రుద్రాణికి చిక్కిన దీప.. హోటల్‌లో సర్వర్‌గా మోనిత ఎదుట కార్తీక్!

Karthika Deepam నేటి ఎపిసోడ్.. రుద్రాణికి చిక్కిన దీప.. హోటల్‌లో సర్వర్‌గా మోనిత ఎదుట కార్తీక్!

    కార్తీక దీపం ఈ రోజు సీరియల్ అంటే బుధవారం నాటి Karthika Deepam Episode 1247 ధారవాహికలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వచ్చాయి. బిడ్డ ఏడుపు విని మోనిత తల్లడిల్లిపోయింది. ఇక మరో వైపు చీటి డబ్బుల కోసం దీప ప్రయత్నాలు చేస్తుంది. కానీ మళ్లీ రుద్రాణి చేతికే చిక్కేసింది. ఇంకో వైపు కార్తీక్ సర్వర్‌గా పని చేస్తున్న హోటల్‌లోనే మోనిత భోజనానికి వచ్చింది. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ మాత్రం మంచి రసవత్తరంగా సాగింది.

    ఆదిత్య కాఫీ అంటూ శ్రావ్య ఇస్తుంది.. మమ్మీ వాళ్లు లేచారా కాఫీ ఇచ్చావా అని అలవాటులో పొరబాటుగా అడుగుతాడు. ఓ వాళ్లు వెళ్లారు కదా. మరిచిపోయాను అని ఆదిత్య అంటాడు.. ఏంటి ఆదిత్య.. మామయ్య గారి ఆరోగ్యం గురించే కదా వెళ్లింది అని శ్రావ్య అంటుంది.. ఒకప్పుడు అందరూ కళ్లు కుట్టేలా ఆనందంగా ఉన్నాం.. అన్నయ్య వదిన పిల్లలం, మనం, మీ అమ్మనాన్న ఎంతో సరదాగా ఉన్నాం.. దేవుడు నాకు మంచి ఫ్యామిలీ, కావాల్సినవన్నీ ఇచ్చాడని అనుకన్నాం.. సునామీ వచ్చి చెల్లాచెదురైనట్టు.. అన్నయ్యవదిన పిల్లలు ఎక్కడికి వెళ్లారో తలీదు.. అమ్మానాన్న వెళ్లాం.. నువ్వూ నేనూ దీపుగాడే మిగిలాం.. ఏం చేయాలి శ్రావ్య.. అని ఆదిత్య బాధపడుతుంటాడు. అన్నీ సర్దుకుంటాయ్.. ఇలా బాధపడతామనే అమ్మానాన్నలను పిలవమన్నారు..టెన్షన్ పడకు ఆదిత్య..అని శ్రావ్య ఓదార్చుతుంది.

    రోడ్డు మీద ఫోన్‌లో ప్రియమణి ఫోటో చూస్తూ మోనిత తనలో తాను మాట్లాడుకుంటుంది మోనిత. వెళ్లినప్పటి నుంచి అతీగతీ లేదు.. కార్తీక్ అయ్య పార్టీలో చేరావా? దీప అంటే నీకు అభిమానం కదా?.. నువ్ ఎక్కడున్నా పట్టుకుంటాను అని ఊర్లో జనాలందరినీ మోనిత అడుగుతూ ఉంటుంది. ఇంతలో దీప వెనకాల నుంచి వెళ్లిపోతుంది. బాబు గట్టిగా ఏడ్చేస్తాడు.

    ఆ ఏడుపు విని మోనిత ఉలిక్కి పడుతుంది. పాపం ఎవరో పిల్లాడు ఏడుస్తున్నాడు.. నా ఆనంద్ రావు కూడా ఇలానే ఏడ్చేవాడు.. పాపం ఎవరో ఆ తల్లి.. అస్పలు పట్టించుకోవడం లేదేంటి.. అని ఆ చుట్టూ వెతుకుతుంది మోనిత. ఏమైంది నాన్నా ఇప్పటి వరకు బాగానే ఉన్నావ్ కదా? సడెన్‌గా ఏడుస్తున్నావ్ ఏంటి.. అని దీప ఆ పిల్లాడి ఊకోబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. నా ఆనంద్ రావు ఎక్కడున్నాడో ఏంటో.. ఎవరో ఏడుస్తుంటేనే నాకు ఎందుకు ఇంత బాధగా ఉంది.. ఆకలేస్తోంది.. అసలు ఇక్కడ హోటల్ ఉందో లేదో.. అని మోనిత అనుకుంటుంది.

    హోటల్‌లో ప్లేట్లు తీయకుండా తన డాక్టర్ ప్రెసిడెంట్ సన్మానాన్ని గుర్తు చేసుకుంటాడు కార్తీక్. హోటల్ క్లీన్‌గా ఉండాలి కదా? ఆ ప్లేట్లు తీయ్.. ఏం చదువుకున్నావయ్యా.. పని చేసేందుకు సిగ్గు పడుతున్నావా? అని హోటల్ యజమాని అంటాడు. పని చేయకపోతేనే సిగ్గుపడాలి.. డిగ్నిటి ఆఫ్ లెబర్.. అంటే ఏంటి అని అడుగుతాడు.

    చేసే పని పట్ల గౌరవం, పనే దైవం..అని కార్తీక్ చెబుతాడు. చదువుకున్నవాడిలా.. పెద్దింటిలా వాడిలా కనిపిస్తున్నావ్..అని హోటల్ యజమాని అంటాడు. రేపటి నుంచి అలా కనిపించనులే అని కార్తీక్ అంటాడు. ఏంటయ్యా అలా అంటున్నావ్.. అలా కనిపిస్తే ఉద్యోగంలోంచి తీసేస్తారని అలా అన్నాను అని కార్తీక్ అంటాడు. ఆకలి అన్నీ నేర్పిస్తుంది.. బొంబాయ్, తాడికొండలో ఆకలి ఒకటే కదా? అని అంటాడు కార్తీక్.

    చూడబోతే పౌరుషం కూడా బాగానే ఉన్నట్టుంది.. అని హోటల్ యజమాని అంటాడు. పని శ్రద్దగా చేస్తున్నాడులే.. పౌరుషం ఉన్నా కూడా బాగానే చేస్తున్నాడు. కొన్ని మీల్స్ పార్సిల్ చేయాలి.. అని హోటల్ యజమాని అంటాడు. నేనా? అని కార్తీక్ అంటాడు. ఏ వెళ్లవా? అని హోటల్ వాడు అంటాడు. నడుచుకుంటూ వెళ్లాలా? అని అడుగుతాడు.. నడుచుకుంటూ వెళ్లమంటానా? అక్కడ చూడు అని అంటాడు. అక్కడ బైక్ కనిపిస్తుంది.. మోటార్ సైకిల్ కాదు.. సైకిల్ మీద అని అంటాడు. ఏ వెళ్లవా? పార్శిల్ ఆర్డర్స్ చాలా ఉన్నాయ్.. అని చెబుతాడు.

    ఇక పక్క ఊర్లోకి వెళ్లిన దీప..చీటి గురించి కష్టాలు పడుతుంది. నీ దగ్గరేముందని చీటి అడుగుతున్నావ్.. ఏం లేదు.. నీది ఆ ఊరుకాదు.. ఎలా ఇవ్వాలి.. ఎలా నమ్మాలి అని అంటుంది. అందుకే అబద్దాలు చెప్పకుండా అన్నీ నిజాలే చెబుతున్నాను అని దీప అంటుంది. నిజాయితీ ఉంటే సరిపోదు కదమ్మా.. ఎవరైనా షూరుటీ ఇవ్వాలి.. అని అంటుంది. నా గుర్తింపు కార్డులన్నీ మీకు ఇస్తాను.. అని దీప అంటుంది.

    అబద్దాలు చెప్పకుండా నిజాలు చెప్పావ్ కదా? అక్కడే పడిపోయాను.. పిండి వంటలు అంటున్నావ్.. డబ్బులు సరైన టైంకి వస్తాయా?.. అని అంటే.. ప్రతీనెలా కడతాను అని దీప అంటుంది. పిండి వంటలు అమ్మే దీప వచ్చింది.. అంటూ మళ్లీ రుద్రాణికే ఫోన్ చేస్తుంది. అలా మరోసారి రుద్రాణి చేతికి దీప చిక్కినట్టు అయింది. ముందు చీటి రాయించు ఎలా చించేయాలో నేను ఆలోచిస్తాను..అని రుద్రాణి అంటుంది. రుద్రాణక్క చెబితే తప్పదు కదా?..అని చీటి రాస్తుంది.

    హోటల్‌లో కార్తీక్ చక్కగా పని చేస్తుంటాడు. అందరితో నవ్వుతూ వడ్డిస్తాడు. ఇదంతా చూసిన యజమాని.. ఏమో అనుకున్నాను.. మనోడు పని మంతుడు.. పార్సిల్ కట్టావా? అని కార్తీక్‌ను అడుగుతాడు. ముందే కడితే చల్లారిపోతాయ్.. వెళ్లేటప్పుడే కడతాను అని కార్తీక్ అంటాడు. అవును నిజమే.. వెళ్లు కట్టేయ్.. నీలాంటోడు నా పక్కన ఉంటే ఇంకో హోటల్ పెడతాను చూడు.. పని బాగా చేస్తున్నావ్ బాబు నువ్ పైకొస్తావ్.. అని కార్తీక్‌తొ యజమాని అంటాడు.

    ప్రకృతి వైద్య శాలలో సౌందర్య తమ పరిస్థితిని తలుచుకుంటూ బాధపడుతుంది. జీవితం ఎంతో విచిత్రమైంది.. ఆకలి ఉన్న వాళ్లకు అన్నం దొరకదు.. అన్నం ఉన్న వాళ్లకు ఆకలేయదు.. అన్నీ ఉన్నా కార్తీక్ దీప బయటకు వెళ్లారు.. వాళ్లను తలుకుని ఆయన ఇలా అయిపోయారు.. నాకు ఈ సర్వేశ్వరుడు ఇలాంటి పరీక్ష పెట్టాడేంటో..

    మహేష్ ఎక్కడి వరకు వచ్చాడు.. ఓసారి ఫోన్ చేద్దామని మహేషుకు ఫోన్ చేస్తుంది. సరిగ్గా వెతుకున్నావా? బాబు.. నీకు పుణ్యం ఉంటుంది.. డబ్బులు సరిపోకపోతే మళ్లీ అడుగు.. అని సౌందర్య బాధపడుతుంది. తాడికొండకు వచ్చామని సౌందర్య అంటే… అక్కడంతా వెతికాను కానీ ఆ ఊర్లో కూడా లేరు అని మహేష్ బాబు చెబుతాడు.. కాస్త శ్రద్దగా వెతుకు అని సౌందర్య అంటే.. మీరు అలా అనకండి మేడం అని మహేష్ అంటాడు.. భగవంతుడా మా వాళ్లను నాకు కనిపించేలా చేయ్..అని సౌందర్య బాధపడుతుంది.

    హోటల్‌లో మరో కొత్త కారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. నా పేరు అప్పారావ్.. అంటూ కార్తీక్ ముందు పోజులు కొడతాడు. నేను నీకు సీనియర్ అని బిల్డప్ ఇస్తాడు. నన్ను కొందరు అప్పు అని ప్రేమగా పిలుస్తారు.. చాలా మంది.. అని గ్యాప్ ఇవ్వడంతో అప్పిగా అంటారా? అని కార్తీక్ సెటైర్ వేస్తాడు. అబ్బో చాలా ఫాస్ట్‌గా ఉన్నావే అని అంటాడు.. రాబోయే తరానికి కాబోయే స్టార్.. నువ్ నన్ను అప్పు అని పిలవొచ్చు.. నిన్ను బావ అంటాను.. షార్ట్ కట్.. అప్పుగాడంతే.. నేను ఎవరి అంచనాలకు అందను.. అని ఓవర్ యాక్షన్ చేస్తాడు.

    అప్పిగా ఎక్కడ చచ్చావ్‌రా.. కస్టమర్స్ వచ్చారు చూడు అని అంటాడు. వెళ్లు నువ్ జూనియర్ కదా? అంటాడు. కానీ వచ్చింది మోనిత కార్తీక్‌కి తెలియదు. ఎవరో సినిమా హీరోయిన్ వచ్చిందని అప్పిగాడు టెంప్ట్ అవుతాడు. నువ్వొద్దు నేను వెళ్తాను ఆగు అని మోనిత వద్దకు అప్పి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ మేడం.. షూటింగ్ ఎక్కడ జరుగుతుంది.. సినిమా హీరోయిన్‌లా కనిపిస్తుంటే.. అని బిస్కట్ వేస్తాడు. కామెడీనా?.. అని మోనిత అంటుంది. ఆ సౌండ్ విని మోనిత వచ్చిందా? అని కార్తీక్ అనుకుంటాడు. అయితే మోనిత ఇక్కడికి ఎందుకు వస్తుందిలే అని అనుకుంటాడు.

    నా మీద ఒట్టు నిజం చెబుతున్నాను.. అని అప్పిగాడు అంటాడు. సరే నువ్ చెప్పింది నిజం అని నాకు అనిపిస్తోంది అని మోనిత అంటుంది. మోనిత వాయిస్‌లా ఉందేంటి.. అని కార్తీక్ అనుకుంటాడు. ఏం తింటారు మేడం అని అప్పిగాడు అడిగితే.. ఏం ఉన్నాయ్ అని మోనిత అడుగుతుంది. లిస్ట్ అంతా చెబుతాడు. చివరకు ఎగ్ బిర్యానీ, వాటర్ బాటిల్ పట్టుకున్ని రమ్మని ఆర్డర్ వేస్తుంది. అప్పిగాడేమో కార్తీక్‌కు ఆర్డర్ వేస్తాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    మరి రేపటి ఎపిసోడ్‌లో ఏమవుతుందో చూడాలి. ఇక మరో వైపు రుద్రాణి ఆగడాలు శ్రుతిమించిపోతోంటాయి. వచ్చే నెల రుద్రాణి బర్త్ డే.. ఇద్దరు పిల్లలకు గౌన్లు కుట్టమని ఇచ్చింది.. అవి మీ పిల్లల కొలతలే.. నీ చుట్టూ ఏదో జరుగుతోంది.. అంటూ చుట్టుపక్కల ఉండే ఆవిడ దీపకు చెబుతుంది. దీంతో దీప రెచ్చిపోతుంది. నేరుగా రుద్రాణి ఇంట్లోకి వెళ్లి వంట వండుతూ కనిపిస్తుంది దీప. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply